ఆటాపోటీ

ఐపిఎల్ గోదాలో రేసుగుర్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇతనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయ. అందుకు తగినట్టుగానే అతను ఫామ్‌లోకి వచ్చాడు

పదో ఐపిఎల్‌లో మొదటి రెండు వారాల మ్యాచ్‌లు పూర్తయ్యే సమయానికి వివి ధ జట్ల కెప్టెన్ల మధ్య ఆధిప త్యపోరు స్పష్టంగా కనిపిస్తు న్నది. ఈ రేసులో ఎవరు గె లిచినా, ఎవరు ఓడినా, అభి మానులకు పసంతదైన క్రికె ట్ విందు ఖాయం. రెండు వా రాల మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే, చాలా మంది కెప్టెన్లు సఫలమైతే, కొంత మంది మాత్రమే అనూహ్యంగా విఫలమవుతున్నారు. స్థూలంగా చూస్తే చాలా మంది కెప్టెన్లు తమతమ జట్లలోని మిగతా ఆటగాళ్ల కంటే మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. స్ఫూర్తిదాయక కెప్టెన్సీతో అందరి మన్ననలు పొందుతున్నారు. కెప్టెన్లు గొప్పగా ఆడిన జట్లకు చెందిన ఆటగాళ్లే ఇప్పటి వరకూ బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. కెప్టెన్లు మార్గదర్శకులుగా మారితే, మిగతా వారంతా స్ఫూర్తిదాయకమైన ఆటతో అభిమానులను ఆకట్టుకుంటారని మొదటి రెండు వారాల ఐపిఎల్ మ్యాచ్‌లు నిరూపించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నిరుడు అందరి కంటే ఎక్కువ పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఈసారి మొదటి ఐదు ఇన్నింగ్స్‌లో అతను 235 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 76 (నాటౌట్) పరుగులు. అతని స్ట్రయిక్ రేట్ 78.33 పరుగులు. నిరుటి స్ట్రయిక్ రేట్ 137.42 పరుగులతో పోలిస్తే ఈసారి అతను ఆశించిన స్థాయిలో రాణించడం లేదని స్పష్టమవుతుంది. కాగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ కేవలం 4 పరుగులకే అవుటయ్యాడు. ఈ ఐపిఎల్‌లో అతనికి ఇది ఆరో ఇన్నింగ్స్. తొమ్మిదో ఐపిఎల్ నుంచి ఈసారి ఐదో మ్యాచ్ వరకూ అతను 17 ఇన్నింగ్స్ ఆడాడు. ఒక్కసారి కూడా సింగిల్ డిజిట్‌కు అవుట్‌కాలేదు. హైదరాబాద్‌లో డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్ అతనిని నాలుగు పరుగులకే పరిమితం చేసింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ కూడా ఇంతకు ముందు ఆరెంజ్ క్యాప్‌ను సాధించిన గొప్ప బ్యాట్స్‌మనే. అతను కూడా మొదటి రెండు వారాలు ముగిసే సమయానికి ఐదు మ్యాచ్‌లు ఆడి 196 పరుగులు చేశాడు. వార్నర్ మాదిరిగానే ఈసారి అతని అత్యధిక స్కోరు 76 (నాటౌట్). గంభీర్ సగటు 65.33 పరుగులు. కాగా, గంభీర్ నాయకత్వంలో నైట్ రైడర్స్ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా కొనసాగుతున్నది. పదో ఐపిఎల్‌ను కైవసం చేసుకునే సత్తావున్న జట్లలో నైట్‌రైడర్స్ కూడా ఒకటి. గంభీర్ బ్యాటింగ్ ప్రతిభ, కెప్టెన్‌గా అతనికి ఉన్న అనుభవం, సామర్థ్యం నైట్‌రైడర్స్‌కు కొంతడంత అండ.
రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ అనూహ్యంగా మహేంద్ర సింగ్ ధోనీని తప్పించి, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కు పగ్గాలు అప్పగించడం పదో ఐపిఎల్ ఆరంభంలో చర్చనీయాంశమైంది. అయితే, తన ఎంపిక పొరపాటు కాదని స్మిత్ నిరూపించాడు. అనారోగ్యం కారణంగా అతను ఒక మ్యాచ్‌కి దూరమైనప్పటికీ, నాలుగు ఇన్నింగ్స్‌లో 180 పరుగులు సాధించాడు. అతని సగటు 60 పరుగులుకాగా, స్ట్రయిక్ రేట్ 133. చెప్పుకోదగ్గ స్టార్లు లేకపోవడంతో, ఎలాంటి అంచనాలు లేకుండానే ఐపిఎల్‌లోకి అడుగుపెట్టిన పుణే ఐదు మ్యాచ్‌ల్లో రెండింటిని గెల్చుకుంది. మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. స్టీవెన్ స్మిత్ కెప్టెన్సీలో ఈ జట్టు తన ప్రత్యర్థులకు గట్టిపోటీనిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
గుజరాత్ లయన్స్ నిరుడు గ్రూప్ దశ ముగిసే సమయానికి టేబుల్‌లో టాప్‌గా నిలిచింది. అయితే, నాకౌట్ మ్యాచ్‌ల్లో విఫలమై, ఫైనల్ చేరలేకపోయింది. ఆ జట్టుకు నాయకత్వం వహిస్తున్న సురేష్ రైనా ఐపిఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. అతను ఈసారి ఐదు ఇన్నింగ్స్‌లో 159 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 68 (నాటౌట్) పరుగులు. అయితే, రైనా ఎంత ప్రయత్నిస్తున్నా, మిగతా వారి నుంచి సరైన సహకారం లేకపోవడంతో గుజరాత్ విజయాలను అందిపుచ్చుకోలేకపోతున్నది. ఐదు మ్యాచ్‌ల్లో ఈ జట్టు కేవలం ఒక మ్యాచ్‌ని గెల్చుకుంది. మిగతా నాలుగింటిని చేజార్చుకొని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.
భారత్‌కు అన్ని ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించిన తర్వాత విరాట్ కోహ్లీపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే, భుజం గాయం కారణంగా అతను మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయాడు. ఆతర్వాత మూడు మ్యాచ్‌లు ఆడి, 154 పరుగులు చేశాడు. అతని సగటు 51.33 పరుగులుకాగా, స్ట్రయిక్ రేట్ 132.75. కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిరుటి రన్నరప్‌గా ఈసారి ఐపిఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించి, మొదటి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది. మొత్తం మీద రెండు వారాలు పూర్తయ్యే సమయానికి ఈ జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడి, రెండు విజయాలకు పరిమితమైంది. నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదురుకావడంతో, మిగతా మ్యాచ్‌లు బెంగళూరుకు అత్యంత కీలకంగా మారాయి. కోహ్లీ ఫామ్‌ను కొనసాగిస్తే, బెంగళూరు ప్రత్యర్థులను అధిగమిస్తూ, పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లే అవకాశాలు లేకపోలేదు.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు గ్లేన్ మాక్స్‌వెల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతను భారీ స్కోర్లు నమోదు చేయకలేకపోతున్నా, రన్‌రేట్ మెరుగ్గా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌లో 122 పరుగులు చేసిన అతని అత్యధిక స్కోరు 44 (నాటౌట్) పరుగులు. 40.66 సగటుతో మాక్స్‌వెల్ సాదాసీదా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఆరో మ్యాచ్‌లో అతను 18 బంతుల్లో నే 40 పరుగులు చేసినప్పటికీ, కెప్టెన్‌గా మిగతా వారితో పోటీపడలేకపోతు న్నాడు. ఆరో మ్యాచ్‌ని గెలిచినప్పటికీ, పంజాబ్ జట్టు గొప్పగోప్ప విజయాలు సాధిస్తుందనిగానీ, గొప్ప ఫలితాలను రాబడుతుందనిగానీ ఎవరూ ఊహించలేదు. మొత్తం మీద ఈ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడి, రెండింటిని గెల్చుకుంది. మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. మాక్స్‌వెల్ సేన ఈసారి ఐపిఎల్ టైటిల్ రేసులో లేదనే చెప్పాలి.
ముంబయి ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చేందుకు శ్రమిస్తున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌లో కేవలం 49 పరుగు చేయడమే అతని వైఫల్యాలకు నిదర్శనం. అత్యధిక స్కోరు 40 (నాటౌట్) పరుగులు. అంటే, మిగతా మ్యాచ్‌ల్లో అతను చేసింది కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే. కెప్టెన్ పరుగులు కొల్లగొట్టలేకపోతున్నప్పటికీ, మిగతా ఆటగాళ్లు బాధ్యతాయుతంగా ఆడడంతో ముంబయి ఇండియన్స్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఈ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. కేవలం ఒక మ్యాచ్‌ని కోల్పోయి, పాయింట్ల పట్టికలో నైట్ రైడర్స్ తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించింది. కెప్టెన్‌పై ఆధారపడకుండా ముందుకు వెళుతున్న ఈ జట్టు ఎంత వరకూ ఇదే ఒరవడిని కొనసాగిస్తుందో చూడాలి.
పదో ఐపిఎల్‌లో ఒక జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఏకైక బౌలర్ జహీర్ ఖాన్. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న జహీర్ ఐదు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఆ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో రెండింటిని గెల్చుకుంది. మూడు మ్యాచ్‌లను కోల్పోయింది. తాజా మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ చేతిలో ఓడిన డేర్‌డెవిల్స్‌ను ఎవరూ టైటిల్ రేసులో ఉన్న జట్టుగా పరిగణించడం లేదు. అయితే, జహీర్ ఖాన్ ఫిట్నెస్ అంశం ఒక్కటే ఆసక్తి రేపుతున్నది. మొత్తం మీద చాలా మంది స్టార్ ఆటగాళ్ల మాదిరిగానే ఈసారి ఐపిఎల్‌లో కెప్టెన్ల ప్రస్థానం కూడా ఒడిదుడుకుల మధ్య సాగుతున్నది. వైఫల్యాలను ఎదుర్కొంటున్న వారు త్వరగా కోలుకొని, తమతమ జట్లకు అండగా నిలుస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. వారి అంచనాల మేరకు కెప్టెన్లు రాణించి స్ఫూ ర్తిదాయకంగా నిలుస్తారని ఆశిద్దాం.