భక్తి కథలు

యాజ్ఞసేని-22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతసేపు పురవీధులలోని కోలాహలాన్ని వీక్షించి ఇద్దరూ నిష్క్రమించారు.

15
అది స్వయంవరం జరగనున్న రోజు.
స్వయంవరం నాటికి యాజ్ఞసేనికి ఇరువది రెండవ సంవత్సరం.
దక్షిణ గంగాతీరాన ఉన్న అందమైన నగరం కాంపిల్యము.
కాంపిల్యం బహు ప్రాకారాలతో, కోట గోడలతో, బురుజులతో, నిండుగా నీటితో నిండిన లోతైన అగడ్తలతో అలరారుచున్నది.
ఆ నగరం మహోన్నత హర్మ్యాలతో, పతాక ధ్వజాలతో శోభిల్లుచున్నది.
నగరమంతా వసంత శోభను సంతరించుకొన్నది.
వీధులకిరుప్రక్కలా పాలరాతితో నిర్మింపబడిన పాదచారుల మార్గాలు కనిపిస్తున్నాయి. పురవీధులన్నీ నీటితో చిలకబడి దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచబడ్డాయి. రంగు రంగుల రంగవల్లులు ఎతె్తైన భవనాల ముందు చిత్రీకరించబడి అందంగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న రథాలు అటునిటూ తిరుగుతూ శబ్దాలు చేస్తున్నాయి.
రంగు రంగుల వస్త్రాలంకరణలతో రాజభటులు అశ్వరూడులై పురవీధులందు నిలబడ్డారు. జానపదులు చక్కగా అలంకరించుకొని పురవీధులలో సందడి చేస్తున్నారు.
కాంపిల్యానికి ఈశాన్య దిక్కున మంచిగంధపు నీటితో తడపడబడి చదరం చేయబడిన స్థలంలో విశాలమైన ద్వారాలు, వెలుపలి వాకిళ్ళు, అనేక విధాలైన మంచెలు అమర్చబడి అందులో యాజ్ఞసేని స్వయంవరానికి వచ్చిన వివిధ దేశ రాజులకు ఆయా ప్రదేశాలతో విడిది కల్పించడమైనది.
ద్రుపద మహారాజు స్వయంవరం గురించి చాటింపు వేయించాడు. ‘‘ఆకాశంలో కట్టిన మత్స్యయంత్రాన్ని విల్లు ఎక్కుబెట్టి ఐదు బాణాలతో ఎవడు పడగొడతాడో అతడే ధర్మం ప్రకారం నా పుత్రికకు భర్త అవుతాడు’’ అనే ఆ చాటింపు వివిధ దేశ రాజులకు అందింది.
చాటింపు తెలిసిన నానా దేశ రాజులు స్వయంవరానికి వచ్చారు.
స్వయంవరం జరిగేనాటికి ఒక రోజు ముందే వివిధ దేశ రాజులు కాంపిల్య నగరంలో అడుగుపెట్టారు.
స్వయంవరానికి వచ్చిన రాజులకు ద్రుపదుడు కొడుకులతో కలిసి స్వాగతం పలికాడు.
విడిదిచేసిన రాజులకు మర్యాదలు చేయటానికై, భోజన సదుపాయాలకై ఆరితేరిన పరివారాన్ని నియమించాడు దృష్టద్యుమ్నుడు.
వినోదాన్ని కలిగించటానికై జానపదులతో నృత్య, నాట్య గానాలను కూడా ఏర్పాటుచేయించాడు.
స్వయంవరానికి ధాత్రరాష్ట్రులు (కౌరవులు) వచ్చారు.
దుర్యోధనుడు తన నూర్గురు తమ్ములయిన దుశ్శాసనుడు, దుస్సహుడు, దశ్శలుడు, జలసంధుడు, సముడు, సహుడు, విందుడు, అనువిందుడు, దుర్ధర్షుడు, సుబాహుడు, దుష్ప్రదర్షుణుడు, దుర్మర్షుణుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, వివింశతి, వికర్ణుడు, శలుడు, సత్త్వుడు, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, శరాసనుడు, దుర్మదుడు, దుర్విగాహుడు, వివిత్సుడు, వికటాననుడు, ఊర్జనాభుడు, సునాభుడు, నందుడు, ఉపనందుడు, చిత్రబాణుడు, చిత్రవర్మ, సువర్మ, దుర్విమోచనుడు, అయోబాహుడు, మహాబాహుడు, చిత్రాంగదుడు, చిత్రకుండలుడు, భీమవేగుడు, భీమబలుడు, బలాకి, బలవర్థనుడు, ఉగ్రాయుధుడు, సుషేణుడు, కుండధారుడు, మహోదరుడు, చిత్రాయుధుడు, నిషంగి, పాశి, బృందారకుడు, దృఢవర్మ, దృఢక్షత్రుడు, సోమకీర్తి, అనూదరుడు, ధృడసంధుడు, జరాసంధుడు, సదసువాకుడు, ఉగ్రశ్రవుడు, ఉగ్రసేనుడు, సేనాని, దుష్పరాజయుడు, అపరాజితుడు, కుండశాయి, విశాలాక్షుడు, దురాధరుడు, దుర్జయుడు, దృఢహస్తుడు, వాతవేగుడు, సువర్చసుడు, ఆదిత్యకేతుడు, బహ్వాశి, నాగదత్తుడు, అగ్రయాయి, కవచి, క్రథనుడు, కుండుడు, ధనుర్థరుడు, ఉగ్రుడు, భీమరథుడు, వీరబాహుడు, అలోలుపుడు, అభయుడు, రౌద్రకర్మ, దృఢరథాశ్రయుడు, అనాథృష్యుడు, కుండభేది, విరావి, ప్రమథుడు, ప్రమాది, దీర్ఘరోముడు, దీర్ఘబాహువు, వ్యూఢోరుడు, కనకధ్వజుడు, కుండాశి, విరజసుడులతోపాటు వైశ్య తమ్ముడైన యుయుత్సుడు, ప్రాణస్నేహితుడైన కర్ణుడు వెంట రాగా గర్వం ఉట్టిపడగా వచ్చాడు.
దుర్యోధనుడి మేనమామలు అయిన గాంధార రాకుమారులు శకుని, వృషకుడు, బృహద్బలుడు వచ్చారు. ఉత్తమ యోధుడైన ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ ఏతెంచాడు.
ఉలూక దేశాధిపతి అయిన బృహంతుడు, ఒక రాజైన మణిమంతుడు వచ్చారు.
మగదాధిపతి అయిన దండధారుడు, జరాసంధుడు కుమారుడైన సహదేవుడు, జరాసంధుని చిన్నకుమారుడైన జయత్సేనుడు, జరాసంధుని మనుమడైన మేఘసంథి (సహదేవుని కొడుకు) పటాటోపంతో, ససైన్యంతో ఏతెంచారు.
మత్స్య దేశాధిపతి అయిన విరాటరాజు తన కుమారులైన శంఖుడు, ఉత్తరుడుతో కలసి సపరివారంతో వచ్చాడు.
త్రిగర్త దేశాధిపతి, దుర్యోధనుడి మిత్రుడు అయిన సుశర్మ తమ్ములతో కలిసి వచ్చాడు.
- ఇంకా ఉంది

- త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము