భక్తి కథలు

ప్రజ్ఞావేదం-1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివేకానందుడు రామకృష్ణ పరమహంస వద్దకు వచ్చినపుడు, అతడు అతిగా తర్కించేవాడిగా, నాస్తికుడిగా, హేతువాదిగా ఉండేవాడు. ప్రతిదానికీ రుజువును కోరేవాడు. రుజువులు లేని విషయాలు కొన్ని ఉంటాయి.. దైవత్వం ఎల్లెడలా ఉంది. అయితే దైవత్వానికి ఏ రుజువూ లేదు. అది రుజువు కాదు.. సత్యదర్శనం. ప్రేమకు ఏ రుజువూ లేదు- అయినా అది వుంది. సౌందర్యం చూసే కళ్ళల్లో ఉంటుంది. దానికి ఏ రుజువులూ ఉండవు. మజ్నూ అన్నాడు- లైలాను తెలుసుకోలంటే మీరు మజ్నూ కళ్లతోనే చూడాలి అని- ఏందుకంటే లైలా ఓ నల్లటి సాధరణమైన అమ్మాయి. రామకృష్ణులతో వివేకానందుడు వాదిస్తున్నాడు. నాకు రుజువు కావాలి. కనుక భగవంతుడు ఉంటే నాకు నిరూపించి చూపండి! అపుడు రామకృష్ణులు వివేకానందుని ‘ఆరా’లోకి చూశారు. ఆ ఆరాలో వివేకానందుని గత జన్మలను చూశారు సూక్ష్మదృష్టితో. వివేకానందునిలో ఒక గొప్ప నిధి ఉంది. సత్యం యొక్క గొప్ప నిధి- అయితే ఆ నిధి అతని తర్కం క్రింద అణచివేయబడి వుంది. రామకృష్ణుల వద్దకు వచ్చినపుడు వట్టి నరేంద్రనాథుడే. అయితే నరేంద్రుడి లోపల నిధిని చూసి రామకృష్ణ పరమహంస అతడికి ‘వివేకానందుడు’ అని నామకరణం చేశారు. ‘గురుశ్రేష్ఠులలో’ ఉన్న గొప్పతనం అదే.. వారు బాహ్యంలో చూడరు, అంతరంగంలో చూస్తారు. ఈ యువకుడు అభివృద్ధికి రాదగినవాడు. గొప్ప శక్యతను కలిగివున్నవాడు.
‘అష్టావక్రుడు’ మహాజ్ఞాని. అతడు జన్మించకమునుపే, తల్లి గర్భంలో ఉన్నపుడే, తండ్రి ప్రతిరోజూ వేదాలు వల్లె వేస్తూంటే ఒక రోజు గర్భస్థ శిశువైన అష్టావక్రుడు ఇలా అన్నాడు తండ్రితో- నువ్వు వల్లె వేస్తున్న దానిలో ప్రజ్ఞ అనేది ఏమీ లేదు. కేవలం పదాలు వల్లె వేస్తున్నావు- అవి పదాల సంకలనం మాత్రమే. నీ అంతరంగంలోని ప్రజ్ఞను కనుగొని ప్రకటించు! అనుభవజ్ఞానాన్ని పొందు అన్నాడు.
అతని తండ్రి గొప్ప పండితుడు. సహజంగానే అతడికి కోపం వచ్చింది. ఇంకా జన్మించనైనా జన్మించని తన తనయుడు మొట్టమొదటిసారిగా తనను అధిక్షేపిస్తూ మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి ఆగ్రహంతో బ్రద్దలయ్యాడు. కోపాగ్నిలో ముంచివేయబడ్డాడు. అతడి అహం దెబ్బతింది! ఎరుక నశించింది! ఆ ఆగ్రహంలో అతడు కళ్ళున్న అంధుడయ్యాడు. పుట్టబోయే శిశువును ఘోరంగా శపించాడు.. నువ్వు ఎనిమిది వంకరలతో పుట్టుదువు కాక అని! ఎనిమిది చొట్టలతో జన్మించాడు. అందుకే అష్టావక్రుడు అన్నారు. ఆహా! ఎంత గొప్ప పండితుడికైనా క్రోధం మిన్నుముట్టినపుడు ఎరుక నశిస్తుంది. జాగరూకత కనుమరుగవుతుంది. జరుగవలసిన ఘోరం జరిగిపోతుంది! రామకృష్ణ పరమహంస వివేకానందుడి అంతరం చూసి ‘అష్టావక్రగీత’ అతడి చేతికిచ్చి ఇలా అన్నాడు. నువ్వు కాసేపు భగవంతుడి రుజువు గురించి మరచిపో! ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను కొంచెం వృద్ధుడినయ్యాను. నాకు చదవడం కష్టతరంగా ఉంది. నువ్వు యవ్వనదశలోకి వచ్చావు. నీ కళ్ళు బలంగా వున్నాయి. ఈ పుస్తకం- ఈ అష్టావక్ర గీతలో నుంచి కొంచెం చదువు.. నాకు వినిపించేలా గట్టిగా చదువు అన్నాడు.
వివేకానందుని తర్కం చూసి రామకృష్ణులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కరుణతో కూడిన వారి హృదయంలోంచి వెలువడిన మాటలకు వివేకానందుడు ఇక మారుమాట్లాడలేక నెమ్మదిగా అష్టావక్రగీత గట్టిగా చదవడం ప్రారంభించాడు. అంతే అతని దృష్టి అష్టావక్రగీతలో లీనమయింది.
వివేకానందుడు అందులోని మూడు నాలుగు సూత్రాలు చదివాడు. అందులో ఆ అష్టావక్ర గీతలోని ప్రతి కణమూ అతడికి కనిపించడం ప్రారంభించింది.అష్టావక్ర గీతలోని సూత్రాలు వివేకానందునిలో చొచ్చుకుపోయాయి. నిద్రిస్తున్న అతని ఆత్మను మేల్కొలిపాయి. బ్రహ్మానందంతో నింపాయి ఎవ్వరైనా ప్రజ్ఞను ఎలా సాధించుకోవాలి అని జనకుడు అడిగాడు అష్టావక్రుడిని! ప్రజ్ఞను ఎలా సిద్ధించుకోవాలి? మీకు ఎంత తెలిసి వున్నా, మీరు మరింత జ్ఞానాన్ని ప్రోగుచేసుకుంటూ వెళుతున్నా, పవిత్ర గ్రంథాలను కంఠస్థం చేసే చిలువల్లాగా మారినా ప్రతి సూత్రాన్నీ స్మృతిలో ఉంచుకున్నా ప్రజ్ఞ సిద్ధించదు. అదే గర్భంలో వున్నపుడే తన తండ్రికి చెప్పాడు అష్టావక్రుడు..
మిమ్మల్ని విముక్తం చేసేదే ప్రజ్ఞ- అదే సత్యం- ఆ సత్యమే మిమ్మల్ని విముక్తులను చేస్తుంది. జనకుడికి అష్టావక్రుడు బోధించింది ఇదే!
(ఇంకావుంది)

--మారం శివప్రసాద్ 9618306173, 8309912908