భక్తి కథలు

యాజ్ఞసేని-21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీటిపై పడుచున్న సూర్య కిరణాలు నలుదిక్కులా మరలి రంగులను వెదజల్లుచున్నాయి. గంగామాత కూడా తన స్వయంవరానికి అందంగా అలంకరించుకొని రావాలన్నట్లుగా వేగంగా ప్రవహిస్తున్నది.
వేడిగాలులు గంగనీటిని సృజించి చల్లబడి కాంపిల్యం వైపు పరుగులిడుచున్నాయి.
నదిలో అక్కడ్కడా లెక్కకు మించి తరలి వస్తున్న చిన్న చిన్న పడవలనూ, వాటిపై పాటలు పాడుచూ నృత్యాలు చేస్తూ కనిపిస్తున్న స్ర్తిలనూ, పురుషులనూ, చిన్నపిల్లలనూ చూస్తున్నది.
అందరూ ఎంతో ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. కానీ తానొక్కతే అనుమాన భారంతో కంపిస్తున్నది. ఈ స్వయంవరం తనకు ఏ మేరకు మేలు చేస్తుంది.
తన తండ్రి కోరుకుంటున్న విధంగా తనకు భర్త లభించగలడా? అనే ఆవేదన. భర్తను పొందటానికి ఈ స్వయంవరం ఒక మంచి మార్గమేనా? ఆనే ఆవేదన-
తాను పొందిన భర్తను ప్రేరేపించి అతడితో తన తండ్రి కోరిక సఫలమయ్యేటట్లు చేయగలనా? అతడు తన తండ్రికి ద్రోణుడి చేతిలో కలిగిన అవమానానికి ప్రతీకారం తీర్చగలడా? ఒక సందేహం.
మనస్సులో అన్నీ సంశయాలే. చికాకు కలిగిస్తున్నాయి. దీర్ఘంగా ఆలోచిస్తున్న తనను ఎవరో పిలిచినట్లుగా తోచి వెనకకు తిరిగి చూచింది. ధాత్రేయిక నుంచుకొని వున్నది.
అమ్మా! రాకుమారి! ఏదో దీర్ఘాలోచనలో వున్నట్లున్నారు. కారణం తెలిసికొనవచ్చా? అడిగింది ధాత్రేయిక.
కొంత నిశ్శబ్దం తరువాత, ‘‘్ధత్రేయికా! చాలా సమయం నుండి పురవీధులలో కోలాహలాన్ని చూస్తున్నాను. మనసు స్వాధీనంలో లేకున్నది. ఏదో ఆవేదన నన్ను తొలచివేస్తున్నది’’ అని అన్నది యాజ్ఞసేని.
దేని గురించి? అడిగింది ధాత్రేయిక.
ధాత్రేయికా! ఈ స్వయంవరం నా తండ్రి కోరికను సఫలం చేయగలిగిన వరుణ్ణి నాకు చేకూర్చగలదా అనే అనుమానం నన్ను పీడిస్తున్నది. అందరూ నన్ను ఒంటరిగా వదలివేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ రాచకులం వారు రాత్రింబవళ్ళు అంతం లేని ఏదో ఒక కార్యక్రమంతో నాచేత విధుల నాచరింప చేయిస్తున్నారు. పిన్నలు, పెద్దలు, స్నేహితులు, బంధువులు వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏవో కానుకలను తెచ్చి నా తండ్రికి సమర్పిస్తున్నారు. ఇవన్నీ నా కోరికలనూ, నా తండ్రి కోరికను తీరుస్తాయా? అర్జునుడు వచ్చి నా పాణిని గ్రహిస్తాడా? చెప్పవే ధాత్రేయికా!’’ అని ఆవేదనతో అన్నది.
రాచకులంలో పుట్టినవారికి కొన్ని కఠినమైన నిబంధనలుంటాయి. ఇష్టమున్నా లేకున్నా వాటిని ఆచరించవలసిందే. వాటినుండి తప్పించుకోవడం అతి కష్టమైన పని. భరించవలసిందేనమ్మా! అన్నది ధాత్రేయిక.
అవును. మా గురుదేవులు కూడా నా స్వయంవరంలో వరునికి అతి కష్టమైన పరీక్షను పెట్టారు. ఆ పరీక్షలో విజయం సాధించినవాడినే నేను వరించాలి! వరుని ఎన్నుకొనే స్వేచ్ఛ నాకు లేదు గదా?’’ అని ఆవేదనతో అన్నది.
ఆ కఠినమైన పరీక్షకు ఒక కారణం కూడా వున్నది కదా? ఆ ఆర్యావర్తనంలో ధనుర్థారులలో అతి శ్రేష్ఠుడైన వాడినే ఎంపిక చేయాలన్నదే ద్రుపద మహారాజుల వారి ధ్యేయంగదా? అలా పరీక్షలో నెగ్గినవాడే తన కోరిక తీర్చగల సమర్థుడని నమ్మకం! కాదా అని అడిగింది చెలికత్తె.
స్వయంవరాలు రాజుల రాజకీయ అవసరాల కోసం కూడా కొన్ని సమయాలలో ఏర్పాటుచేయబడుతుంటాయి. అలా రాజులు భార్యలను పొందుతుంటారు. ఇదొకరమైన ఆటేగా! అన్నది యాజ్ఞసేని.
రాజుల రాజకీయాలు మనకర్థంగావు కదా! వాటిని మనకిష్టమున్నా లేకున్నా అంగీకరించాలి అని అన్నది దాత్రేయిక.
అయితే ఈ స్వయంవరం మామూలు స్వయంవరాలకన్నా భిన్నంగా వున్నది గదా? ఈ స్వయంవరం ఆశించిన వరుణ్ణి ఇవ్వగలదా? అర్జునుడు వస్తాడా? నమ్మకమేమిటి? అన్నది ద్రౌపది.
మన రాజపురోహితుడు చెప్పినట్లుగా వస్తాడేమో? అన్నది ధాత్రేయిక.
శ్రీకృష్ణవాసుదేవుడు మా తండ్రికి సాయం చేస్తానని వాగ్దానం చేశాడు. వాసుదేవడు తన వాగ్దానాన్ని నిలుపుకుంటాడా! అది నెరవేరుతుందా? అని ఆలోచనలో పడి కొంత తడవు నిశ్శబ్దంగా ఉన్నది.
మగధ దేశాధీశుడైన జరాసంధుడు నన్ను తన మనుమడైన మేఘసంధికి ఇమ్మని దూతల ద్వారా మన మహారాజుకు కబురంపాడు. ఈ స్వయంవరానికి అతడు కూడా రావచ్చును. అతడు బలవంతుడు. ఏ విపత్కర పరిస్థితులనైనా సృష్టించగలడు. ఇవన్నీ తలచుకుంటే భయంగానున్నది! అన్నది ద్రౌపది!
స్వయంవరానికి అనేక రాజకుమారులు, వివిధ దేశాధిపతులు వస్తారు. స్వయంవర నియామకాలకు అడ్డు తగలటం ఎవ్వరూ అంగకరించరు. జరాసంధుడు కూడా అందుకు అతీతుడు కాదు కాదుగా! భయపడవలసిందేమున్నది అని అన్నది ధాత్రేయిక.
శ్రీకృష్ణవాసుదేవుడు తన సోదరుడు బలరామునితో, యాదవ వీరులతో వస్తాడు. అతడు కేవలం గోపాలుడు కాదు. మహిమాన్వితుడు. నాకు సహాయం చేస్తాడని అనుకుంటున్నాను. ఈ స్వయంవరం ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను అని ఒక నిట్టూర్పు విడిచింది యాజ్ఞసేని. - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము