భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-109

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన తన భార్యతోటి
‘నేను ఈ కనిగిరికి వెళ్లి వచ్చాక డాక్టర్లు చెప్పినట్లు ఆలోచిద్దాం’అని చెప్పారు. ఆమె దానికి ‘ముందుగా ఆరోగ్యం చూసుకోవాలి కదా’అంది.
కాని ఉమామహేశ్వర రావు మరేంభయంలేదు. నాకు భగవంతుడు మంచి చేస్తాడు లే. ఫర్వాలేదు అని చెప్పారు.
ఆరోజు రాత్రి ఆయనకు కలలో ఓ ఫకీరు కనిపించి మరి నామీద నీకింత నమ్మకం ఉందికదా. మరి నా సమాధిని ఒక్కసారైనా దర్శించలేదేమి అని అడిగారు.
‘స్వామి మీరు నాకు తెలియదు కదా. మీరు సర్వాంతర్యాములు మీరే నాకు మార్గం చూపించండి. మీరు నా సద్గురువు వలె ఉన్నారు’అని కలలో ఉమామహేశ్వరరావు అన్నాడు. దానితో అతనికి మెలుకవ వచ్చింది. ఆ కలను తన భార్యతో చెప్పాడు.
ఆమె ఏమీ పట్టించుకోలేదు. ముందుగా అనుకొన్నట్లే కనిగిరి వెళ్లారు. అక్కడ ఆయనకు శిరిడీకి వెళ్లి అక్కడ బాబాసమాధిని దర్శించుకొంటే మొండి వ్యాధులన్నా దూరం కావాల్సిందే . అదంతా బాబామహత్తు అని చెప్పారు. ఆ శిరిడీకి ఎలా వెళ్లాలో తెలుసుకొని ఉమామహేశ్వరావు ఆ శిరిడీ కి వెళ్లారు. బాబా సమాధిని చూడగానే ఆయనకు ఎంతో ఆనందం వేసింది. తన్ను ఉద్ధరించే మహానుభావుడు బాబానే అనుకొన్నారు. బాబాకు తన గుండెనొప్పిని తగ్గించమని వేడుకొని ఇంటికి వచ్చేశారు.
ఆ రాత్రి ఆయన కలలో బాబా కనపడి గుండెనొప్పి ఏం చేయదు ఆపరేషన్ అక్కర్లేదు. ఇదిగో ఈ ఊదిపెట్టుకో అని నుదుట ఊది రాశారు. ఉమామహాశ్వరావుకు మెలుకువ వచ్చి చూసేసరికి నుదుట న విభూతి వుంది. ఆ విషయం తన భార్యకు చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోయింది. కాని ఆయనకు పొద్దునే్న బాగా గుండెనొప్పి వచ్చింది. అతడు నొప్పితో విలవిలాడాడు.
దానితో ఉమామహేశ్వరరావు భార్య, మిగతా బంధువర్గం ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టరు ఉపశమనం కోసం మందులు ఇచ్చారు. వారు అతనిని పరీక్ష చేసి ఆపరేషను ఎప్పుడు చేయవచ్చో చెప్తామని పరీక్ష హాలుకు తీసుకొని వెళ్లారు. కాని చిత్రం ఆయన గుండెను పరిశీలించి చూస్తే ఆయనకు అంతా సజావుగా ఉంది. వారు ఆశ్చర్యపోయి ఆ విషయం వారి బంధువులకు చెప్పారు. క్రితం సారి వచ్చినపుడు ఆపరేషను తప్పనిసరిగా చేయించుకోవాలని మేమే చెప్పాము కాని ఇపుడు అతని గుండె మంచి ఆరోగ్యంగా ఉంది. మరి ఈ నొప్పి ఎందుకు వచ్చిందో తెలియడంలేదు. ఇపుడు చాలా ఉమామహేశ్వరరావు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు. ఇక అప్పట్నుంచి ఎపుడూ ఉమామహేశ్వరరావుకు గుండెనొప్పి అంటూ రాలేదు. అది ఆ బాబా చేసిన చిత్రమని వారు అక్కడి డాక్టర్లను బంధువులకు చెప్పారు.
దాసగణు బాబా సమాధి చెందాక ఒకరోజు శిరిడికి శ్రీరామ నవమి ఉత్సవాలకు వెళ్లాడు.ఆయనతోపాటుగాశ్రీరామచంద్ర పాఠేకర్ వారి భార్యకూడా వచ్చారు. తిరిగి వచ్చేటపుడు రైలులో వస్తున్నారు. ఒకచోట రైలు ఆగితే వారు మంచినీళ్లకోసం దిగారు. కాని శ్రీమతి పాఠేకర్ నీళ్లు తాగుతుండగానే రైలు కదిలింది. ఆమె హడావుడిగా పరుగెత్తి వెళ్లారు. ఆ పరుగెత్తడంలో ఆమె కాలుజారి రైలుకు ఫాట్ల్‌ఫారమ్ మధ్యలో పడిపోయింది. అందరూ గాబరా పడిపోయి రైలు చైన్లు లాగి రైలు బండి ఆపుచేయించారు. ఫ్లాట్‌ఫారమ్ కిందనుంచి శ్రీమతి పాఠేకర్ సురక్షితంగా బయటకు వచ్చారు. ఆమె పైకి వచ్చి కంగారు లేదు నేను ఇలా పడిపోతుండగానే బాబా అని అరిచాను. ఎక్కడనుంచి వచ్చారో బాబా నాకు కనిపించి ఆయన చేతులను నాపై పెట్టారు. అంతలో రైలు ఆగింది. ఆయనే నన్ను ఫ్లాట్‌ఫారమ్ పైకి ఎక్కించారు. నేను ఎక్కి తిరిగి చూస్తే నవ్వుతూ వెళ్లిపోయారు అని చెప్పింది. అది విని అక్కడి వారందరూ బాబా సజీవంగా తమతో కూడా ఉన్నట్లుగా భావించారు ఎలుగెత్తి బాబా అని అరిచారు. రైలు ఎక్కి అందరూ కలసి బాబా భజన చేస్తూ వారి గమ్యస్థానాలకు వెళ్లారు.
***
బాబా సమాదిగతులయ్యాక ఒకరోజు హేమాదిపంతు దాసగణుని పిలిచి ‘దాసు నీవు ఈరోజు సాయి ని గురించి నీ అనుభవాలను మాకు చెప్పు’అని అడిగారు.
దాసగణుంతో ఆనందంగా ఎందుకు చెప్పను. అవి చెప్పడం నాకు ఎంతో ఇష్టం అంటూ ప్రారంభించాడు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743