ఆటాపోటీ

దొంగల బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియోలో దొంగల బెడద రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నది. విదేశీ టూరిస్టులనేకాదు.. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చే అథ్లెట్లు, అధికారులను కూడా దొంగలు వదలడం లేదు. ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే మాయం కావడం విదేశీ బృందాలను ఆందోళనకు గురి చేస్తున్నది. తమ విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని చైనా అథ్లెట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒలింపిక్ క్రీడా గ్రామంలోనే దొంగతనం జరగడం నిర్వాహకులకు సవాళ్లు విసురుతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా, అడుగడుగునా పోలీసులను మోహరింప చేసినా, దొంగతనాలకు అడ్డుకట్ట పడకపోవడం విచిత్రం. రోడ్లపై వెళుతున్న విదేశీయులను లక్ష్యం చేసుకొని వారి పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్, విలువైన వస్తువులను దొంగలు యథేచ్ఛగా కాజేస్తున్నారు. పట్టపగలే పదుల సంఖ్యలో ఇలాంటి సంఘటనలు జరగడంతో ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ బహిరంగం క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. వీధుల్లో దొంగల విజృంభణకు అదుపు లేకుండా పోయింది. కనీసం క్రీడా గ్రామంలోనైనా భద్రత ఉంటుందని, తమ వస్తువులు భద్రంగా ఉంటాయి అనుకున్న విదేశీ అథ్లెట్లకు చేదు అనుభవం ఎదురవుతున్నది. చైనా బృందంలోని పలువురి విలువైన సామాగ్రిని దొంగలు తస్కరించారు. తాజాగా డెన్మార్క్ బృందానికీ అలాంటి అనుభవమే ఎదురైంది. బృందంలోని చాలా మంది మొబైల్ ఫోన్లు, దుస్తులు, ఐపాడ్‌లు చోరీకి గురైనట్టు డెన్మార్క్ చెఫ్ డి మిషన్ మోర్టెన్ రాడ్‌విట్ ఒలింపిక్స్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు. రెగ్యులర్ ఉద్యోగులు చాలామంది ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, ఒలింపిక్స్ కోసం తాత్కాలిక సిబ్బందిని తీసుకోక తప్పలేదు. హౌస్ కీపింగ్ వంటి పనులకు కొత్త వారిని నియమించడంతో దొంగతనం సంఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏవైనా ఏకంగా క్రీడాకారుల ఫోన్లు, డబ్బు, ఎలక్ట్రానిక్ సామాగ్రి మాయం కావడం రియోలో భద్రతపై అనుమానాలను పెంచుతున్నది.