యువ

ఐదు నిమిషాల్లో సెల్ ఫోన్ చార్జ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హువావీ బ్యాటరీ కా కమాల్!
జపాన్‌లో ఇటీవల బాటరీ సింపోజియం జరిగింది. ఇందులో ప్రఖ్యాత హువావీ కంపెనీ ప్రదర్శించిన కొత్త బాటరీ అందరినీ ఆకట్టుకుంది. ఈ బాటరీ సాయంతో ఓ సెల్‌ఫోన్‌ను ఐదు నిమిషాలు చార్జి చేస్తే, పది గంటలు ఏకధాటిగా మాట్లాడుకోవచ్చు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేసిన లిథియం అయాన్ బాటరీ సృష్టించిన అద్భుతం ఇది. దీనిని ఉపయోగించి, 600 ఎంఎహెచ్ (మిలీ యాంపియర్ అవర్) సామర్థ్యం గల ఓ చిన్న బాటరీని చార్జ్ చేసేందుకు రెండు నిమిషాలు, 3000 ఎంఎహెచ్ సామర్థ్యం గల శక్తిమంతమైన బాటరీని చార్జ్ చేసేందుకు ఐదు నిమిషాలు పట్టిందట. బాటరీ సింపోజియంలో వీక్షకులను ఆకట్టుకున్న ఈ సరికొత్త బాటరీ మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం హువావీ సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వాట్ లాబ్ ఇంజనీర్లు దీనికి తుది రూపు దిద్దే పనిలో ఉన్నారు.