భక్తి కథలు

మోక్షసాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీ ఆదిశంకరులు తమ వివేక చూడామణిలో ఆత్మ జ్ఞానమును గూర్చి చేసిన వివరణాత్మక సందేశంము అత్యంత అద్భుతము. అంతేకాదు అందరికీ ఆచరణీయ సులభం కూడా. మోక్షమన్నది యోగం వలనకాని, సాంఖ్యం లోన ఈశ్వర నిరీశ్వర యోగం వలన కాని లౌకిక పార లౌకిక విద్యవలన కాని సిద్ధించదు. దేహాత్మ భావన విడనాడి శుద్ధ చైతన్య బ్రహ్మమే ఆత్మయని అనుభవ పూర్వకంగా తెలిసి కొన్నవారికి మాత్రమే మోక్షము లభించగలదు.
ఇక మనము ఈ మాయా ప్రపంచంలో అనుభవించుచున్న కళలు భోగమునకు దారితీయును. కాని మోక్షమునకు గాదు. వైణిక విద్వాంసుడు తన నైపుణ్యముతో వీణానాదమును శ్రావ్యముగా సృష్టించి మనలను రంజింపచేయును. అటులనే వేణునాదము వలన మనదేహములు పులకించును తప్ప మోక్షమనేది ప్రాప్తించదు. పండిత ప్రకర్షుల ప్రవచనములు వారి వారి చాతుర్యమును ప్రదర్శించుచూ భోగ హేడతువగును తప్ప మోక్ష హేతువు కాజాలదు. ఇటుల వివిధ శబ్దజాల ఆవరణములు జీవుని మరింత మాయకు గురిచేయును తప్ప మోక్షమార్గము కాజాలదు.
కాబట్టి తత్త్వము తెలిసిన జగద్గురువును ఆశ్రయించి ప్రయత్నపూర్వకముగా ఆత్మ తత్త్వమును తెలిసికొన్న గాని మోక్షము లభించదని శ్రీ శంకరులు విశదీకరించిరి. ఔషధమును లోనికి తీసుకొనక ఔషధ నామము పలుమార్లు జపించిన రుగ్మత నివృత్తి అగునా?
సమస్త భూమండలమును జయించకుండా నేనే చక్రవర్తి నని నోటి మాత్రమున ప్రకటించుకొన్న, చక్రవర్తి అగునా? భూమిలో నున్న ఖనిజములను వెలికి తీసిన గాని అనుభవయోగ్యము కావు. గ్రంథాలయములో వేల గ్రంథములున్ననూ వానిని తెరిచి చదివిన గాని జ్ఞానము లభించదు.
అటులనే ఆత్మ సాక్షాత్కారమ కొరకు సాధకుడు తాపత్రయముల నండి తొలగి తదేక దీక్షతో గురువు సూచించిన విధముగా సమస్త శక్తినుపయోగించి స్వయముగా ప్రయత్నించిన గాని ఆత్మ తత్త్వము అవగతము కాదని శ్రీ ఆదిశంకరులు తెలియజేసినారు. కావున ఆత్మ తత్త్వమును బోధించిన అనేక మంది అవధూతల చరిత్రలను పరిశీలించి నిరంతర ఆత్మతత్త్వ ధ్యానము చేయుట ఒకటే మార్గము.
మోక్షమును భక్తి ద్వారా సంపాదించుకోవచ్చు. భక్తిమార్గములో భగవంతుడు తప్ప అన్యమేది కానరాదు. భక్తుడు కూడా భగవంతుని లోని అంశమే అనుకొంటాడు. కనుక తనది అని కాని, తాను చేస్తున్నానని కాని భక్తుడు తలచడు. అంతా ఈశ్వరమయం అనుకొంటాడు కనుక అతనికి దేహాత్మ భావన త్వరగా నశిస్తుంది. ఆత్మ తత్త్వాన్ని అనుకోకుండానే తెలుసుకొంటాడు. పుణ్యపాపము లు క్షయం చెంది భక్తుడు భగవంతునిలో లీనమవుతాడు. కనుక అతనికి మోక్షము చేకూరుతుంది. కాని జ్ఞానం ద్వారా మోక్షం సంపాదించడం జ్ఞానులకే సాధ్యం కాని సామాన్యులు, అజ్ఞానులకు సాధ్యం కాదు వారికి భక్తి మార్గమొక్కటే మార్గం.

- వారణాశి వెంకట సూర్య కామేశ్వర రావు 9491171327