భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-108

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రాత్రి అక్కడే బసలో నిద్రపోయాడు దూబే. మరలా బాబా ఆయన కలలో కనిపించి నేను ఏమన్నా మామూలు మనిషినా చనిపోవడానికి నేనే నీ గురువును.. నీవు శిరిడీ రా అని పిలిచారు. ఈ మాటలకు దూబేకు మెలుకువ వచ్చింది. అతడు ఎలాగైనా శిరిడీ చేరాలని పనిని వదిలేసి శిరిడీ బయలుదేరి వచ్చాడు.
అక్కడ బూటీవాడలో ఉన్న మసీదును చూడగానే దూబేకు ఎంతో దుఃఖం కలిగింది. అతడు ఏడుస్తూ ‘నీవే నాగురువు అని చెప్పావు.మరి ఇక్కడకు వస్తే నీవు సమాధి చెందావు కదా. ఇక నన్ను ఎవరు చూస్తారు’అని ఏడ్చాడు.
అపుడే అక్కడికి హేమాదిపంతు వచ్చాడు. దూబేని చూసి ‘మీరు హోషంగాబాద్ నుంచి వచ్చారుకదా. మిమ్ములను మా ఇంటికి ఆహ్వానిస్తున్నారు. రండి. మాఇంట్లో విశ్రాంతి తీసుకొని భోజనం చేయండి’అని పిలిచారు.‘ నా పేరు నా ఊరు మీకు ఎలా తెలుసు’ అని ఆశ్చర్యంగా అడిగాడు దూబే.
‘ఇపుడే బాబా కనిపించి అక్కడ నాభక్తుడు చాలా దూరం నుంచి ఆవేదనతో వచ్చాడు. నీవు వెళ్లి అతనిని ఆతిధ్యానికి పిలువు’ అని చెప్పారు. అందుకే వచ్చా అన్నాడు హేమాదిపంతు.
మరింత ఆశ్చర్యబోయి‘ఏమిటి ఈ బాబా మీకు కనిపించారా’అన్నాడు.
ఇక అపుడు బాబాతో వారికున్న అనుబంధాన్ని అంతా చెబుతూ ఇంటికి దూబెను తీసుకెళ్లాడు హేమాదిపంతు. బాబా విషయాలు వింటూ ఆనంద తన్మయుడు అయ్యాడు దూబే.
***
బాబా మహిమలు ఊరూరా పాకుతున్నాయి. బాబా బతికి ఉన్నప్పటి కంటె కూడా చనిపోయిన తర్వాత వేల సంఖ్యలో బాబా భక్తులు శిరిడీ వస్తున్నారు. సుశీలమ్మ అను ఆమె తన భర్తతోటి, తన బిడ్డతోటి శిరిడీ వచ్చింది.
ఆమెను శిరిడీ వాసులు ఎంతో ఆదరించారు. ఆమె తన అనుభవాన్ని వారితో ఇలా పంచుకొంది.
‘నాకు పెళ్లై ఎంతో కాలం దాటింది. కాని పిల్లలు లేరు. మా అన్న నాకీ బాబా ఫోటో నిచ్చి పూజించుకో ఫలితం ఉంటుంది ’అని చెప్పారు. నేను ప్రతిరోజు బాబా ను పూజించేది. ప్రతిరోజు నన్ను సంతానవతిని చేయమని కోరేదాన్ని. కొద్ది నెలల్లోనే నాకు గర్భం నిలిచింది. ఇదిగో ఈ పిల్లవాడు జన్మించాడు. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాము.
శిరిడీ వచ్చి బాబాను దర్శనం చేసుకోవాలని అనుకొన్నాము. కాని మాకు రావడం కుదరలేదు.
ఒకరోజు నాకు ఉన్నట్టుండి కడుపులో నొప్పి మొదలైంది. విరోచనాలు ఆగకుండా వచ్చాయి.
నేను ఎంతో నీరస పడిపోయాను. కాని బాబా స్మరణ మాత్రం మానకుండా చేస్తుండేదాన్ని. పిల్లవాడేమో చిన్నవాడు. నాకేమో విరోచనాలు దానితో నేను బాగా అలసిపోయాను. లేచి నిలబడలేక నా మంచం పక్కనే కూర్చున్నాను. ఎక్కడి నుంచో ఒక వెలుతురు వచ్చింది. ఆ వెలుతురు ఏమిటా అని నేను చూసే లోపు బాబా ఆకుపచ్చ కఫ్నీ ని ధరించి నాకు ఓ తాయెత్తునిచ్చి ‘ఇదిగో దీనిని కట్టుకో’ నీకు తగ్గిపోతుంది. నేను ఆనందంగా ‘బాబా! ’అంటూ గట్టిగా అరిచాను. నా అరుపులకు పక్క గదిలో ఉన్న మావారు మా అత్తగారు వాళ్లు వచ్చారు. జరిగిన సంగతి చెప్పాను. నా చేతిలో తాయెత్తును చూసి వారు బాబాకు పదేపదే మొక్కారు. మా వారు ఈ తాయెత్తును నా కుడిచేతికి కట్టారు. అంతే విరోచనాలు ఆగిపోయాయి. కడుపు నొప్పికూడా తగ్గిపోయింది. అందుకే మేము బాబా సమాధినన్నా స్వయంగా చూడాలని ఇక్కడికి వచ్చాము’అని సుశీలమ్మ బూటీవాడలో బాబాభజనకోసం కూర్చుని ఉన్న భక్తులతో చెప్పింది. వారంతా ఆమెలో ఉన్న భక్తి వల్ల నే బాబాను దర్శనం చేసుకొన్నట్లు ఆమెను ఎంతో అదృష్టవంతురాలివని పొగిడారు. అంతలో భజనకు సమయం అయిందని అందరూ బాబా భజన చేయడం మొదలెట్టారు.
***
నెల్లూరు నివాసి బి. ఉమామహేశ్వరరావు. ఈ ఉమామహేశ్వరరావు తరచూ ఆయన ఉద్యోగరీత్యా చాలా ఊర్లకు తిరుగుతుండేవారు. ఆయనకు అప్పుడప్పుడు కొద్దికొద్దిగా గుండెనొప్పివచ్చేది. కొద్దిరోజులుగా ఆయనకు గుండెనొప్పి వచ్చినపుడు స్పృహతప్పిపడిపోతున్నారు. వారు డాక్టర్లదగ్గరకు వెళ్లారు. వారు ఉమామహేశ్వరరావుకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆరోజు ఆయన పొరుగూరికి ఉద్యోగరీత్యావెళ్లవలసి ఉంది. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743