నిజామాబాద్

బంగారు భవిష్యత్తు కోసమే నాక్ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, జనవరి 21: తెలంగాణ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే నాక్ ద్వారా ప్రతిష్టాత్మక గ్రేడింగ్ సాధించామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అన్నారు. గురువారం ఆయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, పదేళ్లు కూడా పూర్తి చేసుకోని తెలంగాణ యూనివర్సిటీ, అనతి కాలంలోనే అసమాన ప్రగతిని సంతరించుకుని ప్రతిష్టాత్మక నాక్ గుర్తింపు దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల శ్రేయస్సు కోసమే నాక్ గుర్తింపు కోసం సాహసించామని, ఆశించినట్టుగానే మంచి స్కోరింగ్‌తో నాక్ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. నాక్ గుర్తింపు వల్ల ఇక్కడ చదివిన విద్యార్థుల డిగ్రీలకు విలువ పెరుగుతుందని అన్నారు. జాబ్ మార్కెట్‌లోనూ నాక్ గుర్తింపు ఉన్న విద్యా సంస్థలో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. ఇంచార్జ్ వి.సి పార్థసారథి మార్గనిర్దేశంలో తామంతా కలిసికట్టుగా కృషి చేసి నాక్ ద్వారా గుర్తింపును సాధించుకోవడం ఎంతో సంతృప్తిని అందించిందని అన్నారు.
యూనివర్శిటీ ఏ పని చేసినా విద్యార్థులే కేంద్రంగా, వారి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత చొరవతో అమెరికాలోని చికాగో స్టేట్ యూనివర్సిటీతో ఎంఓయు కుదుర్చుకోవడం, వై-ఫై ఇంటర్నెట్ సౌకర్యం సమకూరడం, నిరంతర విద్యుత్ సరఫరా, శుద్ధి చేసిన మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం నాక్ గుర్తింపు దక్కడంతో యుజిసి, ఐసిఎస్‌ఎస్‌ఆర్, మానవ వనరుల మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ల నుండి, రూసా పథకం ద్వారా అధిక మొత్తంలో నిధులు సమకూరే అవకాశం ఉంటుందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తె.యును దేశంలోనే ఆదర్శవంతమైన యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. నాక్ గుర్తింపు రావడానికి సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా రిజిస్ట్రార్ లింబాద్రి కృతజ్ఞతలు ప్రకటించారు. విలేఖరుల సమావేశంలో పిఆర్‌ఓ రాజారాం పాల్గొన్నారు.