ఆటాపోటీ

నిలువెత్తు క్రీడాస్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడల్లో విపరీతమైన పోటీ, శత్రుత్వమే తప్ప మానవతా విలువలకు తావులేదని వాదించేవారికి మొరాకో అథ్లెట్ నావల్ ఎల్ వౌంటవకెల్ తగిన సమాధానమే చెప్పింది. 1984 లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్ మహిళల 400 మీటర్ల పరుగులో భారత ఆశా కిరణం, ‘పయోలీ ఎక్స్‌ప్రెస్’ పిటి ఉష కడవరకూ పోరాడి, చివరికి నాలుగో స్థానంలో నిలిచిన విషయం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఒలింపిక్స్ పతకం గెల్చుకోవడం ద్వారా భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా చరిత్రను నెలకొల్పే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్న ఉష పోటీ ముగిసిన వెంటనే దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. అది సహజం కూడా. ఆ పోరులో వౌంటవకెల్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్స్‌లో టైటిల్ అందుకున్న తొలి మొరాకో మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ప్రేక్షకులంతా వౌంటవకెల్‌కు జేజేలు పలుకుతూ, హర్షధ్వానాలతో అభినందిస్తుంటే, ఆమె మాత్రం వౌనంగా ఉండిపోయింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోవడానికి నానా తంటాలు పడింది.
ఒక దశలో బావురుమని ఏడ్చేసింది. అప్పటి తన ప్రవర్తనకు కారణాన్ని ఆమె ఇటీవల అబూదబీలో క్రీడా పురస్కారాన్ని అందుకోవడానికి వచ్చినప్పుడు వెల్లడించి యావత్ క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఉష పతకాన్ని సాధించలేకపోవడమే తన దుఃఖానికి కారణమని వౌంటవకెల్ చెప్పినప్పుడు సభికులు ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు. ఉష తనకు మంచి స్నేహితురాలని, తన విజయం కంటే ఆమె పరాజయమే తనను ఎక్కువగా వేధించిందని 49 ఏళ్ల వౌంటవకెల్ ఆనాటి అనుభూతులను సభికులతో పంచుకుంది. నిలువెత్తు క్రీడాస్ఫూర్తికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా? అంత ఉన్నతంగా ఆలోచిస్తుంది కాబట్టే ఆమెను యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికైంది. క్రీడా రంగానికి అత్యుత్తమ సేవలు అందిస్తున్నది. క్రీడాస్ఫూర్తి లోపిస్తున్న ఈ రోజుల్లో వౌంటవకెల్‌ను ముందుతరాలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.