ఆటాపోటీ

క్యూబా నుంచి ఫ్లోరిడా దాకా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డయానా నయాద్ క్యూబా నుంచి ఫ్లొరిడా వరకు 103 కిలోమీటర్ల ట్రెక్‌ను ఈది సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అసాధారణ ఫీట్‌ను సాధించే సమయానికి ఆమె వయసు 64 సంవత్సరాలు. అంతకు ముందు ఆరు పర్యాయాలు ఆమె క్యూబా నుంచి ఫ్లొరిడా వరకూ ఈదే ప్రయత్నం చేసింది. అన్ని పర్యాయాలు విఫలమైనప్పటికీ, పట్టుదలతో మరోసారి సాహసానికి పూనుకొంది. ఏడో ప్రయత్నం సఫలమైంది. రికార్డు ఆమె సొంతమైంది.
* స్విమ్మింగ్ వల్ల ఊపిరి తిత్తులు, గుండె బలపడతాయి. అన్ని కీలక కండరాలు విస్తరించుకుంటాయి. దీనితో మనిషిలో ఉత్సాహం పెరుగుతుంది. అంతేకాదు... స్విమ్మింగ్ వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. వివిధ కారణాల వల్ల మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారు తప్పనిసరిగా ఈతకొట్టాలి.
* పరిగెత్తినప్పుడు గాలికి ఎదురువేళ్లాలి. ఎంత వేగంగా పరిగెడితే, అంత వేగంగా గాలి మనల్ని వెనక్కు నెడుతుంది. దానిని ఛేదిస్తూ ముందుకు సాగాలి. స్విమ్మింగ్ చేసేటప్పుడు నీరు అదే విధంగా మనిషిని వెనక్కు నెడుతుంది. గాలితో పోలిస్తే నీరు పది రెట్లు ఎక్కువ శక్తితో పని చేస్తుంది. అందుకే, స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎక్కువ క్యాలరీల శక్తి ఖర్చవుతుంది.
* ఒలింపిక్స్ వంటి మేజర్ ఈవెంట్స్‌లో పోటీపడే అత్యుత్తమ స్విమ్మర్లు సహజంగా రోజుకు నాలుగైదు గంటలు స్విమ్మింగ్ చేస్తారు. వారంలో ఐదు నుంచి ఏడు రోజులు ఈ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. సగటున రోజుకు ఐదు నుంచి పనె్నండు మైళ్లు వారు ఈత కొడతారు. దీనితోపాటు వెయిట్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ కూడా తప్పనిసరి.
* ఏదైనా రేస్‌ను పూర్తి చేసినప్పుడు రెండే చేతులతోనూ పూల్‌ను తాకాలి. ఫ్రీస్టయిల్, బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్స్‌లో మాత్రం ఒకే చేత్తో ఫినిషింగ్ ఆబ్జెక్ట్‌ను తాకుతారు.