భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం 88

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడున్న ఆడవారు వచ్చి ‘బాబా ఈ గరిటెతో ఈ పదార్థాన్ని కలియబెట్టమా’అని అడిగాము. కాని బాబా
‘ఎందుకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూద్దాం అంటారా సరే దీనికి గరిటెలు ఎందుకు లేమ్మా నేను చేస్తాను ’అంటూ కూర్చున్న చోటు నుంచిలేచి వచ్చి ఆ ఉడుకుతున్న పాత్రలోని పదార్థాలను తన చేతితో కలిపారు. అందరూ ఒక్కసారిగా ‘బాబా బాబా ’అని అరిచారు.
బాబా మాత్రం ఆ అరుపులను పట్టించుకోకుండా నెమ్మదిగా వచ్చి‘‘ ఇక ఉడికిపోయింది. మీరంతా కూర్చోండి నేను వడ్డన చేస్తాను. ఈరోజు అందరం కలసి తిందాం. ముందు నా మహిల్సాపతిని, నానా ను పిలుచుకుని రండి ’’ అన్నారు.
అందరూ ఆత్రంగా బాబా చేతుల వంక చూసారు. ఆ చేతులు కనీసం ఎర్రబారి కూడా లేకపోవడంతో వారు ఆశ్చర్యానందాలకు లోను అయ్యారు. పొద్దున నుంచి జరిగిందంతా కళ్లకు కట్టినట్లు వివరిస్తున్న గాయిత్రీ బాయి ని చూసి దాసుగణు ‘బాబా దైవస్వరూపుడు. లేకపోతే భగభగా మండే పొయ్యిమీద పదార్థాలను ఎవరైనా చేయి పెట్టి కలపగలరా? బాబా నాటి సీతమ్మ తల్లి అయ్యి ఉంటారు. దైవమే మనుష్యరూపంలో మన దగ్గరకు వచ్చాడు. అంతే బాబా దైవమే ’’అంటూ చేతులెత్తి ‘బాబా శరణం బాబా శరణం ’’అంటూ భజన చేసాడు.
‘‘దాసుగణు త్వరగా భోజనానికి రమ్ము వీరంతా ఆకలితో ఉన్నారు. తిన్నతరువాత అందరూ దేవుని భజన చేద్దాం రండి రండి ’అంటూ బాబా పిలిచారు.
అలా బాబా చేతి వంట శిరిడీ వాసులకు దక్కింది.
బాబా సర్వాంతర్యామి. బాబాకు తెలియనిది ఏమీ లేదు అనిపించేటట్లు ఉండేవారు. ఒక్కోసారి బాబాకు ఏమీ తెలియనట్టు ఉండేవారు. బాబాగురించి ఎవరు ఇదిగో ఇది బాబా తత్వం అని చెప్పడానికి వీలు లేకుండా ఉండేవారు. బాబా మహిమలను అనుభవించినవారు ఉన్నారు. బాబా లీలలను ప్రదర్శించి తమను కాపాడిన వైనం అనుభవించిన వారు కూడా ఉన్నారు. సకలజీవులకు ఈశ్వరుడు సాయిబాబానే అనేవారు ఉన్నారు. ఆయన సద్గురువు అనేవారు ఉన్నారు.
ఒకరోజు శ్యామా బాబాకు సేవ చేస్తున్నారు. బాబా ఉన్నట్టుండి మెల్లగా బుగ్గపై గిల్లారు. ముద్దుగా చూశారు. శ్యామా చిన్న పిల్లవాడిలాగా బుంగమూతి పెట్టి‘‘బాబా నేను మీకు సేవ చేస్తుంటే మీరు నన్ను ఎందుకు ఏడిపిస్తున్నారు ’’అన్నాడు.
‘‘72 జన్మల నుంచి నేను నిన్ను రక్షిస్తుంటే నన్ను ఎందుకు బాబా అన్ని వేళలా రక్షిస్తున్నారు అని అడగలేదు కాని ఈరోజు కాస్త బుగ్గ గిల్లగానే ఏడిపిస్తున్నానని అంటావా’’ అని కోపంగా చూశారు.
‘‘బాబా నేను ఊరికినే అన్నాను. నీవు కోపం తెచ్చుకోవద్దు. నన్ను నీవే కాపాడక ఇంక ఎవరు కాపాడుతారు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’’అని నేను నినే్న నా ఈశ్వరుడనుకొన్నాను. నీవే నాకు కృష్ణుడివి, శివుడివి, రామునివి, బాబా కూడా నీవే ’’అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు.
‘‘అయ్యో! శ్యామా నీవు బాధపడితే నేను చూడలేనుఅయ్యా! మీరంతా సంతోషంగా ఉంటేనే కదా నేను నిశ్చింతగా ఉండగలను’’అన్నారు.
ఓరోజు శ్యామా అతని స్నేహితుడు బాబా దగ్గరకు వస్తున్నారు. వారు లోపలికి రావడానికి మెట్లు ఎక్కుతుంటే బాబా బయటకే వచ్చారు.‘‘వీరిని చూడగానే ఏయే వెళ్లు ఇక్కడ నా మసీదులోనీకు చోటు లేదు. వెళ్తావా లేదా’’అని గట్టిగా అరిచారు. వెంటనే శ్యామా తో కూడా వచ్చినతను నిలబడిపోయారు. శ్యామా గబగబా బాబా
దగ్గరకు వచ్చాడు. ‘‘నిలువు నిలువు.. వెళ్లు ఇంక ఎక్కావో చూడు నీసంగతి’అని మళ్లీ అన్నారు బాబా.
శ్యామాకు ఏమీ అర్థం కాలేదు. వెంటనే బాబా దగ్గరదాకా వచ్చాడు.
‘‘బాబా అసలు ఏమైంది.ఎవరైనా బాధలల్లో ఉంటే ఈ మసీదులో అడుగుపెడితే చాలు వారి బాధలను నేను దూరం చేస్తాను అని చెప్పేవారుకదా మరి ఈరోజు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు’’ అన్నాడు.

-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743