ఆటాపోటీ

ఈత కొలనులో ‘అదృశ్య శక్తి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పది లక్షల స్ట్రోక్స్!
స్విమ్మర్లు ఒక సీజన్‌లో శిక్షణ పొందే క్రమంలో సుమారు పది లక్షల స్ట్రోక్స్ కొడతారని అంచనా. చేతులు, కాళ్లను ఒకేసారి కదిపి, నీటిని వెనక్కు నెట్టడం ద్వారా ముందుకు పోవడానికి అంతులేని శక్తి అవసరం. అందుకే గంట సేపు ఈత కొడితే సుమారు 650 కేలరీల శక్తి ఖర్చవుతుంది కాబట్టే ఇది అత్యుత్తమ వ్యాయామం. స్విమ్మింగ్ చేస్తున్నంత సేపు విరామం లేకుండా స్ట్రోక్స్ కొడుతునే ఉంటారుకాబట్టి స్విమ్మర్లలో ఎక్కువ మంది భుజం గాయంతో బాధపడుతుంటారు.

క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్లకు పిచ్ సహకరిస్తుందనడం మనకు తెలుసు. టెన్నిస్‌లో ఏ తరహా కోర్టు అన్నది ప్రధానం. క్లే కోర్టులపై కొందరు రాణిస్తే, గ్రాస్ కోర్టుల స్పెషలిస్టులు మరికొందరు. హార్డ్ కోర్టుల వీరులూ ఉంటారు. అథ్లెటిక్స్ పోటీల్లో గాలివాటం కీలక పాత్ర పోషిస్తుంది. రోయింగ్ లేదా కనోయింగ్-కయాకింగ్ పోటీల్లో వాతావరణానిది కీలక పాత్ర. అయితే, స్విమ్మింగ్ పోటీలు జరిగే ఈత కొలనుల్లోనూ తేడాలు ఉంటాయా? స్విమ్మర్లు పోటీపడుతున్న లేన్ (వరుస)ను అనుసరించి ఫలితాలు మారిపోతుంటాయా? అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య ‘్ఫనా’ 2013లో నిర్వహించిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో మొదటిసారి తెరపైకి వచ్చిన ఈ అనుమానాలు రియో ఒలింపిక్స్‌తో మరింత బలడ్డాయి. వివిధ అధ్యయనాలు, నివేదికలు ఈత కొలనులో సునామీకి కారణమవుతున్నాయి.
ప్రకంపనలే కీలకం?
స్విమ్మింగ్‌లో పోటీదారులు ఒక్కసారిగా నీటిలోకి దూకడంతో వచ్చే ప్రకంపనలు జయాపజయాలపై కీలక పాత్ర పోషిస్తాయని ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. మొదటి రెండు మూడు లేన్స్‌లో పోటీపడే వారికంటే, చివరి రెండుమూడు లేన్స్‌లో ఈదే వారు తొందరగా లక్ష్యాన్ని చేరతారని ఈ అధ్యయనం సాక్ష్యాధారాలతో నిరూపించింది. మధ్య లేన్స్‌లో ఉన్నవారికి పెద్దగా సమస్యలు ఉండవని పేర్కొంది. లేన్స్ సంఖ్య పెరుగుతున్న కొద్దీ స్విమ్మర్ల వేగం కూడా పెరుగుతుందని ఈ అధ్యయనం వివరించింది. ల్యాప్ టైమ్ డేటాను క్రోడీకరించి, విశే్లషించిన తర్వాత శాస్తవ్రేత్తల బృందం ఈ నిర్ణయానికి వచ్చింది. నీటిలోని ప్రకంపనల వల్ల ఈ తేడా ఉంటుందన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, అది ఖాయమని ఎవరూ చెప్పలేకపోతున్నారు. నివేదికలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంతుబట్టని ‘అదృశ్య శక్తి’ వల్ల లేన్స్‌ను బట్టి స్విమ్మర్లకు అనుకూల, ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని చెప్పడం ద్వారా, అసలు కారణాన్ని వివరించకుండా వదలిపెట్టింది. ఈ ‘అదృశ్య శక్తి’ ఏమితో తేల్చుకోవడానికి జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే ప్రపంచ చాంపియన్‌షిప్‌ను నిర్వహించిన స్విమ్మింగ్ పూల్స్‌ను పడగొట్టడంతో, లేన్స్ మధ్య ఎందుకు తేడా ఉంటున్నదనే ప్రశ్నకు సరైన సమాధానం రాబట్టే అవకాశం శాస్తవ్రేత్తలకు దక్కలేదు.
అంతర్ ప్రవాహం!
ఈత కొలనులోనూ అంతర్ ప్రవాహం ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ, ఇది అక్షర సత్యం. స్విమ్మింగ్ పూల్ పైకి కనిపించినంత స్తబ్ధంగా ఉండదు. లోపల నీరు దిశను మార్చుకుంటూ ఉంటుంది. బహుళా ఈ అంతర్ ప్రవాహానే్న ‘అదృశ్య శక్తి’గా పేర్కొని ఉండవచ్చు. స్విమ్మింగ్ పూల్ లేన్స్‌లో తేడాలు ఏ విధంగా స్విమ్మర్లను ప్రభావితం చేస్తాయనే ప్రశ్నకు మూడేళ్ల తర్వాత, రియో ఒలింపిక్స్‌లో మరోసారి అధ్యయనం జరిగింది. 50 మీటర్ల పొడవు ఉండే ఈత కొలనులో ఎందుకు వ్యత్యాసాలు తలెత్తుతున్నాయనే ప్రశ్నకు తాజా అధ్యయనంలోనూ స్పష్టమైన సమాధానం రాకపోవడం విచిత్రం. ప్రపంచ చాంపియన్‌షిప్స్, ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్స్‌లో స్విమ్మింగ్ పోటీలు జరిగే ఒకటి నుంచి ఎనిమిది వరకూ లేన్స్ ఉంటాయి. సాధారణంగా రెండు లేన్స్‌ను ఖాళీగా ఉంచుతారు. మొదడి రెండు లేదా మూడు లేన్స్‌లో పోటీపడుతున్న వారు తమ సాధారణ వేగం కంటే సుమారు 0.4 సెకన్లు ఆలస్యంగా లక్ష్యానికి చేరారని, మధ్యలోని రెండు లేన్స్‌లో వారు ఎలాంటి ఇబ్బందలు ఎదుర్కోలేదని ఇండియానా శాస్తవ్రేత్తలు తేల్చిచెప్పారు. అదే విధంగా చివరి రెండుమూడు లేన్స్ నుంచి పోటీపడే వారు తమ సగటు వేగం కంటే ముందుగానే రేస్‌ను పూర్తి చేస్తున్నట్టు గుర్తించారు. కానీ, కారణం ఏమిటన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు.
నార్వే స్విమ్మర్ హెన్రిక్ క్రిస్టియాన్‌సెన్ 1,500 మీటర్ల విభాగంలో చివరి లేన్ నుంచి పోటీపడిన హీట్స్‌లో తన స్థాయి కంటే మెరుగైన ప్రదర్శనతో రాణించాడు. ఫైనల్‌లో మాత్రం మరో లేన్ నుంచి పోటీపడడంతో సగటు వేగాన్ని కూడా అందుకోలేకపోయాడు. ఈ మార్పు ఎందుకొచ్చిందో క్రిస్టియాన్‌సెన్‌కు అంతుబట్టలేదు. ఎవరికి తోచిన వివరణలు, విశే్లషణలు వారు ఇస్తున్నప్పటి కీ, వాస్తవం ఏమిటో సహేతుకంగా నిర్ధారిచించలేకపోతున్నారు. అందుకే ‘అదృశ్య శక్తి’ అన్న పేరుతో సమాధానాన్ని దాట వేయ డం మినహా ఏమీ చేయలేకపోతున్నారు.
రెప్పపాటు తేడా..
మిగతా క్రీడలతో పోలిస్తే, స్విమ్మింగ్ పోటీలు చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగుతాయి. సెకనులో వందో వంతును కూడా లెక్కించే స్థాయి పోరు ఉంటుంది. విజేతలకు, పరాజితులకు మధ్య తేడా ఎక్కువ భావం సెకనుకు మించి ఉండదు. 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌ను మినహాయిస్తే, స్విమ్మింగ్ పూల్‌లో పోటీలన్నిటిలోనూ ల్యాప్స్ సరి సంఖ్యలోనే ఉంటాయి. ఒక ల్యాప్‌ను పూర్తి చేసే సమయం కంటే, తిరిగి వచ్చే సమయం ఎక్కువ. ఇది సర్వసాధారణం. అయితే, ఈ తేడా లేన్స్‌ను బట్టి కూడా ఉంటుందన్న నిజమే ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నది. ఒక ల్యాప్‌తోనే ముగిసే 50 మీటర్ల ఫ్రీ స్టయిల్ ఈవెంట్‌లో చాలా మంది స్విమ్మర్లు సెకను కంటే ఎక్కువ తేడాతోనే రేస్‌ను పూర్తి చేయడాన్ని శాస్తవ్రేత్తలు గుర్తించారు. ఈ వ్యత్యాసంలో లేన్స్ ప్రభావం కూడా ఉంటుందనేది వారి వాదన. ఉదాహరణకు రియో ఒలింపిక్స్ మహిళల 50 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో కాంస్య పతకాన్ని బెలారస్ స్విమ్మర్ అలియాక్సాండ్రా హెరాసిమెనియా కైవసం చేసుకుంది. ఆమె 24.11 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన రనోమీ క్రొమోవిజొజో రేస్‌ను పూర్తి చేయడానికి 24.19 సెకన్ల సమయం పట్టింది. హెరాసిమెనియా ఎనిమిదో లేన్ నుంచి, క్రొమోవిజొజో రెండో లేన్ నుంచి పోటీపడ్డారు. స్విమ్మర్ల వేగంపై లేన్ తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పడానికి నిపుణులు ఈ రేసును ఒక ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఇక్కడా అదే ప్రశ్న... లేన్స్ మారితే సామర్థ్యంలో తేడాలు ఎందుకు వస్తాయి? ఎంతకీ అంతుబట్టడం లేదుకాబట్టే ‘అదృశ్య శక్తి’ ముద్రవేసి చేతులు దులిపేసుకుంటున్నారు.
నిర్మాణంలో ప్రమాణాలు
అంతర్జాతీయ పోటీలను నిర్వహించే స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తారు. రియోసహా ప్రపంచంలో ఎక్కువ శాతం పూల్స్‌ను మిర్తా పూల్స్ సంస్థ నిర్మించింది. ఫినా కూడా ఈ సంస్థపైనే నమ్మకం ఉంచింది. రియో ఒలింపిక్స్ కోసం నిర్మించిన స్విమ్మింగ్ పూల్స్‌లో అంతర్గత ప్రవాహాలు లేకుండా జాగ్రత్త పడ్డామని, అదే విధంగా అలలు కూడా ఎగిసిపడకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామని మిర్తా సంస్థ స్పష్టం చేసింది. లేన్స్ మార్పు వల్ల చోటు చేసుకుంటున్న మార్పులపై జరిగిన అధ్యయనంపై స్పందించినా సరైన సమాధానం చెప్పలేకపోయింది. స్విమ్మర్లంతా ముఖాన్ని ఒకవైపు ఉంచి, గట్టిగా ఊపిరి పీల్చుకొని వదులుతుంటారని, దాని ప్రభావం వల్ల నీరు అలల మాదిరి ఏర్పడి తేడా వస్తుందేమోనని ఊహాజనిత కథనాన్ని వినిపించింది. ఆ వాదన తర్కానికి అం దదు. ఈ విషయం మిర్తా పూల్స్‌కు తెలియందికాదు. ఏదోఒక సమాధానం చెప్పిందేగానీ సరైన కారణం తెలియకపోవడంతో ‘అదృశ్య శక్తి’ అని పేర్కొన్న అంశంపై ఇప్పటి వరకూ ఎవరూ సహేతుకమైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. తదుపరి అధ్యాయాల్లోనైనా లేన్స్ మిస్టరీ వీడుతుందోమో చూడాలి.

- ఎస్‌ఎంఎస్