ఆటాపోటీ

డేర్‌డెవిల్స్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటగాళ్లపై భారీగా ఖర్చు చేసిన ఫ్రాంచైజీల జాబితాలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. 14 మంది ఆటగాళ్ల కోసం ఆ ఫ్రాంచైజీ 31 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ నలుగురు ఆటగాళ్ల సగటు బేస్‌ప్రైస్ 4.5 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ, డేర్‌డెవిల్స్ సగటున 6.89 రెట్లు మొత్తాన్ని వెచ్చించింది. కాగా, చాలా పొదుపుగా ఖర్చు చేసిన ఫ్రాంచైజీ గుజరాత్ లయన్స్. 19 మంది ఆటగాళ్లను కొనడానికి బేస్‌ప్రైస్ కంటే 1.77 రెట్లు అధికంగా ఖర్చుచేసింది. గుజరాత్ మాదిరిగానే ఐపిఎల్‌లో కొత్తగా అడుగుపెట్టిన మరో ఫ్రాంచైజీ రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ కూడా బేస్‌ప్రైస్ కంటే 1.98 రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది. మిగతా ఫ్రాంచైజీలు కనీసం రెండుమూడు రెట్లు అధిక మొత్తాలను చెల్లించాయి. మొత్తం మీద ఫ్రాంచైజీలు ఖర్చు చేసిన 136 కోట్ల రూపాయల్లో భారత ఆటగాళ్ల బేస్‌ప్రైస్ 47 కోట్ల రూపాయలు.
ఈసారి ఐపిఎల్‌లో కొత్త రెండు జట్లు ప్రవేశించగా, అంతకు ముందు నుంచి ఉన్న ఆరు ప్రాంచైజీల్లో ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లను కొనుగోలు చేసిన రికార్డు కూడా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌దే. ఆ ఫ్రాంచైజీ 14 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్ అతి తక్కువగా చెరి ఏడుగురు ఆటగాళ్లను తీసుకున్నాయి. ఒక ఫ్రాంచైజీ అత్యధికంగా 27 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఈ కోటాను పూర్తి చేసిన ఏకైక ఫ్రాంచైజీ డేర్‌డెవిల్స్. అదే విధంగా విదేశీ ఆటగాళ్లు తొమ్మిదికి మించకుండా ఉండాలనే నిబంధన ఉంది. అత్యధికంగా విదేశీ క్రీడాకారులను తీసుకున్న ఫ్రాంచైజీలు కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.