ఆటాపోటీ

రష్యా టాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడల్లో డోపింగ్ మహమ్మారి తీవ్రత మరోసారి తెరపైకి వచ్చింది. వెయట్‌లిఫ్టింగ్‌లో ఈ దుష్ట సంప్రదాయం చాలా తీవ్ర స్థాయలో ఉంది. రెండో స్థానంలో రెజ్లింగ్ ఉంది. నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో, భారత వెయట్‌లిఫ్టింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ వేటు పడింది. జరిమానా చెల్లించుకొని, అతి కష్టం మీద సస్పెన్షన్ నుంచి సమాఖ్య బయటపడింది. రెజ్లింగ్‌లోనూ ఈ సమస్య వెళ్లూనుకుంటున్నదని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఇటీవల విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. ఒలింపిక్స్‌కు ఎంపికైన నర్సింగ్ యాదవ్ కూడా డోపింగ్ పరీక్షలో పట్టుబడడం మన దేశంలోనూ పెరుగుతున్న సమస్యకు అద్దం పడుతున్నది. వాడా నివేదిక, ఆ వెంటనే పలువురు ఒలింపిక్ విజేతలపై వేటు వంటి సంఘటనలు చాలాకాలంగా క్రీడారంగాన్ని పట్టిపీడిస్తున్న నిషిద్ధ మాదక ద్రవ్యాల వాడకాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతున్నాయ. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంతమందిపై సస్పెన్షన్ వేటును విధిస్తున్నా, డోపింగ్ కేసులు పెరుగుతున్నాయేగానీ తగ్గడం లేదు. డోప్ దోషులపై శాశ్వత నిషేధంతోపాటు కఠిన శిక్షలను కూడా అమలు చేస్తే కొంతలో కొంత వరకైనా ఫలితం ఉండవచ్చు.
ఈ ఏడాది జరిగిన రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించినప్పటికీ డోపింగ్‌లో పట్టుబడిన కారణంగా రష్యా స్టార్ లిఫ్టర్ తాతియానా కషిరినాపై వేటు పడింది. ఆమె ఒలింపిక్స్‌లో పాల్గొనలేకపోయింది. అయితే, సూపర్ లిఫ్టర్‌గా పేరుతెచ్చుకున్న కషిరినా మాత్రమేకాదు... రష్యా వెయిట్‌లిఫ్టింగ్ బృందంలోని మిగతా ఏడుగురు లిఫ్టర్లూ డోపింగ్ కారణంగానే అనర్హత వేటుకు గురయ్యారు. నిషిద్ధ మాదక ద్రవ్యాలను ఉపయోగించిన కారణంగా ఒక దేశానికి ప్రాతినిథ్యం వహించే ఒక క్రీడాంశానికి చెందిన బృందంలోని అందరిపైనా వేటు పడడం ఒలింపిక్స్ చరిత్రలో ఇదే మొదటిసారి. మిగతా క్రీడలకు డోపింగ్ సమస్య లేదనిగానీ, అన్ని క్రీడలూ చాలా క్లీన్‌గా ఉన్నాయనిగానీ చెప్పడానికి వీల్లేదు. అయితే, ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన ఎనిమిది మంది సభ్యులతో కూడిన రష్యా బృందంపై అనర్హత వేటు పడడడం వెయిట్‌లిఫ్టింగ్‌లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని స్పష్టం చేస్తున్నది. కజకిస్థాన్, బల్గేరియా, సెర్బియా, క్రొయేషియా, ఎల్‌సాల్వడార్, మంగోలియా తదితర దేశాలకు చెందిన లిఫ్టర్లు కూడా చాలా మందిపైనా అనర్హత వేటు పడింది. డోపింగ్ కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా రష్యా, కజకిస్థాన్, బల్గేరియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలపై వేటు వేయాలని, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా నిషేధించాలని ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య నిర్ణయించింది. టెక్నిక్ కంటే బలమే కీలక పాత్ర పోషించే ఈ క్రీడలో అదనపు బలం కోసం, శారీరక సౌష్టవాన్ని నిలబెట్టుకోవడం కోసం లిఫ్టర్లు రకరకాలైన బలవర్ధక ఆహారాన్ని, పానీయాలను తీసుకుంటారు. ఇది సహజం. అయితే, ఈ పేరుతో చాలా మంది నిషిద్ధ మాదక ద్రవ్యాలను కూడా యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. కొద్ది మంది మాత్రం తాము తీసుకుంటున్న ఆహారం లేదా పానీయాల్లో ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) నిషిద్ధ జాబితాలో ఉన్న ఔషధాలు ఉన్నాయని తెలియకుండా పొరపాటు చేసి పట్టుబడుతున్నారు. కారణాలు ఏవైనా డోపింగ్ సమస్య వెయిట్‌లిఫ్టింగ్‌లోనే ఎక్కువగా ఉందనేది వాస్తవం. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని చట్టం చెప్తున్నది. దీనికితోడు వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలను రష్యా ఇప్పటికే ఎదుర్కొంటున్నది. అందుకే, ఆ దేశానికి చెందిన ఎనిమిది మంది వెయిట్‌లిఫ్టర్లపై వేటు పడినా ఎవరూ తీవ్రంగా స్పందించలేదు. రష్యాకు ఇది అలవాటైన పనేనంటూ పెదవి విరుస్తున్నారు. అయితే, వ్యూహాత్మక డోపింగ్ ఆరోపణలను ఖండించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఇకపై తమ దేశంలో స్వచ్ఛతతో కూడిన క్రీడలను చూడవచ్చని అంటున్నాడు. అతని మాట చెల్లుబాటు అవుతుంతా అన్నదే ప్రశ్న.