ఆటాపోటీ

బాక్సింగ్‌కూ తప్పని బెడద..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడా రంగాన్ని ఫిక్సింగ్ మహమ్మారి క్రమంగా కబళిస్తోంది. ఒకటిన్నర దశాబ్దాల క్రితం క్రికెట్ రంగంలో ప్రకంపనలు సృష్టించిన ఈ సమస్య, ఇప్పుడు ఇతర క్రీడలకూ పాకుతోంది. బాక్సింగ్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయని అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య అంగీకరించడం విశేషం. ఫైట్‌కు రిఫరీలు, న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్న కొంత మంది తమతమ స్వప్రయోజనాల కోసం తప్పుడు ఫలితాలను ప్రకటిస్తున్నారనే విమర్శ ఎంతోకాలంగా బలంగా వినిపిస్తోంది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతగా ఉపయోగించుకున్నా, బాక్సింగ్ ఫలితాల సమయంలో తప్పుడు నిర్ణయాలు బైటపడుతునే ఉన్నాయి.
కంప్యూటర్ల ద్వారా విజేతను ఎంపికను సమీక్షించే విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ, వాటిని ఆపరేట్ చేస్తున్న వారు కూడా మనుషులే కాబట్టి అంతకు ముందు జరిగిన తప్పులే పునరావృతం అవుతున్నాయని అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వర్యంలోని రిఫరీలు, జడ్జీల కమిషన్ కార్యదర్శి పాట్ మెక్‌క్రోరీ స్పష్టం చేయడం గమానార్హం. నిబంధనలను అనుసరించి, ఒక అంతర్జాతీయ బాక్సింగ్ ఫైట్‌ను రింగ్‌కు అన్ని వైపుల నుంచి పరిశీలిస్తూ ఉంటారు. వీరిలో కనీసం ముగ్గురు ఒక సెకను తేడాతో బజర్‌ను నొక్కితేనే పాయింట్ నమోదవుతుంది. అంటే, ప్రత్యక్షంగా ఫైట్‌ను చూస్తూ, అదే సమయంలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కూడా వారు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఐదుగురు జడ్జీల్లో కనీసం ముగ్గురు ఒక సెకను తేడాతో స్పందించడం అనేది ఎంతవరకు సాధ్యమనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఈ నిబంధనను అమలు చేస్తున్న కారణంగా, ఒక బాక్సర్ తన ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని కనబరచిన ప్రతిసారీ మార్కులు పడతాయన్న గ్యారంటీ లేకుండాపోయింది. దీనికి తోడు కొంతమంది రిఫరీలు రింగ్‌లోనే అక్రమాలకు పాల్పడుతూ, తమకు ఇష్టమైన బాక్సర్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం, ఇష్టం లేకపోతే, నిబంధనల పేరుతో వేధించడం ఆనవాయితీగా మారింది. రింగ్‌లో ప్రత్యక్షంగా రిఫరీలు, రింగ్ వెలుపల పరోక్షంగా జడ్జీలు తమతమ శక్తి మేరకు అక్రమాలకు పాల్పడుతున్నారనేది అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య కూడా అంగీకరిస్తున్న నిజం. ప్రతి క్రీడకూ ఇలాంటి సమస్యలు తప్పకపోయినా, బాక్సింగ్ వంటి ప్రాణాంతక క్రీడల్లో ఫిక్సింగ్ చోటు చేసుకుంటే, దాని ఫలితం తీవ్రంగా ఉంటుందనేది వాస్తవం. బాక్సింగ్ నిబంధనల ప్రకారం గొంతు, గుండె, నాభి కింద భాగంలో పంచ్‌లు విసరడానికి వీలులేదు. ముఖాన్ని లక్ష్యం చేసుకొనే పోరాటం సాగించాలి. ఎవరైనా ఇందుకు భిన్నంగా ప్రత్యర్థి ఇతర శరీర భాగాలపై దాడికి దిగితే, తక్షణమే అతనిని అనర్హుడిగా ప్రకటిస్తారు. సున్నిత భాగాలకు దెబ్బతగిలితే ఆ బాక్సర్ శాశ్వతంగా వికలాంగుడయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. బాక్సింగ్‌ను రాక్షస క్రీడగా కాకుండా, వినోదాన్ని అందించే క్రీడగా మార్చడానికి అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య అమలు చేస్తున్న ఎన్నో నిబంధనల్లో పంచ్‌లు ఎక్కడ తగలకూడదనేది కూడా ఒకటి. కానీ, కొంతమంది రిఫరీల కారణంగా పలువురు బాక్సర్లు తీవ్రంగా గాయపడుతుంటే, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. జడ్జీల తప్పుడు నిర్ణయాలతో సామర్థ్యానికి నిలువు పాతర తప్పడం లేదు. సమస్యను పరిష్కరించడానికి ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.