ఆటాపోటీ

మొదటి డోపింగ్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఒలింపిక్స్‌లో మొదటి డోపింగ్ కేసు 1968లో నమోదైంది. స్వీడన్‌కు చెందిన షూటర్ హన్స్ గన్నర్ లిల్జెవాల్ ఉత్ప్రేరకాన్ని వాడినట్టు రుజువు కావడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. పిస్టల్ టీం ఈవెంట్‌లో అతను సభ్యుడిగా ఉన్న స్వీడిష్ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. అయితే, డోపింగ్ కేసు కారణంగా లిల్జెవాల్ సస్పెన్షన్‌కు గురికావడంతో ఆ పతకాన్ని నిర్వాహకులు వెనక్కు తీసుకున్నారు. ఇంతకీ లిల్జెవాల్ వాడింది ఉత్ప్రేరకం కాదు.. ఒత్తిడిని తట్టుకోవడానికి రెండు బీర్లు తాగాడట. అవే అతని కొంప ముంచాయి.

* 1928 మే 17 నుంచి ఆగస్టు 12 వరకూ జరిగిన ఆమ్‌స్టర్‌డామ్ (హాలెండ్) ఒలింపిక్స్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో మహిళలకు తొలిసారి అవకాశం కల్పించడంతో అప్పటి వరకూ ఈ పోటీల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన అమెరికాకు గట్టిపోటీ ఎదురైంది. 46 దేశాలు పాల్గొన్న ఈ ఒలింపిక్స్‌లో 14 క్రీడల్లో, 109 స్వర్ణాలకు పోటీలను నిర్వహించారు. 2,724 మంది పురుషులు, 290 మంది మహిళలు హోరాహోరీగా పోరుసాగించారు. అమెరికా 22 స్వర్ణం, 18 రజతం, 16 కాంస్యలతో మొత్తం 56 పతకాలను కైవసం చేసుకొని అగ్రస్థానాన్ని ఆక్రమించింది. జర్మనీ 10 స్వర్ణాలు, ఏడు రజతాలు, 14 కాంస్యాలతో రెండో స్థానంలో, ఫిన్లాండ్ 8 స్వర్ణాలు, మరో 8 రజతాలు, 9 కాంస్యాలతో మూడో స్థానంలో నిలిచాయి.

తలవంపులు!

* మూడు ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్‌గా పేరుప్రఖ్యాతులు ఆర్జించిన సూజీ ఫెవోర్ హామిల్టన్ వ్యభిచార నేరం కింద అరెస్టుకావడం సంచలనం సృష్టించింది. అథ్లెట్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆమె లాస్ వెగాస్‌లో చాలాకాలంగా వ్యభిచారం కొనసాగిస్తున్నట్టు అంగీకరించింది. ఇందుకు సిగ్గుపడుతున్నానని, అభిమానులు పెద్ద మనసుతో తనను క్షమించాలని వేడుకుంది.అయితే, సూజీ యావత్ క్రీడా ప్రపంచానికే తలవంపులు తెచ్చిపెట్టిందని అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- సత్య