ఆటాపోటీ

ఊరిస్తున్న ఐపిఎల్ విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) విందు క్రికెట్ అభిమానులను ఊరిస్తున్నది. టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ సృష్టించిన హోరు ఇంకా కొనసాగుతుండగానే ఐపిఎల్ మొదలైంది. నిన్న మొదలైన ఈ టోర్నీలో ఆడే పలువురు స్టార్ల ప్రదర్శన ఏ విధంగా ఉండబోతున్నదోనన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నది. కొంత మంది ఆటగాళ్లకు ఇప్పటికే స్టార్ ఫాలోయింగ్ ఉంది. మరికొందరు ఆసియా కప్, టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరచి ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. ఐపిఎల్ వేలంలో భారీ ధరను దక్కించుకున్న వారిపైనా అభిమానులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భారత క్రికెటర్ల విషయానికి వస్తే వనే్డ, టి-20 ఫార్మెట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్, టి-20 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన యువ బ్యాట్స్‌మన్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టార్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. 2013 ఐపిఎల్‌లో తెరపైకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాల కారణంగా రెండేళ్ల సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ స్థానంలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, గుజరాత్ లయన్స్ కొత్తగా టోర్నీలోకి అడుగుపెట్టాయి. రైజింగ్ పుణెకు ధోనీ నాయకత్వం వహిస్తుండగా, అతని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సురేష్ రైనా గుజరాత్ లయన్స్‌కు సారథిగా
వ్యవహరించడం విశేషం. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు ఆసక్తికరంగా ఉంటాయన్నది తిరుగులేని సత్యం. మరోవైపు, ధోనీ, కోహ్లీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆధిపత్య పోరాటం చాలాకాలంగా ఉంది. ధోనీని త్వరలోనే తప్పించి, టి-20, వనే్డ ఫార్మెట్స్‌లోనూ కోహ్లీకే పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయన్న వాదన లేకపోలేదు. మొత్తం మీద ధోనీ, కోహ్లీ మధ్య ఆధిపత్య పోరాటం రసవత్తరంగా సాగడం ఖాయం.
కెరీర్ మొత్తంలో సంపాదించలేనంత మొత్తం కేవలం ఒక ఐపి ఎల్‌లో జేబులో వేసుకోవచ్చన్న అభిప్రాయం ఆటగాళ్లలో బలంగా ఉంది. అందుకే, ప్రపంచ క్రికెట్‌లో పేరుప్రఖ్యాతులు ఆర్జించి, దర్జా గా రిటైరైన స్టార్ల నుంచి ఔత్సాహికుల వరకూ ప్రతి ఒక్కరూ ఐపి ఎల్‌లో స్థానం కోసం పోటీపడుతున్నారు. ఈ టోర్నీలో ఆడితే, భవిష్యత్తులో భారీగా ఆఫర్లు, స్పాన్సర్‌షిప్స్ వస్తాయన్న వాస్తవం కూడా వారికి తెలుసు. వీటికితోడు వచ్చే ఐపిఎల్‌లో ఫ్రాంచైజీల ను ఆకట్టుకోవాలంటే ఈసారి అద్భుతంగా రాణించడం తప్పని సరి. ఈ అంశం కూడా ఆటగాళ్ల మధ్య పోటీని పెంచుతున్నది. ప్రతి ఒక్కరూ సర్వశక్తులు ఒడ్డి పోరాటాలు చేయడానికి సిద్ధ మవుతారు. క్రికెట్ మ్యాచ్‌లు ఎంత ఉత్కంఠ భరితంగా సా గుతాయన్న విషయాన్ని ప్రపంచానికి చాటుతారు. వ్యక్తి గత ప్రయోజనాలే కీలకం కాబట్టి, నిర్లక్ష్యానికిగానీ, ఉదాసీనతకుగానీ తావు లేని విధంగా మ్యాచ్‌లు ఆడ తారు. డబ్బు కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ అంశమే ప్రతి మ్యాచ్‌నీ ఒక ఫైనల్‌గా మార్చేస్తున్నది. ఈ పోటీతత్వమే ఐపిఎల్‌ను తిరుగులేని టోర్నీ గా నిలబెడుతున్నది. అభిమానులను ఆక ట్టుకుంటున్నది.

- శ్రీహరి