ఆటాపోటీ

‘డక్‌వర్త్ లూయిస్’పై మళ్లీ విమర్శలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డక్‌వర్త్ లూయిస్ విధానంపై మళ్లీ విమర్శలు తెరపైకి వచ్చాయి. అసలు ఈ విధానం తనకు ఏమాత్రం అర్థం కావడం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌కి సుమారు గంటన్నరపాటు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆట నిలిచిపోయే సమయానికి ఆస్ట్రేలియా 18.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 118 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షంవల్ల ఆట నిలిచిపోగా, మళ్లీ ఆట మొదలు కావడానికి గంటన్నర పట్టింది. దీనితో టీమిండియా లక్ష్యాన్ని 6 ఓవర్లలో 48 పరుగులుగా నిర్ధారించారు. దీనిని కోహ్లీ బృందం మరో మూడు బంతులు మిగిలి ఉండగానే, కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. అయితే, తన దృష్టిలో భారత్ లక్ష్యం 6 ఓవర్లలో 40 పరుగులుగా ఉండాలని, కానీ, 48 పరుగులుగా నిర్ధారించడం ఏమిటో అర్థం కావడం లేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు. నిజానికి అసలు డక్‌వర్త్ లూయిస్ విధానాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నానని అన్నాడు. కోహ్లీ మాటలు డక్‌వర్త్ లూయిస్‌పై మరోసారి చర్చకు ఆస్కారమిచ్చాయి. ఇప్పటికే ఎంతోమంది క్రికెటర్లు, జట్లు ఈ విధానం హేతుబద్ధంగా లేదని విమర్శలు గుప్పిస్తుంటే, మరో పద్ధతిని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న డిమాండ్ జోరందుకుంది. తాజా వివాదంతో డక్‌వర్త్ లూయిస్‌పై శాస్ర్తియమైన విశే్లషణ నిర్వహించి, లోపాలను సవరించడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రయత్నిస్తుందేమో చూడాలి.