భక్తి కథలు

మొల్ల.. మనస్తత్వవేత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూ వచ్చిన మనకు కొన్ని వందల రకాలైన రామాయణ కథనాలు కనిపిస్తాయి. సుమారుగా కొన్ని వేల రామాయణ కథలున్నాయ. ఒక్క సంస్కృతం లోనేకాక తెలుగు, హిందీ, మరాఠీ, వంగ, ఇటువంటి భాషల్లోనే కాదు విదేశాల్లో సైతం రామాయణ కథలున్నట్టు చరిత్ర చెబుతుంది. వీటినన్నింటిలోను కొద్దిగానో గొప్పగానో అవాల్మీకాంశాలు చోటుచేసుకొన్నాయ. ఒక్కో రచయతకు తోచినభావాలు లేక వారు రామాయణం ద్వారా సమాజానికి ఇవ్వాలను సందేశాలు ఇలా రకరకాలైన అంశాలు అవాల్మీకాలుగా రామాయణంలో చోటు చేసుకున్నాయ. అటువంటి రామాయణాల్లో మొల్లరామాయణం ఒక్కటి. మొల్ల రామాయణ కవయత్రి మొల్ల. నాకు పాండిత్యం అంతగా రాదు అంటూనే ఎన్నో అద్భుత విషయాలను హృదయాలను కదలించేవిధంగా రామాయణ రచన కావించింది. మొల్ల రామాయణం ప్రబంధ యుగంలో వచ్చిన కావ్యం. సరళంగా ఉన్నప్పటికీ పద్యరచనలో కవయిత్రి పాండిత్యం అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. వాల్మీకాన్ని అనుసరిస్తూనే చాలా అంశాలను తగ్గించి చెప్పింది మొల్ల. మంధర వృత్తాంతం, అహల్యకు శాపం వచ్చిన విషయాన్ని తెలిపే కథ, కబంధవధ, సుగ్రీవ రావణుల ద్వంద్వ యుద్ధం ఆదిత్య హృదయం ఇటువంటి కొన్ని ఘట్టాలు వదిలివేయడం జరిగింది.
మూలకథను సూటిగాచెప్తూ రసానుకూలమైన శైలితోనూ పాత్రోచితమైన సంభాషణలతోనూ సందర్భానికి తగిన వర్ణనలతోనూ లలితమైన భావాలతోనూ, చక్కని దేశీయ పదాలతోనూ పాఠకులకు ఆనందాన్ని కలిగించే కావ్యం మొల్లరామాయణం, సుకుమారమైన రచనా సంవిధానంతో అలరారే కావ్యం ఇది.రాముడు సీతం కోసం పడ్డ దుఃఖాన్ని నాలుగు సీసపద్యాలలో వర్ణించింది. కరుణ రస స్పోరకంగా చక్కని రచనాశిల్పంతో అలరారే ఈ పద్యాలు చిత్తవిభ్రమకు గురైన రాముని ప్రవర్తనను మనస్సుకు హత్తుకునేలా చేస్తాయి.
సీత కనిపించక దుఃఖంతో చిత్తవిభ్రమకు గురైన రాముడికి లేళ్ళను చూడగానే సీత కన్నులు గుర్తొచ్చేవి. కోకిల రవాలు వినిపించగానే ఆమె గొంతు సవ్వడి గుర్తుకొచ్చేది. చంద్రుని చూడగానే ఆమె ముఖకాంతి గుర్తుకొచ్చేది. తుమ్మెదను చూడగానే ఆమె కురులు గుర్తుకొచ్చేవి. చక్రవాకాలను చూడగానే ఆమె వక్షోజాలు గుర్తుకొచ్చేవి. హంసలను చూడగానే ఆమె నడకలు గుర్తుకొచ్చేవి. కర్పూరపు అరటి చెట్లను చూడగానే ఆమెమై తాపులు గుర్తొచ్చేవి. సంపంగి చెట్లను చూడగానే సంపంగి పువ్వువంటి ఆమె నాసిక గుర్తొచ్చేది. మొల్ల మొగ్గలను చూడగానే ఆమె దంతాలు జ్ఞాపకం వచ్చేవి. ఈ విధంగా ప్రకృతిలో ఎటు చూసినా అణువణువునా సీత జ్ఞాపకాలే రాముణ్ణి చుట్టుముట్టేవి.
ఇది ఒక గొప్ప మనస్థితి నిరూపణ- ఇక్కడ మొల్ల ఒక మనస్తత్వవేత్తగా ఈ వర్ణనను నిర్వహించింది. సీత కనిపించక రాముడు పడిన వేదనను వర్ణించే సందర్భం ఇందుకు ఉదాహరణగా గ్రహించవచ్చు. సీత కనిపించక పోవటంతో హతాశుడైనాడు రాముడు. అతడికి తాత్కాలికంగా చిత్తవిభ్రమ కలిగింది. కనిపించే ప్రతి వస్తువులోనూ సీతనే చూడసాగాడు. ఆమెతో అడవులలో తిరిగినప్పుడు అవి శృంగార వనాలుగా కనిపించేవి, ఇప్పుడు అడవులుగా కన్పిస్తున్న కఠినమైన శిలలు ఆమెతో గడిపిన కాలంలో పూసెజ్జలుగా కనిపించినవి ఇప్పుడు కఠిన శిలలుగా కనిపిస్తున్నై. ఇట్లాంటి స్వభావోక్తులతో వర్ణించే వస్తువును కన్నులకుకట్టేలా రూపచిత్రణ చేయటం, చక్కని నడకతో చదివే వారికి పఠనాసక్తి కలిగించే పద్యాలు రాయటం మొల్ల గొప్పతనం.

-ఉషశ్రీ తాల్క