ఆటాపోటీ

ఆదుకున్న సాక్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తారని అభిమానులు కోటి ఆశలతో ఎదురు చూస్తుండగా, ఒక్కొక్కరే చేతులెతేస్తుంటే, పతకాల ఖాతాను తెరవకుండా దిగాలు పడిన భారత్‌ను సాక్షి మాలిక్ ఆదుకుంది. అప్పటి వరకూ అన్ని విభాగాల్లోనూ భారత అథ్లెట్లు నిరాశ పరిచారు. అయతే, మహిళల 58 కిలోల ఫ్రీస్టయిల్‌లో రెజ్లింగ్‌లో సాక్షి కాంస్య పతకాన్ని సాధించి దేశ పరువును నిలిపింది. 48 కిలోల ఫ్రీస్టయిల్ ప్రీ క్వార్టర్స్‌లో వినేష్ ఫొగట్ గాయపడి నిష్క్రమించింది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్, సందీప్ తోమర్, రవీందర్ ఖత్రి, హర్దీప్ సింగ్ దారుణంగా విఫలమయ్యారు. డోపింగ్ పరీక్షలో పట్టుబడినప్పటికీ, భారత జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) అనుమతితో రియోకి వెళ్లినప్పటికీ ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) వేసిన కేసుతో చిక్కుల్లో పడ్డాడు. అతనిపై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్టు అంతర్జాతీయ క్రీడా వివాదాల మధ్యవర్తిత కోర్టు ప్రకటించడంతో పోటీకి దిగే అవకాశం అతనికి దక్కలేదు. మొత్తం మీద సాక్షి మాలిక్‌ను మినహాయిస్తే, రెజ్లంతా మూకుమ్మడిగా నిరాశ పరిచారు. ఆమె తొలి పతకాన్ని సాధించి ప్రేరణగా నిలిస్తే, ఆ తర్వాత బాడ్మింటన్‌లో పివి సింధు రజత పతకాన్ని అందించింది.