భక్తి కథలు

యాజ్ఞసేని-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అగ్నివేశ్యుడు’ అనే మహాముని శ్రేష్ఠునివద్ద ద్రోణుడు వేదాధ్యయనం చేసి, ధనుర్వేదం నేర్చుకొంటున్న కాలంలో పాంచాల రాజైన పృషతుని కుమారుడు ద్రుపదుడు కూడా వచ్చి ద్రోణునికి మిత్రుడై అతడితోపాటు గురువు వద్ద అన్ని విద్యలు నేరుస్తాడు. విద్యాభ్యాసం ముగిసిన తరువాత ద్రుపదుడు తన రాజ్యానికి వెళుతూ తనకు ద్రోణునితోకల మిత్రబృందాన్ననుసరించి అతడితో ‘‘నేను పాంచాల దేశానికి రాజైనప్పుడు నీవు నా దగ్గరికి రావాలి సుమా! నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించటానికి అర్హుడవు’’ అని ప్రార్థిస్తాడు. పృషతుని మరణానంతరం ద్రుపదుడు రాజౌతాడు.
ద్రోణుడు ధనుర్విద్యను అభ్యసించి గొప్ప ధనుర్విద్య పారంగుతడు అవుతాడు. అగ్నిశేశ్యుని వద్ద నుండి ‘ఆగ్నేయాస్తమ్రు’ మొదలుగాకల అనేక దివ్యాస్త్రాలను ప్రయోగ సంహారాలతోపాటు పొందుతాడు.
తండ్రి భరద్వాజుని ఆజ్ఞ మేరకు పుత్రులను పొందటానికై ద్రోణుడు ‘కృపాచార్యుని’ చెల్లెలైన ‘కృపి’ అనే ఆమెను వివాహం చేసికొంటాడు. కృపి యందు కొంతకాలానికి ద్రోణుడు ‘అశ్వత్థామ’ అనే ఒక కుమారుని పొందుతాడు.
జమదగ్ని కుమారుడైన పరశురాముడు బ్రాహ్మణులకు గొప్పగా ధనాన్ని ఇస్తున్నాడని వింటాడు ద్రోణుడు. మహేంద్రగిరిపై తపస్సు చేస్తున్న అతడి వద్దకు ధనాపేక్షతో వెళతాడు ద్రోణుడు. పరశురాముడిని చూసి సవినయంతో-
‘‘మహర్షీ! నేను భరద్వాజుడి పుత్రుడనైన ద్రోణుడను. నా ప్రణామములు స్వీకరించండి. ధనాన్ని ఆశించి తమ వద్దకు వచ్చాను’ అని అన్నాడు.
‘‘లోకం చేత పొగడ్తలందుకున్న ఓ ద్రోణా! నేను ఉన్న ధనాన్నంతా ముందే బ్రాహ్మణులకు ఇచ్చివేశాను. భూమినంతటినీ కశ్యప మహర్షికి ఇచ్చారు. నా దగ్గర ఇపుడు ఏమీయు లేవు. ఒక్క శస్త్రాలూ, అస్త్రాలూ, ఈ శరీరం మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిలో నీకు కావలసినవాటిని తీసుకొనుము. తప్పక యిస్తాను’’ అని అన్నాడు పరశురాముడు.
జనులచేత ప్రశంసింపబడే ఓ మహర్షీ! ధనాలలో మిక్కిలి మేలైన ధనాలు శస్త్రాస్త్రాలు. సంతోషంతో వీటిని తీసికొని కృతార్థుడనౌతాను. ఆ శస్త్రాస్త్ర సమూహాన్ని నాకిమ్ము’’ అని సవినయంతో ప్రార్థించాడు.
ఆ మాటలు విన్న పరశురాముడు సంతోషించాడు.
‘‘నా వద్ద దివ్యాస్త్రాలనన్నింటినీ వాటి ప్రయోగ మర్మాలతో, మంత్రాలతో నీకు ప్రసాదిస్తున్నాను. సంతోషంతో వాటి ప్రయోగోప సంహారాలతో గైకొనుము’ అని ఉదకధారతో ప్రసాదించాడు పరశురాముడు. ‘‘మహర్షీ! ధన్యుడను. ధన్యుడను సదా కృతజ్ఞుడను’’ అని ద్రోణుడు సంతోషంతో వెనుదిరిగి తన ఆశ్రమానికి వచ్చాడు.
ద్రోణునికి భార్య కృపివలన అశ్వత్థామ అనే కుమారుడు కలిగాడు. ధనం లేని చేత సంసారాన్ని భరించలేనివాడౌతాడు. ఇతరులను యాచించకుండా ధర్మార్గంలోనే కాలం గడుపుతుంటాడు.
ధనవంతుల బిడ్డలు ప్రతిదినం సంతోషంతో పాలు త్రాగుతుండగా ఒక రోజు అశ్వత్థామ అమ్మా! నాకు కూడా పాలు పోయండి’’ అని ఏడవటం మొదలుబెట్టాడు.
తనకున్న దారిద్య్రాన్ని తలంచిన ద్రోణుడు పరితపిస్తాడు. ఏమి చెయ్యాలో ఆలోచిస్తాడు. ఒక్కసారిగా తనబాల్య మిత్రుడైన ద్రుపదుడు జ్ఞాపకమొస్తాడు. అత డు ఇప్పుడు రాజైనాడు. అతడు అప్పట్లో నన్ను ఆహ్వానించి వెళ్ళావు. కావున అతడిని సహాయమార్జించటంలో తప్పులేదు.
‘‘నేను కోరితే ధనాన్ని ఇవ్వలేకపోయినా నాలు గు పాడి ఆవులైనా ఇవ్వకపోతాడా’’ అని తనలో తాను నిర్ణయించుకొని పాంచాల రాజధాని అయిన ‘కాంపిల్యానికి’ బయలుదేరాడు.
సకల సంపదలతో తులతూగుచున్న కాంపిల్యానికి వస్తాడు ద్రోణుడు. రాజప్రసాదానికి చేరుతాడు. అక్కడ వున్న ప్రతీహారులతో..
నేను ద్రోణుడను ద్రుపద మహారాజుకు స్నేహితుడను. నా రాకను మహారాజుకు తెలియపరచండి’’ అని అంటాడు.
భటులు ద్రోణుని రాకను ద్రుపదునికి తెలియపరిచి అతడి అనుజ్ఞతో ద్రోణుని తోడ్కొని ద్రుపదుని వద్దకు పోతారు.
ద్రోణుని చూచిన ద్రుపదుడు రాజగర్వంతో ద్రోణుని సాదరంగా ఆహ్వానించడు గదా మిత్రత్వాన్ని కూడా పాటించడు. అపుడు ద్రుపదుని చూచిన ద్రోణుడు నిలబడే...
‘‘నేను నీ బాల్యమిత్రును, ద్రోణుడను. గతంలో మనిద్దరం ఒకే ముని వద్ద ధనుర్విద్యను నేర్చుకున్నాము గదా, గతంలో నీవు పాంచాలానికి తిరిగి వస్తూ, ‘నేను పాంచాల దేశానికి రాజైనపుడు నీవు నా దగ్గరికిరావాలి సుమా! నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించటానికి అర్హుడవు’’ అని అన్నావు. - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము