ఆటాపోటీ

నాడు మిత్రులు.. నేడు శత్రువులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫార్ములా వన్ రేస్‌లో ఇద్దరు ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆరంభంలో మంచి మిత్రులు. కానీ, చాలకాలంగా ప్రత్యర్థుల్లా మారిపోయారు. కత్తులు దూస్తున్నారు. ప్రపంచ సర్క్యూట్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, 2014, 2015 సంవత్సరాల్లో వరుసగా రెండు పర్యాయాలు , ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన లూయిస్ హామిల్టన్‌కు ఈఏడాది తన జట్టుకే చెందిన నికో రోజ్‌బెర్గ్ నుంచి తీవ్ర స్థాయిలో పోటీ ఎదురైంది. మెర్సిడిజ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను జట్టు ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించిన రోజ్‌బెర్గ్ గతంలో ఎన్నడూ తన సహచర డ్రైవర్ హామిల్టన్‌ను ఓవర్‌టేక్ చేయలేదు. ఒకవేళ తాను లక్ష్యం పైపు దూసుకెళుతున్నప్పటికీ, వెనుక నుంచి హామిల్టన్ ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తే, అతనికి దారిచ్చాడు. కానీ, హామిల్టన్ మాత్రం రోజ్‌బెర్గ్‌కు పూర్తి భిన్నంగా వ్యవహరించాడు. గత ఏడాది రోజ్‌బెర్గ్ టైటిళ్లను సాధించే స్థితిలో ఉన్నప్పటికీ, హామిల్టన్ దారి ఇవ్వకపోవడంతో అతను వాటిని చేజార్చుకున్నాడు. దీనితో ఇద్దరు మిత్రుల మధ్య శత్రుత్వం మొదలైంది. బహిరంగ విమర్శలు, ఆరోపణలు సామాన్యమయ్యాయి. జట్టు యాజమాన్యం జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినప్పటికీ అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. గత ఏడాది హామిల్టన్ కోసం విజయావకాశాలను స్వచ్ఛందంగానే జారవిడుచుకున్న రోజ్‌బెర్గ్ ఈ ఏడాది ఆరంభంలో వరుసగా నాలుగు రేసుల్లో గెలిచి, ప్రపంచ చాంపియన్‌గా నిలిచే సత్తా తనకు ఉందని నిరూపించుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పోటీ తీవ్రమైంది. రోజ్‌బెర్గ్‌ను ఓడించడానికి హామిల్టన్ సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. తీవ్ర అసహనానికి గురవుతున్నాడు. ఇటీవల జరిగిన జపనీస్ రేస్‌లోకారు చెడిపోవడం అతని ఆగ్రహాన్ని మరింత పెంచింది. అన్ని సమస్యలూ తననే చుట్టుముడుతున్నాయంటూ మండిపడ్డాడు. నిర్వాహకులపై కేసు వేస్తానని హెచ్చరించాడు. వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్ హోదా తనకు దక్కకుండా కొంత మంది కుట్ర పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశాడు. అతని ఆరోపణలను పట్టించుకోకుండా రోజ్‌బెర్గ్ ఈ ఏడాదిని ప్రపంచ నంబర్ వన్‌గా ముగించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. అయతే, యుఎస్ గ్రాండ్ ప్రీ, మెక్సికన్ గ్రాండ్ ప్రీ రేసుల్లో హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి, రోజ్‌బెర్గ్‌కు సవాళ్లు విసురుతున్నాడు. ఈ ఏడాది చివరి రెండు రేసులు ఈనెల 13 (బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ), 27 (అబూదబీ గ్రాండ్ ప్రీ) తేదీల్లో జరుగుతాయ. వీటిలో ఫలితాలే ఈ ఏటి ప్రపంచ చాంపియన్ ఎవరనేది నిర్ణయస్తాయ.