ఆటాపోటీ

నేమార్‌తో కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రికార్డు ధరకు బార్సిలోనా నుంచి ప్రత్యేకంగా పిలిపించుకున్న బ్రెజిల్ సాకర్ స్టార్ నేమార్ వల్ల పారిస్ సెయింట్ జెర్మెయిన్ (పిఎస్‌జి)కు లాభం కంటే నష్టమే ఎక్కువన్న అనుమానం వ్యక్తమవుతుంది. అందుకు కారణం లేకపోలేదు. ఇన్నాళ్లూ పిఎస్‌జి చీఫ్ కోచ్‌గా తిరుగులేని పట్టును కొనసాగిస్తూ, ఆటగాళ్లను తన కనుసన్నల్లో ఉంచుకోగలిగిన ఉనాయ్ ఎమెరీకి నేమార్ రాకతో సమస్యలు మొదలయ్యాయి. అత్యంత ఖరీదైన ఈ ఆటగాడిని ఏ విధంగా డీల్ చేయాలో, అతని నుంచి ఏ విధంగా అత్యుత్తమ సేవలు రాబట్టాలో తెలియకు అతను తలపట్టుకుంటున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో సైతం నేమార్‌కు సలహాలు, సూచనలు ఇవ్వడానికి భయపడుతున్నాడు. అతనికి దూరంగా ఉంటూ, మిగతా వారికి గతంలో మాదిరి ఆదేశాలు జారీ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నాడు. ఇలాంటి సూపర్ స్టార్ ఇమేజ్ గల ఆటగాడు జట్టులో ఉంటే కష్టమేనంటూ కుమిలిపోతున్నాడు.