ఆటాపోటీ

డేంజరస్ గ్లోవ్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాక్సర్లు వేసుకునే గ్లోవ్స్‌తో ప్రమాదాలు తగ్గుతాయని, వాటి వల్ల బలమైన గాయాలు తగలవని అనుకుంటారు. కానీ, నిజానికి గ్లోవ్స్ వల్ల జరిగే ప్రమాదాలే ఎక్కువ. ఉత్తి చేతులతో బాక్సింగ్ ఫైట్స్ కంటే గ్లోవ్స్ ధరించిన చేసిన ఫైట్స్‌లోనూ ఎక్కువ మంది బాక్సర్లు గాయపడ్డారు. చాలా మంది మృతి చెందారు. వాస్తవం చెప్పాలంటే, గ్లోవ్స్‌ను బాక్సర్ల రక్షణ కోసం కనిపెట్టలేదు. పంచ్‌లు బలంగా తగలాలని, తద్వారా బాక్సర్లు రక్తం ఓడుతుంటే చూసేందుకు ప్రేక్షకులు విరగబడతారనీ వాటిని రూపొందించారు. నాకౌట్ ఫలితాలు రావడానికి గ్లోవ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయంటే ఆశ్చర్యం కలగక మానదు.