రంగారెడ్డి

బాధితుడిపై కత్తితో ఫైనాన్షియర్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, ఫిబ్రవరి 15:నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రైవేట్ ఫైనాన్షియర్ చెలారేగిపోయి ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. నాచారం సిఐ ప్రవీందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం నాచారం ఒల్డ్ విలేజ్‌కి చెందిన ఉటూకూరి కుమార్‌గౌడ్ ప్రైవేట్ ఫైనాన్షియర్‌గా నాచారంలో లక్షకు 10రూపాయల వడ్డీకి గిరి అనే బంగారు వ్యాపారికి అప్పు ఇచ్చాడు. అప్పు తీసుకున్నా గిరి నెలకు 10రూపాయల చొప్పన వడ్డీ కట్టిన అదనంగా ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఆదివారం సాయంత్రం నాచారంలోని కుమార్ ఫైనాన్స్ కార్యాలయానికి రావాలని గిరిని కోరగా అతను ఒంటరిగా రావడంతో కత్తితో దాడి చేశాడు. కుమార్‌గౌడ్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కేసు రాజీ కుదిరిచేందుకు స్థానిక నాయకులు ప్రయత్నంచడంతో నాచారం పోలీస్‌స్టేషన్ ముందు బాధితుడి బంధువులు ఆందోళన చేశారు.