భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-104

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామవిజయం అనే గ్రంథాన్ని తీసుకొని వచ్చి చదివి నాకూ వినిపించు’అని చెప్పారు. వెంటనే వాఝే రామవిజయం తీసుకొని వచ్చి ప్రతిరోజు కాసేపు బాబా దగ్గర చదువుతుండేవారు.
బాబా భిక్షకోసం వెళ్లి ఆ భిక్షను తీసుకొని వచ్చి తనతో ఉన్న వారికి పెట్టి పక్షులను, పశువులకు కూడా పెట్టి మిగిలింది తినేవారు. అలా బాబా భిక్ష కు వెళ్లగానే మాధవ్ అను నతడు మసీదును బాగా శుభ్రం చేసేవాడు. బాబా ప్రాణపదంగా ఓ ఇటుకను దగ్గరనే ఉంచుకొనేవారు. ఎల్లపుడూ దానిని నెమురుతుండేవారు. ఆ ఇటుకను తన గురువుకు ప్రతిరూపం అనీ అనేవారు. ఆ ఇటుకకు మహిల్సాపతి, కాశీరామ్, షింపీ అనేవారు వచ్చి అభిషేకం చేసి పూలుపెట్టి పూజించి దానిని ధుని దగ్గర పెట్టేవారు. దానికి బాబా అడ్డుచెప్పేవారు కాదు.
ప్రతిరోజు అలానే జరుగుతుండేది. ఒకరోజు బాబా భిక్షాటనకు వెళ్లారు. ఆ సమయంలో మాధవ్ వచ్చి ఎప్పటిలాగా మసీదు శుభ్రం చేయసాగాడు. దుమ్ము తుడవడానికి అని బాబా ప్రాణంగా చూసుకొనే ఇటుకను చేతిలోకి తీసుకొన్నాడు. చేయి జారి ఇటుక నేలపై పడిపోయింది. ఆ ఇటుక ముక్కలుగా విరిగిపోయింది. దానితో మాధవ్ చాలా భయపడ్డాడు. ఇపుడు బాబా దీనిని చూస్తే ఎంత కోపం తెచ్చుకొంటారో, ఏమో నేను బాబా ఉగ్రరూపాన్ని చూడలేను అని చాలా బాధపడుతూ ఎలాగైనా ఆ విరిగిన ముక్కలను కలపాలని చూస్తున్నాడు. కాని అంతలో బాబా వచ్చేసారు. చూడనే చూసేసారు. కాని మాధవ్ అనుకొన్నట్టు బాబా కోపం తెచ్చుకోలేదు. ఆ విరిగి ఇటుక ముక్కలను తీసుకొని ‘ఇది ఇటుక కాదు.నా ప్రారబ్ధం, ఇది నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం. దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానిస్తాను. అది కాస్తా ఇపుడు విరిగిపోయింది. ఇక నేనెక్కువ కాలం బతకను. నా సమయం ఆసన్నమైంది. ’’ అన్నారు.
ఆ మాటలను విని తట్టుకోలేని మాధవ్ ‘బాబా మీరు నాకు అనుమతి నివ్వండి నేను ఈ ఇటుక ముక్కలను బంగారం, వెండి తీగలతో కలిపి చుట్తాను. అపుడు ఇది తిరిగి ఇటుక అతుక్కుంటుంది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అని అడిగాడు. బూటీ కూడా అక్కడ ఉండి సంగతి తెలసుకొని బాబా నాకు అనుమతి నివ్వండి నేను ఇటుకను కలిపి చుట్టి ఇస్తాను అని చెప్పాడు. కాని బాబా ఎవరి మాటలను అంగీకరించలేదు. ఏమీ వద్దులే అని వౌనం వహించారు.
అక్టోబరు 3 వ తేది
ఒకరోజు పొద్దున పురందరే, దీక్షితులు బాబా దర్శనానికి వచ్చారు. వారితో బాబా‘నేను ముందు వెళ్తాను. మీరు నా వెనుక వస్తారు’’’అన్నారు. ‘నా సమాధి మాట్లాడుతుంది. నా మట్టి సమాధానం చెబుతుంది. నా నామం పలుకుతుంది. ’అన్నారు.
వారికే కాదు అక్కడున్న వారికెవరరికీ బాబా చెప్పిన మాటలు అర్థం కాలేదు.
అట్లా కొన్ని రోజులు గడిచాయి. దేవీ నవరాత్రులు ఆరంభమయ్యాయి.
బాబా, తాత్యా ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఇద్దరూ ఎన్నో జన్మలనుంచి బంధమున్నట్టుగా ఉండేవారు. తాత్య బాబాను అడగకుండా ఏ పని చేసేవారు కాదు. బాబా కూడా తాను చేయబోయేదానిని చేయవలసిన దానిని ఎక్కువగా తాత్యకే చెప్పేవారు. ఈ దేవీ నవరాత్రులు ప్రారంభం నుంచే అటు తాత్య ఆరోగ్యం కుంటుపడింది. ఇటు బాబా ఆరోగ్యమూ జ్వరంతో బలహీన పడసాగింది. ఇద్దరూ అనారోగ్యం పాలైయ్యారు. శిరిడీ అంతా దేవీ పూజ చేసి వీరిద్దరి ఆరోగ్యాన్ని కాపాడమని వేడుకొనేవారు. ఒకరోజు తాత్య ను వెంట పెట్టుకొని రమ్మని బాబా మహిల్సాపతిని పంపించారు.
తాత్య అసలు నడవలేనంత బలహీనంగా ఉన్నాడు. కాని బాబా ఆహ్వనం పంపితేనేను రాకుండా ఎలా ఉండగలను అన్నాడు.
మహిల్సాపతి సాయంతో తాత్య మసీదుకు వచ్చి బాబా ను చూసి కన్నీరు కారుస్తూ బాబా పాదాల వద్దే కూర్చుని పోయాడు. బాబా కూడా ఎంతో నీరసంగా లేచి తాత్యను దగ్గర తీసుకొని కన్నీరు కార్చాడు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743