భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం 85

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక ఏమీ మాట్లాడలేదు. అక్కడి వారు గుసగుసలాడారు. ఎవరికో ఏదో కష్టం వచ్చి ఉంటుంది. బాబా వారిని కాపాడిఉంటారు అనుకొన్నారు.
అంతలో బాబాకు టెలిగ్రామ్ వచ్చింది. మహిల్సాపతి తీసుకొని దానిలో ఉన్నది ఇలా చదివాడు
‘బాబా!దయామయా ! నేను వేసిన కేక నీవు విని అక్కడికి వచ్చి నాతో పాటు నా ప్రయాణీకులందరినీ కాపాడావు బాబా. ఒకవేళ నీవు అక్కడికి రాకపోయి ఉంటే మేము అంతా దాదాపు 3 నౌకలు నీటిపాలు అయ్యేవి. నేను నిజంగా దేవునివే. నేను సదా నీకు కృతజ్ఞతగా ఉంటాను. ఎల్లప్పుడు నీ సేవలో నా జన్మను తరింపచేసుకొంటాను. బాబా ఎల్లవేళలా నాకు తోడు నీడగా ఉండి నన్ను నాతోపాటు ఉన్నవారిని కాపాడు బాబా.వారందరి తరఫున కూడా నేనే నీకు కృతజ్ఞతలు చెబుతున్నాను. నీ రాక వల్ల మూడు నౌకలలోని జనమే కాదు వారి కుటుంబాలు కూడా రక్షించబడినాయి ఇట్లు మీ భక్తుడు జహంగీర్’’ అని బహిల్సాపతి చదివాడు.
బాబా చిరునవ్వు నవ్వారు. అక్కడికి వారికి అపుడు అర్థం అయింది. ఇందాక బాబా ధరించిన బట్టలు ఎందుకు తడిసిపోయాయో అర్థం అయింది. కాని బాబా ఇక్కడే వుండి ఆ సముద్రంలోకి ఎలా వెళ్లారు. అయినా బాబా యోగులు. యోగులు ఎపుడూ స్థూల శరీరంతోనే అన్ని పనులు చేయరుకదా. వారి సూక్ష్మశరీరంతో కూడా అన్నింటిని చక్కబెట్టగలరు. ఎక్కడ ఏ భక్తుడున్నా వారిని బాబా రక్షించగలరు అని అందరూ అనుకొన్నారు.
ఒకరోజు బాబా దగ్గరకు లక్ష్మీబాయి వచ్చేసరికి బాబా గోధుమలు విసురుతున్నారు. వారితో పాటు ఆ ఊరి స్ర్తిలలో కొంతమంది కూర్చుని గోధుమలు విసురుతున్నారు. వారితో లక్ష్మీబాయి కూడా కలసింది. అందరూ బస్తాల నిండా ఉన్నగోధుమలను విసిరారు. వారిలో వారు ఈ పిండి నంతా ఇపుడు ఇక్కడున్న అందరికీ బాబా ఇస్తాడని అనుకొంటున్నారు.
‘ పిండి మీరు తినడానికి కాదు. రాబోయే కాలంలో ఈ శిరిడీలో మశూచి ప్లేగు వ్యాపించబోతుంది. ప్లేగు వల్ల కనీసం ఏడుగురు అన్నా చనిపోతారు. కనీసం మిగతా వారన్నా బాగుండాలి కదా. అందుకే మీరు ఈ పిండి నంతా తీసకుని వెళ్లి శిరిడీ సరిహద్దుల్లో చల్లి రండి ’’అన్నారు.
‘బాబా ఈ పిండి చల్లితే ప్లేగు రాకుండా ఉంటుందా చెప్పు. ఇంత కష్టపడి ఈ గోధుమలు విసిరాము కదా. మాకిస్తే మేము రొట్టెలు చేసుకొంటాం’అంది సీతాబాయి.
‘సీతాబాయి! నీకు ఏం తెలీదు. నీకు కావాలంటే వేరే గోధుమ పిండిని ఇస్తాను కాని ముందు ఈ లక్ష్మీబాయితో కలసి అందరూ వెళ్లి ఆ పిండి నంతా చల్లిరండి’ అని బాబా చెప్పారు.
అంతే అందరూ లేచి ఆ పిండి నంతా గినె్నలకెత్తుకుని చల్లడానికి వెళ్లారు.
తెల్లవారి మామూలుగా స్ర్తిలు బాబా దగ్గరకు వచ్చారు. అంతలోపే మహిల్సాపతి , నానా , హేమాదిపంతు లాంటివాళ్లు కూడా వచ్చి ఉన్నారు. బాబా కూర్చుని ఉన్నారు. ఆయన చేతులమీద ఎర్రని బొబ్బలు కనిపించాయి. వారంతా వాటినే చూస్తున్నారు.
‘బాబా మేము వైద్యులను పిలిపిస్తాము. మీరు వెంటనే చికిత్స చేయించుకోండి. మీ చేతులపై ఏడు బొబ్బలను చూస్తుంటే మాకు భయంగా ఉంది’అన్నాడు నానా.
దాన్ని చూసిన కిరణ్ మనసులో ‘ఇదేంటి ఇలా బొబ్బలు వచ్చాయి. నేను గోధుమ పిండిని ఎవరికీ తెలియకుండా తీసుకొన్నాను కదా. అందుకని ఇలా బాబా కు ప్లేగు వ్యాధి వచ్చిందా. దీనివల్ల బాబా ఏవౌతారో. అయినా నేను మా ఇంట్లో ఉన్న ముసలి వారికోసంకదా ఈ గోధుమ పిండిని తీసుకొన్నాను. వారి ఆకలి తీర్చడానికి నా దగ్గర ఏమీ లేదు. అందుకే ఈ పిండిని కొద్దిగానే తీసుకొన్నాను కదా. మా ముసలివారు రొట్టెలు తిని రెండు రోజులు అయిపోయింది. ఆయననేమో కాస్త అయినా రూకలు తేవడం లేదు. నేను పనికి పోదాం అంటే ఎక్కడా పని దొరకలేదు. అందుకే బాబా ఈ పిండి ని తీసుకొని వారికి రొట్టెలు చేసి ఇచ్చాను.
-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743