ఆటాపోటీ

దక్కేది ‘బూడిదే’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘యాషెస్’ కప్పు ఇంగ్లాండ్ వద్ద ఉంది. ఈ నెల 23 నుంచి జనవరి 8వ తేదీ వరకూ ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్‌లో టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఇంగ్లాండ్ సమాయాత్తమైంది. గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆస్ట్రేలియా కత్తులు దూస్తున్నది. సాధారణ పరిస్థితుల్లో ఆసీస్‌ను హాట్ ఫేవరిట్‌గా పేర్కోవాలి. అంతేగాక, స్వదేశంలో ఆడడం ఆ జట్టుకు అదనపు బలం. కానీ, ఆటగాళ్లలో క్రమశిక్షణ లోపించడంతోపాటు ఇటీవల కాలంలో అనుకున్న స్థాయలో రాణించలేకపోవడం ఆసీస్ అభిమానులను కలవరానికి గురిచేస్తున్నాయ. ఈ జట్టు ఎంత వరకూ మళ్లీ ఫామ్‌లోకి వస్తుందో చూడాలి. ఇంగ్లాండ్‌ను చిత్తుచేయడానికి ఏ స్థాయలో పోరాడుతుందనేది ఆసక్తి రేపుతున్నది. మొత్తం మీద ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డుతాయ కాబట్టి, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌లో ప్రతి క్షణం ఒక గొప్ప పోరాటాన్ని ఆవిష్కరించడం, చిరస్మరణీయ అనుభూతిని మిగల్చడం ఖాయం.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ప్రతి రెండేళ్లకోసారి జరిగే భీకర యుద్ధం కేవలం ‘బూడిద’ను దక్కించుకోవడానికే అన్నది ఆశ్చర్యానికి గురిచేసే వాస్తవం. ‘యాషెస్’ సిరీస్‌గా ప్రఖ్యాతి గాంచిన టెస్టు సిరీస్‌ను దక్కించుకోవడం ఈ రెండు జట్లకూ ప్రపంచ కప్ కంటే ఎక్కువస్థాయలో సర్వశక్తులూ ఒడ్డి పోరాడతాయి. అస్తశ్రస్త్రాలను సమకూర్చుకొని అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడతాయి. శతాబ్దాల చరిత్ర ఉన్న యాషెస్ సిరీస్‌కోసం హోరాహోరీ సమరానికి సమాయత్తమవుతాయి. ఈ నెల 23న మొదలై, జనవరి ఎనిమిదో తేదీతో ముగిసే యాషెస్ సిరీస్‌లో ఆడేందుకు ఆస్ట్రేలియాకు చేరుకున్న ఇంగ్లాండ్ జట్టు ట్రోఫీని నిలబెట్టుకుంటుందో లేక ప్రత్యర్థికి సమర్పించుకొని, రిక్త హస్తాలతో స్వదేశానికి చేరుతుందో చూడాలి. విజయం ఎవరిదైనా, యాషెస్ పాత్ర ఎవరికి దక్కినా, ఈ సిరీస్ ఆద్యంతం ఒక మహాయుద్ధాన్ని తలపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ కప్ కంటే ఈ సిరీస్‌నే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటారంటే, దీనికి ఉన్న ప్రాధాన్యతను ఊహించుకోవచ్చు.
యాషెస్ సిరీస్ చరిత్ర నిన్న మొన్నటిది కాదు. 1882 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తలపడే టెస్టు సిరీస్‌లను యాషెస్ పేరుతో పిలుస్తున్నారు. ఆ ఏడాది ‘ది ఓవల్’ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై ఆసీస్‌కు అదే తొలి విజయం. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయిన బ్రిటిష్ మీడియా ఇంగ్లాండ్ జట్టు ‘మృతి చెందింది’ అని వ్యాఖ్యానించింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆ టెస్టు ముగిసిన వెంటనే బేల్స్‌ను కాల్చి బూడిద చేశారు. దానిని ఒక చిన్న పేటికలో భద్రపరచి తమ వెంట తీసుకెళ్లారు. అప్పటి నుంచి బూడిద ఉంచిన చిన్న పేటికే యాషెస్ సిరీస్ ట్రోఫీగా మారింది. 1882 నుంచి ప్రారంభమైన యాషెస్ పోరు ఇప్పటికీ నిత్యనూతనంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ల మధ్య పోటీతత్వాన్ని పెంచుతూనే ఉంది. తాజా సిరీస్‌లో భాగంగా టెస్టులు లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ట్రెండ్ బ్రిడ్జి, రివర్‌సైడ్ గ్రౌండ్, ది ఓవర్ మైదానాల్లో జరగనున్నాయి. తొలుత మొదటి టెస్టును లార్డ్స్‌లో నిర్వహించాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) అధికారులు భావించారు. కానీ, ఆతర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మొదటి టెస్టుకు ట్రెండ్ బ్రిడ్జి ఆతిథ్యమిస్తుందని ప్రకటించారు. యాషెస్ సిరీస్ ‘బూడిద’ ఉంచిన చిన్న కప్పును 1953 నుంచి లార్డ్స్ క్రికెట్ మైదానంలోని మ్యూజియంలో భద్ర పరిచారు. దానిని పోలిన కప్‌ను విజేత జట్లకు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. అయితే, ఇది అధికారిక ట్రోఫీకాదు. దీనిని దక్కించుకోవడానికి సిరీస్‌ను నెగ్గాల్సి ఉంటుంది కాబట్టి, అటు ఆస్ట్రేలియా, ఇటు ఇంగ్లాండ్ జట్లు హోరాహోరీ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. విజయం ఎవరిని వరించినా, ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ఓ యుద్ధాన్ని తలపిస్తుంది. అభిమానులను ఉర్రూతలూగిస్తుంది.

- శ్రీహరి