భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-84

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ చెక్కపలకకు నాలుగు వైపులా పాత గుడ్డలుకట్టి దూలానికి కట్టి ఉంది. బాగా పైకి కట్టివున్నారు. పైగా ఆ చెక్క నలుమూలలా నాలుగు ప్రమిదల్లో దీపాలు వెలుగుతున్నాయి. వాటి మధ్యలో బాబా పడుకుని వున్నారు. ఆ దృశ్యాన్ని చూడగానే వారికి నోట మాట రాలేదు. బాబా పొడవుగా ఉండేవారు. కాని ఈ నాలుగు మూరలు లేని చెక్క బల్లపై ఎలా సరిపోయారు. పైగా అది పైకి కట్టి ఉంది. దానిపైకి ఎలా ఎక్కారు నాలుగు దీపాలు ఎందుకు పెట్టుకున్నారు. వారి కేమీ అర్థం కాలేదు. అప్పట్నుంచి ఆ దృశ్యాన్ని చూడడానికి చాలామంది ఆసక్తి చూపేవారు. కాని బాబా ఎవరు చూస్తుండగా ఆ బల్లపైకి ఎక్కేవారే కాదు. కాని ఆ బల్లపై పడుకుని మాత్రం కనిపించేవారు. ఇదంతా అందరికీ అద్భుతంగా కనిపించేది.
శిరిడీలో రోడ్డుపక్కగాలెండి తోపు ఉంది. అక్కడికి అపుడప్పుడు బాబా వెళ్లేవారు. ఆయనతో కూడా అబ్దుల్లా అనే అతను వెళ్లేవాడు.
నానా అనే అతను వచ్చి ‘అబ్దుల్లా బాబా ఎపుడూ ఒక్కరే ఈ లెండితోపు వెళ్తారు కదా. మరి అక్కడ ఏం చేస్తారు ’అని అడిగాడు.
అబ్దుల్లా ‘ తోపుమధ్యలో ఒక చిన్న గుంట ఉంది కదా. అందులో బాబా దీపం పెట్టేవారు. నేను రెండు బకెట్లతో నీరు పెట్తాను. ఆ నీటిని నాలుగు వైపులా చల్లుతారు. ఆ పై అక్కడే బాబా కొద్దిసేపు కూర్చుంటారు. ఆ దీపం దగ్గరే అటు ఇటు నడుస్తారు. ఆపై ఏవో మంత్రాల్లాంటివి బాబా చదువుతుంటారు.’అంతకన్నా ఏమీ చేయరు. నీవు ఏం చేస్తున్నావని నేను ఎపుడూ అడగలేదు. మంత్రాలో కావో కూడా నాకు తెలీదు. బాబా మాత్రం ఏదో చదువుతున్నట్టు నాకు అన్పిస్తారు ’అని చెప్పాడు. చాలామంది తోపు దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించారు. కాని ఏమీ వెళ్లలేకపోయారు. బాబా పెట్టే దీపాన్ని చూశారు కాని బాబా చదివేది ఏమిటో పఠించేదో ఏమిటో ఎవరికీ తెలుసుకోలేకపోయారు.
అప్పుడప్పుడు శిరిడీకి ఉత్తరాన ఉన్న బావి దగ్గరకు కూడా బాబా వెళ్తుండేవారు. అక్కడ కూర్చుని ఉండేవారు కూడా కానీ ఎపుడూ శిరిడీ దాటి బాబా ఎక్కడకూ వెళ్లలేదు.
బాబా అలా తిరుగుతూ తిరుగుతూ మారుతి ఆలయం వైపుకు వచ్చేవారు. ఆ మారుతి ఆలయం దగ్గర నిలబడి ఎన్నో భంగిమల్లో నిల్చునేవారు. అప్పుడప్పుడు అక్కడే నిలబడి ఏదో గట్టిగా మాట్లాడుతూ ఉండేవారు. ఈ సంగతి తెలిసిన శిరడీ వాసులు ఎవరూ బాబాను ఏం చేస్తున్నారని అడిగేవారు కాదు.
ఒకరోజు నాసిక్ నుండి ఒక భక్తుడు బాబాను చూద్దామని వచ్చాడు. అతడు వచ్చేసరికి మారుతి ఆలయం ముందు బాబా నిల్చుని గట్టిగా మాట్లాడుతున్నారు. బాబా చుట్టూరూ ఎపుడూ చాలా మంది ఉండేవారు. వారి దగ్గరకు వెళ్లి ఆ వచ్చినతను‘ఇదేంటి నేను బాబా దేవుడని వచ్చాను. ఇక్కడ కు పిచ్చివానిగా చేస్తున్నారేమిటి ’అని అన్నాడు.
వారు ఇదంతా పిచ్చి చేష్టలు కావు. బాబా ప్రకృతి శక్తులను కట్టడి చేస్తున్నారు. ఇలా చేయడం ఈశిరిడీ కి ఎంతోమంచిది అని చెప్పారు. అది విని అతడు బాబా కు నమస్కరించి వెళ్లిపోయాడు.
బాబా దగ్గరకు శ్యామా, నానా, మహిల్సాపతి, సాఠే ఇలా చాలా మంది భక్తులు కూర్చుని ఉన్నారు. బాబా ఉన్నట్టుండి ‘‘అబ్బా’’ అని పెద్దగా కేకవేసారు. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో ఎవరికీ ఏమీ తెలియలేదు. కానిబాబా ధరించి ఉన్న బట్టలన్నీ తడిసిపోయాయి. అక్కడున్నవారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అమాన్పడి చూస్తున్నారు. మరికొద్దిసేపటికి
‘‘గండం గట్టెక్కింది భగవంతుడు చల్లగా చూశాడు’’ అన్నారు బాబా.
ఇపుడైతే అసలు ఎవరికీ ఏమీ జరిగిందో తెలుసుకోలేకపోయారు.
వారు వెంటనే ‘‘బాబా ఏం జరిగింది ’అందరూ ఒక్కసారిగా అడిగారు.
‘‘కంగారు ఏమీ లేదు. దుష్టశక్తులు నావను ముంచేయాలని చూశారు. కాని మంచివారికి సదా భగవంతుని నీడ ఉంటుంది కదా. అందుకే భగవంతుడు ఆ నావను పైకి తేల్చేశాడు అంతే ’’అన్నారు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743