ఆటాపోటీ

అటు ప్రశంసలు ఇటు విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్నమొన్నటి వరకూ ఆకాశానికి ఎత్తేసిన వారే ఇప్పుడు విరాట్ కోహ్లీపై విమర్శలు కురిపిస్తున్నారు. దక్షిణాఫ్రికా టూర్‌కు బయలుదేరినప్పుడే, అక్కడ కూడా విజయపరంపరలను కొనసాగించడం సులభం కాదని మాజీ క్రికెటర్లు, క్రీడా పండితులు, విశే్లషకులు హెచ్చరించారు. కానీ, కోహ్లీగానీ, టీమిండియాలోని ఇతర సభ్యులుగానీ ఈ హెచ్చరికలను పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించి భారీ మూల్యానే్న చెల్లించుకున్నారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ప్రత్యర్థి జట్టుకు అప్పగించారు. క్రీడల్లో జయాపజయాలు సహజమే... వాటిని క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలే తప్ప, విమర్శలు కురిపించకూడదు.. ఇదీ అంతర్జాతీయంగా వినిపించే సూత్రం. నిజమేగానీ, పోరాడి ఓడితే ఎవరూ విమర్శించేవారు కారు. నిర్లక్ష్యంగా ఆడి వికెట్లను పారేసుకోవడం, ప్రత్యర్థుల బలాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం, సరైన సన్నాహాలు లేకుండానే మ్యాచ్‌లు ఆడడం వంటి అనేక అంశాలు కోహ్లీ సేనపై ప్రతి ఒక్కరూ విమర్శించడానికి కారణమవుతున్నాయ. ఆటగాళ్ల నిర్లిప్త, నిర్లక్ష్య వైఖరే వల్లే భారత్ పరాజయాలను చవిచూసిందే తప్ప దక్షిణాఫ్రికా అద్భుతాలేవీ సృష్టించలేదన్న వాదన కూడా ఉంది.

నిజానికి భారత క్రికెట్‌కు టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పర్యాయపదంగా మారిపోయాడు. ప్రతి యుద్ధంలోనూ తానే ఒక సైన్యమై దూసుకెళ్లాడు. సహచరులకు మార్గదర్శకంగా నిలిచాడు. గత ఏడాది ప్రపంచ క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన అతి కొద్దిమంది క్రికెటర్లలో కోహ్లీ ముందువరుసలో నిలిచాడు. టెస్టుల్లోనేగాక, అన్ని ఫార్మెట్లలోనూ అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. అయతే, ఈ ఏడాది ఆరంభంలోనే, దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లి, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కోల్పోయనందుకు విమర్శలకు గురవుతున్నారు. మరో టెస్టు మిగిలి ఉండగానే భారత జట్టు సిరీస్‌ను 0-2 తేడాతో చేజార్చుకోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్, నాలుగో రోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ నమోదు చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా అతనికి అది మూడో డబుల్ సెంచరీ. మూడు పర్యాయాలు డబుల్ సెంచరీలు చేసిన తొలి భారతీయ కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. జో రూట్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, కేన్ విలియమ్‌సన్ తదితరులు ప్రేక్షక పాత్ర వహిస్తే, ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ తనను తాను నిరూపించుకుంటున్నాడు. అతను ఈ ఏడాదే మూడు డబుల్ సెంచరీలు చేయడం విశేషం. వెస్టిండీస్‌పై మొదటి, న్యూజిలాండ్‌పై రెండో డబుల్ సెంచరీ సాధించిన అతను తాజాగా ఇంగ్లాండ్‌పై మూడోసారి ఈ మైలురాయిని చేరాడు. ఒకే క్యాలండర్ ఇయర్‌లో మూడు టెస్టు డబుల్ సెంచరీలు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ గుర్తింపు సంపాదించాడు. మైఖేల్ క్లార్క్ ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహిస్తూ నాలుగు డబుల్ సెంచరీలు చేశాడు. సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్, రికీ పాంటింగ్, బ్రెండన్ మెక్‌కలమ్ తలా మూడేసి పర్యాయాలు డబుల్ సెంచరీలు సాధించగా, కోహ్లీ వారి సరసన స్థానం సంపాదించాడు. ఈ మ్యాచ్‌కి ముందు, ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల్లో అతను సగటున కేవలం 13.40 మాత్రమే. అయితే, తాను ఏ క్షణంలోనైనా ఫామ్‌లోకి రాగలనని అతను డబుల్ సెంచరీ ద్వారా రుజువు చేశాడు. టెస్టు క్రికెట్‌లో భారత భారత కెప్టెన్ ఒక ఇన్నింగ్స్‌లో సాధించిన అత్యధిక స్కోరు కూడా ఇప్పుడు కోహ్లీ పేరిటే నమోదైంది. ఇంతకుముందు, 2013లో ఆస్ట్రేలియాపై మహేంద్ర సింగ్ ధోనీ చేసిన 224 పరుగుల స్కోరును కోహ్లీ అధిగమించాడు. టెస్టుల్లో 50 పరుగుల సగటుతో అతను మేటి క్రికెటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు. టైగర్ నవాబ్ ఆఫ్ పటౌడీ, సునీల్ గవాస్కర్, సచిన్ తెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ కూడా కెప్టెన్ హోదాలో డబుల్ సెంచరీలు చేశారు. అయితే, మూడు పర్యాయాలు ఈ ఘనతను సాధించిన కోహ్లీ భారతీయ కెప్టెన్లలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ఈ రికార్డులే అతనికి అవార్డులను కూడా తెచ్చిపెడుతున్నాయ. ఐసీసీ ఉత్తమ వనే్డ క్రికెటర్‌గా ఎంపికైన అతను మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతనిపై కొంతమంది ప్రశంసలు కురిపిస్తుంటే, మరి కొంతమంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. పొగడ్తలకు ఆనందించాలో, తెగడ్తలకు నొచ్చుకోవాలో తెలియని స్థితిలో కోహ్లీ నిగ్రహం కోల్పోతున్నాడన్నది వాస్తవం. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 135 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న భారత జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో చేజార్చుకున్న విషయం తెలిసిందే. దీనితో ప్రాధాన్యతను కోల్పోయిన భారత్ మూడో టెస్టులో ఏ విధంగా ఆడుతుందో చెప్పలేకపోయినా, మరోసారి ఇలాంటి ఫలితమే తప్పదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. టెస్టు సిరీస్‌ను కోల్పోయిన కారణంగా దిగాలుపడిన కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2017 సంవత్సరానికి ఉత్తమ క్రికెటర్‌గా ఎంపిక చేయడం కొంత ఊరటనిచ్చే అంశం. ప్రతి ఏటా, గత సంవత్సరం సెప్టెంబర్ 21 నుంచి ఆ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీ వరకు జరిగిన మ్యాచ్‌ల్లో క్రికెటర్ల సగటులను లెక్కగట్టి ఈ అవార్డును ప్రకటిస్తారు. అంటే, 2017 సెప్టెంబర్‌తో ముగిసిన కాలానికి అత్యుత్తమ వనే్డ ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా కోహ్లీకి ఐసీసీ అవార్డు లభించింది. 2012లో తొలిసారి అతను ఉత్తమ వనే్డ క్రికెటర్‌గా ఎంపికై, సర్ గారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని అందుకున్నాడు. మరోసారి అతనికి అదే ట్రోఫీ లభించనుంది. గత ఏడాది అతను 1,818 (సగటున 76.84 పరుగులు) సాధించాడు. ఆరు సెంచరీలు నమోదు చేశాడు. ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఇలావుంటే, ఐసీసీ ప్లేయర్స్ ర్యాంకింగ్స్‌లో 900 పాయింట్లను పూర్తి చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. 1979లో సునీల్ వగాస్కర్ 916 పాయింట్లు సంపాదించగా, కోహ్లీ 880 నుంచి 900 పాయింట్లకు చేరడంద్వారా, ఆ మైలురాయిని చేరాడు. బ్యాటింగ్‌లో విశేష ప్రతిభ కనబరుస్తున్న కోహ్లీని అతని అభిమానులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఎదురైన పరాజయాన్ని పట్టించుకోకుండా, క్రికెటర్‌గా కోహ్లీ అందుకున్న ఉన్నత శిఖరాలను పేర్కొంటూ, సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
సహనం లేకపోతే ఎలా?
కోహ్లీని అతని వీరాభిమానులు ప్రశంసిస్తుంటే, క్రికెట్ అభిమానులు అతని వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు ముగిసిన తర్వాత జరిగిన విలేఖరుల సమావేశంలో అతను ప్రవర్తించిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. జట్టు కూర్పును పదే పదే ఎందుకు మారుస్తున్నారని ఓ విలేఖరి ప్రశ్నించినప్పుడు కోహ్లీ సహనం కోల్పోయాడు. ‘34 టెస్టుల్లో మేము ఎన్ని గెలిచాం’ అని ఆ విలేఖరిని ఎదురు ప్రశ్న వేశాడు. చాలా కోపంగా అదే ప్రశ్నను వేస్తూ తన అసహనాన్ని చాటుకున్నాడు. ‘మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను.. ఘర్షణ పడడానికి కాదు..’ అని ఒకవైపు అంటూనే, మరోవైపు ఆ విలేఖరితో యుద్ధానికి కాలుదువ్వాడు. కోహ్లీ ప్రవర్తించిన తీరు భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతని వైఖరిని తప్పుపడుతూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైదానంలోనూ ఇలాంటి అసహనాన్ని ప్రదర్శించిన కారణంగానే టెస్టు సిరీస్ చేజారిందని కొంతమంది ధ్వజమెత్తారు. జరిగిన పొరపాటును ఒప్పుకొని, అవి పునరావృతం కావన్న భరోసా ఇవ్వాల్సిన కెప్టెన్ అందుకు విరుద్ధంగా విలేఖరులతో దురుసుగా మాట్లాడడం ఏమిటని కొంతమంది ప్రశ్నించారు. మొండితనం అన్ని సమయాల్లోనూ చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారంతా ప్రజలకు జవాబుదారీ వహించి తీరాలని అన్నారు. చాలామంది దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. కోహ్లీ సర్వస్వతంత్రుడినన్న రీతిలో వ్యవహరించడం సరికాదని అంతా ముక్తకంఠంతో అంటున్నారు. మొత్తం మీద ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన కోహ్లీకి ప్రశంసలతోపాటు, దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను కోల్పోయినందుకు విమర్శలు కూడా తప్పడం లేదు. జొహానె్నస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో ఈ నెల 24 నుంచి 28 వరకూ జరిగే చివరిదైన మూడో టెస్టులో గెలిస్తేనే కోహ్లీపై విమర్శలు కొంతలో కొంతైనా తగ్గుతాయి. లేకపోతే, ఇన్నాళ్లూ నెత్తిన పెట్టుకొని ఊరేగిన అభిమానులు తిట్లదండకం ఎత్తుకోవడం ఖాయం.

- బిట్రగుంట