ఆటాపోటీ

టెన్నిస్‌లో తోబుట్టువుల హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నాదమ్ములు లేదా అక్కాచెల్లెళ్ల సవాళ్లు మిగతా క్రీడల్లో మాదిరిగానే టెన్నిస్‌లోనూ చాలాకాలంగా కొనసాగుతున్నాయ. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో ‘విలియమ్స్ సిస్టర్స్’ వీనస్, సెరెనా విలియమ్స్ పోటీపడడంతో మరోసారి తోబుట్టువుల హవా తెరపైకి వచ్చింది. మన దేశంలో విజయ్ అమృత్‌రాజ్, ఆనంద్ అమృత్‌రాజ్, అశోక్ అమృత్‌రాజ్ సోదరులు టెన్నిస్‌కు సరికొత్త గుర్తింపును తెచ్చిపెట్టారు. ఒక రకంగా, రామనాథన్ కృష్ణన్ తర్వాత అమృత్‌రాజ్ సోదరుల వల్లే మన దేశంలో టెన్నిస్‌పై అందరికీ ఆసక్తి పెరిగింది. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నది. కీర్తనే సోదరులు, భంబ్రీ తోబుట్టువులు టెన్నిస్‌లో కుటుంబాల ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. ఈ ఒరవడి ఇక్కడితో ఆగే అవకాశాలు కనిపించడం లేదఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అక్కాచెల్లెళ్లు వీనస్, సెరెనా విలియమ్స్ ఢీకొన్నారు. చెల్లెలు సెరెనా టైటిల్ గెలిస్తే, అక్క వీనస్ రన్నర్ ట్రోఫీని తీసుకుంది. విజేత ఎవరైతేనేం.. ట్రోఫీ ‘విలియమ్స్’ కుటుంబానికే దక్కింది. వీళ్లిద్దరూ కలిసి మొత్తం 30 గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిళ్లను ఇంటికి అందించారు. ఈ విధంగా, టెన్నిస్‌లో తోబుట్టువులు రాణించడం, ఒకరితో ఒకరు పోటీపడుతూ ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడం కొత్తేమీ కాదు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు ఆండీ ముర్రే సోదరుడు జెమీ ముర్రే కూడా టెన్నిస్ ఆటగాడే. ఇద్దరూ డబుల్స్ విభాగంలో కలిసి మ్యాచ్‌లు ఆడతారు. ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ పేరు అందరికీ చిరపరచితమే. అయితే, అతని సోదరులు జోర్డీ జొకోవిచ్, మార్కో జొకోవిచ్ సైతం టెన్నిస్ ఆడతారు. నొవాక్ మాదిరి వారు అత్యున్నత శిఖరాలను అధిరోహించలేకపోయినా, ప్రొఫెషనల్ ప్లేయర్స్‌గా బాగానే సంపాదిస్తున్నారు. ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆండీ ముర్రేను ఓడించి సంచలనం సృష్టించిన మిచా జ్వెరెవ్, అతని సోదరుడు అలెగ్జాండర్ జ్వెరెవ్ టెన్నిస్‌లో సత్తా చాటుతున్నారు. ‘రద్వాన్‌స్కా’ సిస్టర్స్ అగ్నీస్కా, ఉర్జులా కూడా టెన్నిస్‌లో రాణిస్తున్నారు. పోలాండ్‌కు చెందిన వీరిలో అగ్నీస్కా మెరుగైన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. పురుషుల డబుల్స్ విభాగంలో తిరుగులేని జోడీ బాబ్ బ్రియాన్, మైక్ బ్రియాన్. వీళ్లిద్దరూ కలిసి 16 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు కైవసం చేసుకున్నారు. అన్నా చెల్లెలు మారత్ సఫిన్, దినారా సఫిన్ తమతమ విభాగాల్లో ప్రపంచ నంబర్ వన్ స్థానానికి ఎదిగారు.
టెన్నిస్ చరిత్రలోనే జాన్ మెకెన్రోను మించిన కోపిష్టి ఆటగాళ్లు ఎవరూ లేరు. ప్రత్యర్థులతోనేకాదు.. రిఫరీలతో.. చివరికి ప్రేక్షకులతో కూడా ఘర్షణ పడే తత్వం అతనిది. సంపాదించిన మొత్తంలో ఎక్కువ భాగాన్ని జరిమానాల కిందే చెల్లించిన క్రీడాకారుడు కూడా అతనే. జాన్ మెకెన్రో సోదరుడు ప్యాట్రిక్ కూడా మెకెన్రో కూడా పేరుపొందిన టెన్నిస్ ఆటగాడే. కానీ, అన్నలాగా అతను అపర దుర్వాసుడు కాడు. ‘బ్లేక్’ కుటుంబం కూడా టెన్నిస్‌లో అద్భుత ప్రతిభాపాటవాలు ప్రదర్శించింది. బైరన్ బ్లేక్, వేన్ బ్లాక్ పురుషుల విభాగంలో పలు టోర్నీలు ఆడారు. వీరి చెల్లెలు కారా బ్లేక్ ప్రపంచ మేటి క్రీడాకారిణిగా ప్రశంసలు అందుకుంది. కుటుంబాల విషయానికి వస్తే ‘మలీవా’, ‘సాంచెజ్’ పేర్లను తప్పనిసరిగా ప్రస్తావించాల్సి ఉంటుంది. 1960 దశకంలో యూలియా బెర్బెర్యాన్ టెన్నిస్ ఆడింది. కానీ, అనుకున్న స్థాయికి ఎదగలేకపోయింది. అందుకే, తన ముగ్గురు కుమార్తెలకు చిన్నతనం నుంచే శిక్షణనిచ్చింది. వారిని ప్రొఫెషనల్ క్రీడాకారిణులుగా తీర్చిదిద్దింది. ‘మలీవా సిస్టర్స్’గా పేరొందిన ముగ్గురిలో మగ్దలీన మలీవా ప్రపంచ ర్యాంకింగ్స్ ‘టాప్-10’ స్థానం సంపాదించింది. ఆమె అక్క మనూలా మలీవా కెరీర్‌లో 39 సింగిల్స్, 11 డబుల్స్ టైటిళ్లను గెల్చుకుంది. ఆమె చెల్లెలు కతరీన మలీవా 1994 యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఇక ‘సాంచెజ్’ పేరు వింటే వెంటనే గుర్తుకొచ్చే పేరు అరంటా. ప్రపంచ టాప్ ర్యాంకింగ్స్‌లో స్థానం పొందిన అరంటా సాంచెజ్ వికారియో 1990 దశకంలో ఎంతో మంది మేటి క్రీడాకారిణులకు సవాళ్లు విసిరింది. ఆమె ఇద్దరు అక్కలు ఎమిలీ, మరిసా కొంతకాలం ప్రొఫెషనల్ క్రీడాకారిణులుగా కొనసాగారు. వీరి సోదరుడు జేవియర్ సాంచెజ్ కెరీర్‌లో నాలుగు మేజర్ టైటిళ్లను గెల్చుకున్నాడు. 1979లో, 16 సంవత్సరాల వయసులోనే యుఎస్ ఓపెన్ టైటిల్ సాధించి ట్రాసీ ఆస్టిన్ సంచలనం సృష్టించింది. ఆమె సోదరుడు జాన్ ఆస్టిన్ అమెరికా డేవిస్ కప్ సభ్యుడు. ఒకప్పటి టాప్ ర్యాంక్ క్రీడాకారిణి హెలెనా సుకోవా, సిరిల్ సాక్ తోబుట్టువులు. జినే మేయర్, సాండీ మేయర్ కూడా ఒక తల్లి పిల్లలే. అనస్తాసియా రొడియోనొవా, ఆమె చెల్లెలు అరినా రొడియోనొవా అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణులు. హావో చింగ్, యుంగ్ జాన్ చెన్ కూడా టెన్నిస్ సిస్టర్సే. క్రిస్టినా ప్లిస్కోవా, కరోలినా ప్లిస్కోవా సోదరీమణులు కూడా ప్రొఫెనల్ స్టార్లే.
మన దేశంలోనూ టెన్నిస్‌లో అత్యున్నత ప్రమాణాలు అందుకున్న అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు లేకపోలేదు. విజయ్ అమృత్‌రాజ్, ఆనంద్ అమృత్‌రాజ్, అశోక్ అమృత్‌రాజ్ సోదరులు టెన్నిస్ ప్రపంచంలో భారత్‌కు గుర్తింపును సంపాదించిపెట్టారు. కీర్తనే సోదరులు సందీప్, నితిన్ కూడా ప్రొఫెషనల్ టెన్నిస్‌లో రాణించారు. అంకిత భంబ్రి, సనా భంబ్రి, వారి సోదరుడు యుకీ భంబ్రీ భారత టెన్నిస్‌పై తమదైన ముద్ర వేశారు. ఇలా చెప్తూపోతే తోబుట్టువుల జాబితాకు అంతే ఉండదు. అయితే, వీనస్, సెరెనా లేదా బాబ్, మైక్ బ్రియాన్ మాదిరి తమతమ విభాగాల్లో ప్రపంచ నంబర్ వన్‌ను అందుకున్న వారు తక్కువ. ఒకరు అత్యుత్తమ నైపుణ్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే, మరొకరు వారికి మద్దతునిచ్చే పాత్రను పోషించారే తప్ప, ఆ స్థాయికి ఎదగలేదు. ఏదైతేనే టెన్నిస్‌లో తోబుట్టువుల హవా నాడూ నేడూ ఒకే విధీం గా ఉంది. అంతర్జాతీయ సర్క్యూట్‌ను పరిశీలిస్తే ఇటీవల కాలంలో కొంత పెరిగిందనే చెప్పాలి.

సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్

బాబ్ బ్రియాన్, మైక్ బ్రియాన్

అమృత్‌రాజ్ సోదరులు (ఎడమ నుంచి కుడికి) అశోక్, విజయ్, ఆనంద్

- ఎస్‌ఎంఎస్