ఆటాపోటీ

12 బంతుల్లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిగ్ బాష్ టోర్నమెంట్‌లో ఆడుతూ వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్ 12 బంతుల్లోనే అర్ధ శతకాన్ని సాధించి, గతంలో యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. టి-20 ఫార్మెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీలు సాధించిన వీరిద్దరూ సరిగ్గా 12 బంతులు ఎదుర్కొన్నారు. యువీ 0, 4, 1, 4, 4, 1, 6, 6, 6, 6, 6, 6 చొప్పున పరుగులు చేస్తే గేల్ 2, 0, 6, 6, 6, 6, 2, 6, 6, 4, 1, 6 పరుగులతో అర్ధ శతకం మైలురాయిని చేరాడు. వేగంగా అర్ధ శతకాన్ని నమోదు చేసే క్రమంలో యువీ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదడం విశేషం. ఈ ఫీట్ సాధించిన ఐదో బ్యాట్స్‌మన్‌గా అతను చరిత్ర పుటల్లో స్థానం సంపాదించాడు. 1968 ఆగస్టు 31న నాటింగ్‌హామ్ తరఫున గ్లామర్‌గాన్ బౌలర్ మాల్కం నాష్ బౌలింగ్‌లో వెస్టిండీస్ లెజెండరీ ఆల్‌రౌండర్ గారీ సోబర్స్ ఆరు సిక్సర్లు కొట్టాడు. 1985 రంజీ ట్రోఫీ టోర్నీలో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఆటగాడు రవి శాస్ర్తీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. అతని విజృంభణకు బలైన బౌలర్ తిలక్‌రాజ్ క్రికెట్‌కే దూరం కావాల్సి వచ్చింది. 2007 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో నెదర్లాండ్స్ బౌలర్ డాన్ వాన్ బన్జ్ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హెర్చెల్ గిబ్స్, 2007లో జరిగిన టి-20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదారు. అంతకు ముందే యువీతో ఆండ్రూ ఫ్లింటాఫ్ వాగ్వాదం పెట్టుకున్నాడు. దీనితో రెచ్చిపోయిన యువీ విజృంభణకు బ్రాడ్ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. ఈ ఏడాది అలెక్స్ హాలెస్ ఆరు వరుస బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. అయితే, ఇది ఒకే ఓవర్ కాకపోవడం గమనార్హం. నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడిన అతను బొయో పాన్కిన్ వేసిన ఓవర్ చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టాడు. ఆ వెంటనే బౌలింగ్‌కు దిగిన అకీబ్ జావేద్ ఓవర్ రెండు బంతుల తర్వాత హాలెస్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. అతని చివరి నాలుగు బంతులను హాలెస్ సిక్సర్లుగా మార్చాడు.