ఆటాపోటీ

తిలా పాపం తలా పిడికెడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యాలో ఈ ఏడాది జూన్ 14 నుంచి జూలై 15వ తేదీ వరకూ అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఆధ్వర్యంలో వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్న నేపథ్యంలో, ఈ హక్కులను దక్కించుకోవడానికి వివిధ దేశాలు అడ్డదారులు తొక్కడం, భారీగా ముడుపులు చెల్లించడం తదితర సంఘటనలపై చర్చ జోరుగా సాగుతున్నది. అదే సమయంలో అమెరికా నిఘా విభాగం జరుపుతున్న విచారణలో అనేకానేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయ. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా ముడుపుల వ్యవహారంలో ఫిఫా అధికారులు, వివిధ దేశాలకు చెందిన ఫుట్‌బాల్ సమాఖ్యల పెద్దలు అంతోఇంతో బురదను అంటించుకున్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన మీడియాకూ ఇందులో సంబంధం ఉందన్న వార్త సంచలనం సృష్టిస్తున్నది. ఈ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చడానికి అమెరికా నిఘా విభాగంతోపాటు వివిధ ఏజెన్సీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయ. ఇంకెన్ని నిజాలు వెలుగు చూస్తాయో!

డొంక కదిలింది
అధికారులంతా ముడుపులు తీసుకొని, ఆ తర్వాత మొండిచేయి చూపించారని ఆరోపిస్తున్న అమెరికా నిఘా విభాగం ఫిఫా అవినీతి తీగెను లాగింది. దీనితో భారీ కుంభకోణం డొంక కదిలింది. ఫిఫా మాజీ కార్యవర్గ సభ్యులు జాక్ వార్నర్, నికోలాస్ లియోజ్‌లపై పలు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. భారీగా ముడుపులు తీసుకున్న తర్వాతే రష్యా, కతార్ దేశాలకు ప్రపంచ కప్‌ను నిర్వహించే హక్కులను ఇవ్వడానికి అనుకూలంగా ఓటు వేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మందిని అమెరికా నిఘా విభాగం సూచనతో జ్యూరిచ్ పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారణ జరపడంతో మీడియా సంస్థల వ్యవహారం తెరపైకి వచ్చినట్టు సమాచారం. మొత్తం మీద సాకర్ వరల్డ్ కప్ నిర్వాహణ, ప్రసార హక్కులను ఇవ్వడానికి కోట్లకు కోట్లు లంచాల రూపంలో తీసుకున్న ఫిఫా అధికారులపై ఉచ్చు బిగుస్తున్నది. అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. నిందితుల జాబితాలో కొత్త కొత్త పేర్లు చేరుతూనే ఉన్నాయి. అరెస్టు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న కొంతమంది ఫిఫా అధికారులపై ఇంటర్‌పోల్ ఇప్పటికే ‘రెడ్ కార్నర్ నోటీసు’ జారీ చేసింది. ఆర్థిక నేరాల్లో పేరుమోసిన వారంతా ఫిఫాలో కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్న లేదా కొనసాగిన వారు కావడంతో అవినీతి తీవ్రస్థాయికి చేరింది. మీడియా సైతం అడ్డదారుల్లో ప్రసార హక్కులను సంపాదించడానికి ప్రయత్నించడంతో, చాలావరకు వాస్తవాలు మరుగునపడ్డాయి. అమెరికా నిఘా విభాగం చురుగ్గా వ్యవహరిస్తూ, అమినీతి చిట్టాను విప్పడంతో, మీడియా సంస్థల పాత్ర బహిర్గతమైంది.

సాకర్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కుల కోసం వెంపర్లాటలో అందరూ దోషులుగానే మిగిలారు. చివరికి మీడియా కంపెనీలు కూడా అడ్డదారి తొక్కాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ అధికారులకు భారీగానే ముడుపులు అప్పచెప్పాయి. వివిధ దేశాలకు చెందిన మీడియా సంస్థలు తమకే ప్రసార హక్కులు దక్కాలన్న ఉద్దేశంతో ఫిఫా అవినీతిలో భాగస్వాములుగా మారిపోయాయి. ఈ మెగా టోర్నీ నిర్వాహణ హక్కులకు దేశాలు, ప్రసార హక్కులకు మీడియా సంస్థలు ఎగబడి, ఫిఫా అవినీతిని మరింతగా పెంచి పోషించాయి. 2018 లేదా 2022లో ప్రపంచ కప్‌ను నిర్వహించే అవకాశంకోసం పలు దేశాలు పోటీపడగా, చివరివరకూ లాబీయింగ్‌ను కొనసాగించి విఫలమై ఆగ్రహంతో రగిలిపోయిన అమెరికా ఏకంగా ఫిఫా అవినీతిపై దృష్టి సారించడంతోపాటు, విచారణ కూడా చేపట్టింది. విచారణలో భాగంగా వివిధ దేశాలేకాకుండా, మీడియా సంస్థలు కూడా ముడుపులు చెల్లించాయన్న వాస్తవం వెలుగు చూసింది. దక్షిణాఫ్రికాకు చెందిన ‘టోర్నెయస్ వై కొపెటెన్సియాస్’ మీడియా సంస్థ ప్రసార హక్కులను చేజిక్కించుకోవడానికి దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య (కాన్‌మెబొల్) ప్రతినిధులకు, ఫిఫా అధికారులకు లంచాలు ఇచ్చినట్టు విచారణ సందర్భంగా అమెరికా నిఘా సంస్థ కోర్టుకు తెలిపింది. దీనితోపాటు ట్వంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్‌కు చెందిన ఫాక్స్ పాన్ అమెరికన్ స్పోర్ట్స్, బ్రెజిల్‌కు చెందిన టీవీ గ్లోబో, అర్జెంటీనాలోని ఫుల్ ప్లే కూడా ముడుపులు చెల్లించాయని వివరించింది. స్పెయిన్‌లోని మీడియాప్రో సైతం టోర్నెయస్ వై కొపెటెన్సియాస్ ద్వారా లాబీయింగ్ చేసినట్టు అమెరికా నిఘా విభాగం సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించింది.
నిజానికి, సాకర్ వరల్డ్ కప్‌ను నిర్వాహించే అవకాశాన్ని దక్కించుకోవడానికి అమెరికా పెద్దఎత్తున లాబీయింగ్ చేసింది. భారీ మొత్తం బిడ్ వేసిన అమెరికా లాబీయింగ్ కోసం 17 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్టు అనధికార సమాచారం. అధికారికంగా 10 మిలియన్లను లాబీయింగ్ కోసం వెచ్చించినట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కతార్ నుంచి అంతకంటే ఎక్కువ సొమ్మును తీసుకొని, కార్యవర్గ సభ్యులంతా ఆ దేశానికి మద్దతు పలికారని అమెరికా ఆరోపిస్తున్నది. లాబీయింగ్ వికటించడంతో, ఫిఫా కార్యవర్గ సభ్యులు ఆర్థికపరమైన అవినీతికి, కుంభకోణాలకు పాల్పడ్డారని మండిపడుతున్నది. ద్రోహం చేసిన ఫిఫా కార్యవర్గం అంతుచూడాలన్న పట్టుదలతో ఉన్న అమెరికా ఆ బాధ్యతను ఆంతరంగిక మోసాల నిరోధక నిఘా విభాగానికి అప్పగించింది. ఆ విభాగం సాక్ష్యాధారాలను సేకరించి, కోర్టులో కేసు వేసింది. ప్రస్తుతం కేసు విచారణ ముమ్మరంగా సాగుతున్నది.
ఇదే మొదటిసారి కాదు..
ఫిఫాపై అవినీతి, ముడుపులు, కుంభకోణాల ఆరోపణలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. చాలా సందర్భాల్లో ఆరోపణలు వెల్లువెత్తడం, అంతే హఠాత్తుగా చల్లబడిపోవడం ఆనవాయితీగా మారింది. మీడియా సంస్థలు కూడా లంచాలు ఇచ్చాయన్న ఆరోపణలు రావడం మాత్రం ఇదే మొదటిసారి. నగదు రూపంలోనేగాక, పలువురు అధికారుల ఖాతాలకు వైర్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బును జమ చేయడం కూడా జరిగినట్టు అమెరికా నిఘా విభాగం వెల్లడించింది. మీడియా సంస్థల పాత్ర కూడా ఉండడంతో, తాజాగా వచ్చిన ఆరోపణల ఫిఫాను అంత తొందరగా వీడేవిగా కనిపించడం లేదు. ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ పోటీల నిర్వాహణ హక్కులను కట్టబెట్టేందుకు కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకున్నారని కార్యవర్గ సభ్యులపైనే ఆరోపణలు రావడంతో సంస్థ ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది. మీడియా సంస్థల నుంచి కూడా లంచాలు తీసుకున్నారంటే, అధికారుల అవినీతి ఏ స్థాయికి చేరిందో ఊహించుకోవచ్చు. 2018 వరల్డ్ కప్ హక్కులను రష్యా సంపాదించుకుంటే, 2022లో మెగా టోర్నీ నిర్వాహణ బాధ్యతను కతార్ సొంతం చేసుకుంది. అమెరికాసహా పలు దేశాలు పోటీపడినప్పటికీ ఫలితం లేకపోయింది. తమను కాదని రష్యాకు ఏ విధంగా ఒలింపిక్స్ హక్కులను కట్టబెడతారని ఆగ్రహంతో ఉన్న అమెరికా పూర్తిస్థాయిలో దర్యాప్తును ఆరంభించింది. ఫలితంగా అరెస్టులు, సస్పెన్షన్లు, బహిష్కరణలు కొనసాగుతున్నాయి. అదే క్రమంలో మీడియా సంస్థల వ్యవహారం కూడా వెలుగు చూసింది. మొత్తం మీద రష్యాకు అనుకూలంగా ఓటు వేయడానికి ఫిఫా కార్యవర్గ సభ్యులు భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు యావత్ క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అమెరికా నిఘా విభాగం కూడా ఈ విషయాన్ని ప్రాథమికంగా గుర్తించింది. రష్యాలో సదుపాయాలు, వసతులు మెరుగ్గానే ఉంటాయి కాబట్టి, ప్రపంచ కప్ సాకర్‌ను అక్కడ నిర్వహించడం వల్ల పెద్దగా సమస్యలు ఉండవు. మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే సామర్థ్యం ఉంది కాబట్టే రష్యాను ఎంపిక చేశామని ఫిఫా అధికారులు వాదించవచ్చు. కానీ, కతార్ ఎంపికను ఏ విధంగానూ సమర్థించుకునే పరిస్థితి లేదు. అక్కడ వౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే. పైగా భద్రతాపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, ఆ దేశానికి వరల్డ్ కప్‌ను కేటాయించడం ఫిఫా అధికారులు అమ్ముడుపోయారనడానికి నిదర్శనం. ప్రసార హక్కులను కేటాయించడానికి ఏయే మీడియా సంస్థల నుంచి ఎంతెంత మొత్తాలను అధికారులు తీసుకున్నారన్నది గణకాలతోసహా వెల్లడికావాల్సి ఉంది.

- శ్రీహరి