ఆటాపోటీ

జపాన్‌లో ఆటల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపాన్‌లో క్రీడల సందడి గతంలో ఎన్నడూ లేని విధంగా జోరందుకుంది. ఐచీ ప్రావీన్స్ రాజధాని నగోయాను 2026 ఆసియా క్రీడలకు సంయుక్త ఆతిథ్య నగరంగా డనాంగ్ (వియత్నాం)లో సమావేశమైన ఆసియా ఒలింపిక్ మండలి (ఒసిఎ) నిర్ణయించింది. నిజానికి ఈ నిర్ణయాన్ని 2018లో తీసుకోవాల్సి ఉంది. అయితే, రానున్న ఎనిమిదేళ్ల కాలంలో మూడు వేర్వేరు ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో, ఆతిథ్య దేశాలకు తగినంత వెసులుబాటును కల్పించే ఉద్దేశంతో తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతోపాటు దానిని ఒసిఎ ఆమోదించింది. 2018 వింటర్ ఒలింపిక్స్ దక్షిణ కొరియాలోని పయోన్‌చాంగ్‌లో జరుగుతాయి. 2020 సమ్మర్ ఒలింపిక్స్‌కు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యమిస్తుంది. 2022లో వింటర్ ఒలింపిక్స్ బీజింగ్ (చైనా) కేంద్రంగా జరుగుతాయి. మొత్తానికి 2026 ఆసియా క్రీడల నిర్వాహణ అవకాశాన్ని దక్కించుకోవడం ద్వారా జపాన్‌లో ఆటల సందడి మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. వచ్చే ఏడాది ఆసియా వింటర్ గేమ్స్ జపాన్‌లో జరుగుతాయి. ఆతర్వాత, 2019లో రగ్బీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలు ఉంటాయి. 2021లో ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్‌ను కూడా జపాన్ నిర్వహిస్తోంది. 2020 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తుంది. కాగా, ఆసియా క్రీడలకు జపాన్ ఎంపిక కావడం ఇది మూడోసారి. 1958లో టోక్యో, 1994లో హిరోషిమాలో ఆసియా క్రీడలు జరిగాయి.