భక్తి కథలు

సౌఖ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ లోకంలో ధర్మం కలకాలం నిలిచి వుండాలనీ, సత్యమార్గంలోనూ, న్యాయమార్గంలోనూ మానవులు జీవనయానం సాగించాలనీ ఎందరో మహానుభావులు తమవంతుగా శ్రమించి తరించారు. కలికాల మహిమా అన్నట్లుగా ఎక్కడ విన్నా, చూసినా బలవంతులైనవారు బలహీనులను దోచుకుంటున్నారనే అనిపిస్తుంది. కాసులున్నవాడికీ, కండబలం కలవాడికీ ఎదురులేకుండా పోతున్నది. వీటికి మూలకారణం మనిషికి తృప్తిలేకుండా పోవడమే. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే దురాశతో అన్యాయాలకూ అక్రమాలకూ పాల్పడుతున్నారు. ‘్ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణములు మానక హెచ్చున్’అన్న విధంగా, ఈ నవనాగరిక సమాజంలో ధనమదంతో విర్రవీగుతూ, అత్యాచారాలు జరిపేవారి సంఖ్య పెరిగిపోతూనే వుంది. అయితే అందరు ధనవంతులూ అలావుంటారని కాదు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్లుగా ఈ ప్రపంచంలో ఎందరో తమ సాటివారికోసం, అభాగ్యులకోసం ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతూనే వున్నారు. దీనావస్థలో జీవితాలు గడుపుతున్న ఎందరికో ఆశ్రయం కలిగిస్తూ, వారి ఆనందంలో పాలుపంచుకుంటున్నారు. సంపాదించడంతోపాటు, సాటి వారికి సాయంచేయడంలో ఆనందాన్ని పొందుతున్న వారెందరో వున్నారు. మనం హిందూధర్మంలో దానం, ధర్మం అంటూ వుంటాము. భూమీద మనం అనుభవించే నీరూ, గాలీ, భూమీ, ఆకాశమూ, అగ్నీ అన్నీ ఉచితంగా భగవంతుడు అందించాడు. కానీ మనిషి స్వార్థం పెచ్చుపెరగడంతో అంతా తనకే కావాలని కోరుకుంటూ అరాచకానికీ అన్యాయానికీ పాల్పడుతూ వున్నాడు. మనం నిత్యం లోపలికి పీల్చుకునే గాలిని అంతా వుంచుకోలేకపోతున్నాము.
ఆ విధంగానే నీటినీ, ఆహారాన్ని కూడాను. కొంత బయటకి విసర్జించాల్సిందేకదా. అదే విధంగా మనం ఈ సంఘంనుండి సంపాదించిన మొత్తంలో కొంతలోకొంతైనా తిరిగి సంఘంకోసం వినియోగించుకోవాలి. ఎంతటి క్రూరమృగమైనా తన కడుపునిండితే, ఎంతటి పంచభక్ష్యపరమాన్నమైనా సరే వదిలేసి వెళ్ళిపోతుంది. దాచుకోవడం, దోచుకోవడం మానవుడని పేరు పెట్టుకుని సంచరిస్తున్న ఈ మనుష్య జాతికే సొంతంగా మిగిలింది. ఇక ధర్మం అనగా, వున్నవాళ్ళు- పేద వారికి తమ శక్తికొలదీ చేసే ఆర్థిక లేదా వస్తుసహాయం అనే చెప్పాలి. ఈ విధంగాచేసే సహాయం ఇహలోక సౌఖ్యాలను అందిస్తుంది. మరోది దానం. ఈ దానం అనేది మనం ఇవ్వడమేకాదు, అవతలివారు ఇష్టపడి పుచ్చుకోవల్సి వుంటుంది. ధర్మం మనం ఎంతైనా చేయవచ్చును. ఏదైనా చేయవచ్చును. దానం విషయంలో శాస్త్రం కొన్ని యోగ్యమైన వాటిని ఉదహరించింది. వాటినే మనం దశదానాలు అంటూ వున్నాము. దూడతో కూడిన ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి, ధాన్యము, ఉప్పు, బెల్లము, వస్త్రాలు, వెండిలు ఆ పది దానాలు. గో దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడవుతాడు. సర్వలోకప్రాప్తిని కలిగిస్తాడు. భూదానంతో శంకరుడు సంప్రీతుడై శివలోకప్రాప్తి కలుగుతుంది. తిలదానంతో విష్ణులోకప్రాప్తి, సువర్ణదానంతో అగ్నిలోక ప్రాప్తి, నెయ్యి దానంతో ఇంద్రలోక ప్రాప్తి, వస్తద్రానంతో సర్వదేవతల అనుగ్రహమూ కలుగుతుంది. ధాన్యాన్ని దానంచేస్తే ఇహలోకమందు సకలసౌఖ్యాలూ లభిస్తాయి. దిక్పాలక లోకప్రాప్తి కలుగుతుంది. బెల్లం దానంచేస్తే అఖండ విజయం కలిగి, అనంత సంపదలు లభిస్తాయి. వెండి దానంచేస్తే సర్వసంపదలూ, వంశాభివృద్ధీ కలుగుతుంది. ఉప్పుదానం చేసినందువలన బలమూ, ఆనందము కలగడమేగాక, ఆయుర్దాయమూ కలుగుతుంది.
ధర్మం చేసేటప్పుడు మనం తీసుకునేవారికి ఉపకారం చేస్తున్నామనుకుని చేయొచ్చును. కానీ దానం విషయంలో అలా అనుకోరాదు. మనం దానం చేసే విషయంలో భక్తిశ్రద్ధలు కలిగివుండాలి. ఎవ్వరికో ఉపకారం చేస్తున్నామనుకుని పైన పేర్కొన్న దానాలు చేయరాదు.
దాన ధర్మాదులతోనే మన జన్మలు సార్ధకం అవుతాయి. ఆ సర్వేశ్వరుడు మనలను కరుణించి కాపాడగలడు.

- డా.పులిపర్తి కృష్ణమూర్తి 9949092761