ఆటాపోటీ

పటిష్ట చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మ్‌స్ట్రాంగ్‌పై వేటు పడిన తర్వాత మరెవరూ డోపింగ్‌కు పాల్పడరని నిర్వాహకులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి కూడా డోపింగ్ రహిత రేస్‌ను నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. 1997లో టైటిల్ సాధించి, మూడు పర్యాయాలు రెండో స్థానాన్ని ఆక్రమించిన జర్మనీ రైడర్ జన్ ఉల్రిచ్ తాను నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించానని చేసిన ప్రకటన అప్పట్లో టూర్ డి ఫ్రాన్స్‌పై అనుమానం మేఘాలు కమ్ముకుంటున్నాయి. రక్తానికి ఉత్ప్రేరకంగా పని చేసే ఎరిథ్రోపొటిన్ (ఇపివో)ను వినియోగించిన ఫ్రెంచ్ స్టార్ లారెంట్ జలబెర్ట్ ఇప్పుడు టీవీ, రేడియో కామెంటేటర్‌గా అవతారం ఎత్తాడు. అంతర్జాతీయ సైక్లింగ్ యూనియన్ (యుసిఐ), టూర్ డి ఫ్రాన్స్ అధికారులకు అతను ముచ్చెమటలు పోయంచాడు. అప్పటి నుంచి టూర్ డి ఫ్రాన్స్‌లో డోపింగ్ భయం ఒక భాగమైంది. నిర్వాహకులు మాత్రం మరోసారి అలాంటి సమస్య పునరావృతం కాదని అంటున్నారు.

* ఇప్పటి వరకూ టూర్ డి ఫ్రాన్స్ రేస్‌లో పాల్గొన్న వారిలో పొడవైన రైడర్‌గా జొహా వాన్ సమ్మెరెన్ రికార్డు సృష్టించాడు. అతని పొడవు 6 అడుగులా, ఐదున్నర అంగుళాలు. ఇక పొట్టివాడిగా సామ్యూల్ డువౌలిన్ పేరు చరిత్ర పుటల్లో నిలిచింది. అతని ఎత్తు 5 అడుగులా రెండు అంగుళాలు.
* ఇక అతి బరువైన రైడర్ మాగ్నసన్ బాక్‌స్టెడ్. అతని బరువు అక్షరాలా 95 కిలోలు. లియోనార్డో పీపొలి 57 కిలోల బరువుతూ, టూర్ డి ఫ్రాన్స్‌లో పాల్గొన్న బక్కపల్చని రైడర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకూ నలుగురు రేస్ మధ్యలో మృతి చెందారు.

టూర్ డి ఫ్రాన్స్ రేస్‌ను గ్రెగ్ లెమాండ్ 1989లో గెల్చుకున్నాడు. శరీరంలో 35 షాట్‌గన్‌కు సంబంధించిన ముక్కలను ఉంచుకొని అతను రేస్‌ను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. అంతకు రెండేళ్ల క్రితం వేటకు వెళ్లినప్పుడు షట్‌గన్ పొరపాటున పెలినప్పుడు, దాని బులెట్ ముక్కలుముక్కలై, అతని శరీరంలోకి దూసుకెళ్లాడు. వాటిని తొలగించడం కష్టంగా మారిన నేపథ్యంలో వైద్యులు తాము చేయగలిగింది ఏమీ లేదని చేతులెత్తేశారు. శరీరంలో బులెట్ ముక్కలు ఉంచకుకొనే లెమాండ్ సైక్లింగ్ కెరీర్‌ను కొనసాగించి ఎన్నో విజయాలు సాధించాడు.

* టూర్ డి ఫ్రాన్స్ మొత్తం దూరం 3,653.6 కిలోమీటర్లు. పారిస్‌లో 132 సార్లు రేస్ ఆరంభం లేదా ముగింపు చోటు చేసుకుంది. ఈ రేస్ మొత్తం మీద 8,400 ఆహార బ్యాగులను పంపిణీ చేస్తారు. 25,055 మంది భద్రతా సిబ్బంది అనుక్షణం రేస్‌పై నిఘా పెడతారు. రేస్ మొత్తం ప్రైజ్ మనీ 32,00,000 యూరోలు. ఇందులో రేస్ విజేతకు 4,50,000 యూరోలు లభిస్తాయి.
టూర్ డి ఫ్రాన్స్‌లో అతి తక్కువ దూరం స్టేజ్-7లోని 52 కిలోమీటర్లు. సెయింట్ మీన్ లె గ్రాండ్ నుంచి లొరియెంట్ వరకూ ఈ స్టేజ్ కొనసాగుతుంది. రేస్ 198 సైక్లిస్టులతో ఆరంభమవుతుంది.

ఇప్పటి వరకూ జరిగిన పోటీల్లో 1919లో అత్యల్పంగా కేవలం 10 మంది మాత్రమే రేస్‌ను పూర్తి చేశారు. 69 మంది రేస్‌ను మొదలుపెడితే, వారిలో 59 మంది మధ్యలోనే వైదొలిగారు.
అమెరికా తరఫున గ్రెగ్ లెమాండ్ (1986, 1989, 1990), లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ (1999, 2000, 2001, 2002, 2003, 2004, 2005) టైటిళ్లు రద్దయ్యాయి.
టూర్ డి ఫ్రాన్స్‌లో సైక్లిస్టులు మోసం చేసి, వాహనాలపై వెళ్లిన తొలి సంఘటన 1904లో చోటు చేసుకుంది.

- సత్య