యువ

భలే అమ్మాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందలాలే కాదు అందని పర్వత శిఖరాలూ, హిమఖండాలూ అతివల లక్ష్యాలయ్యాయి. అందుకు భాగ్యనగర వనితలే స్ఫూర్తినందిస్తున్నారు. ఒకరిది ప్రపంచంలో అత్యున్నత శిఖరమైన ఎవరెస్ట్‌ను అధిరోహించాలన్న ఆశయమైతే..మరొకరిది తలుచుకుంటేనే వెన్నులో ఒణుకు పుట్టించే హిమఖండం అంటార్కిటికా వెళ్లాలన్నది. ఇప్పటికే జాహ్నవి ఎవరెస్టు దరిదాపుల్లోకి వెళ్లింది..పాతికేళ్ల మరో అమ్మాయి ఆరతీరావువారం క్రితమే హిమఖండ యాత్ర మొదలు పెట్టారు. ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రంగాలే కాదు సాహసాలూ తమకు కొత్త కాదంటూ దూసుకుపోతున్న ఈ ఇద్దరమ్మాయిల నేపథ్యం వేరైనా..సాహస లక్ష్యం మాత్రం ఒక్కటే..అతివలు ఎవరికీ తీసిపోరన్నది. మానవ సేవలోనూ, మానవీయ ఆశయాల సాధనలోనే మమేకమయ్యే ఎవరెస్ట్ అంతటి ఔన్నత్యం, అంటార్కిటికా అంతటి చల్లని మనసూ తమ సొంతమని నిరూపించడమే!

ఆశయం... ఎవరెస్ట్ అంత!

ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. మీరు ఎవరెస్ట్ పర్వతపాదం వద్దకు వెడితే అక్కడ మనకో హైదరాబాదీ అమ్మాయి ఎదురవుతుంది. బేస్ క్యాంప్‌వరకూ మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తుంది. వయసులో చిన్నదైనా, పర్వతాలు ఎక్కడంలో ఇప్పటికే ఎంతో అనుభవం సంపాదించిన ఆ చిన్నారి పేరు జాహ్నవి.
వయసు పద్నాలుగేళ్లే...కానీ ఏకంగా ఎవరెస్ట్‌పైనే కనే్నసింది జాహ్నవి శ్రీ పెరంబుదూరు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద రిస్క్ ఎందుకమ్మా అంటే నవ్వేస్తుంది. రిస్క్ లేకపోతే జీవితంలో థ్రిల్ ఏముంటుందని ఎదురు ప్రశ్న వేసే ఈ హైదరాబాద్ అమ్మాయి పర్వతాలు ఎక్కడంలో ఇప్పటికే ఎంతో అనుభవం సంపాదించేసింది. నమ్మకం కలగడం లేదా? అయితే ఇదిగో జాహ్నవి ట్రాక్ రికార్డ్...కిలిమంజారో (19,341 అడుగులు), ఎల్‌బ్రస్ (18,510), కోషియుస్‌జ్కో (7,310) ఈ మూడు పర్వతాలనీ ఇప్పటికే అధిరోహించింది జాహ్నవి. ఏప్రిల్‌లో ఎవరెస్ట్ ఎక్కేందుకు సన్నద్ధమవుతోంది. అంతేకాదు, జాహ్నవి ఇటీవలే మరో రికార్డునూ బద్దలు కొట్టింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద గైడ్‌గా ఎంపికైన జాహ్నవి, భారతదేశంనుంచి ఇలా గైడ్‌గా ఎంపికైన పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. పదేళ్ల అమ్మాయిని, ఆమె తల్లిని క్షేమంగా బేస్ క్యాంప్‌కు చేర్చడం ద్వారా ఈ రికార్డును కొట్టేసిందామె. నేలమట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉండే ఎవరెస్ట్ బేస్ వద్ద గైడ్‌గా పనిచేయడమంటే మాటలు కాదు, ఓర్పుతోపాటు నేర్పు కూడా ఉండితీరాలి. దీనికోసం జాహ్నవి రాయల్ నేపాల్ హాలీడేస్ సంస్థలో శిక్షణ పొందింది. అక్కడ పనిచేసే చీఫ్ ట్రైనర్ కాజీ షేర్పా ఆధ్వర్యంలో తాను ఎంతో నేర్చుకున్నానని, ఆయన శిక్షణలోనే వౌంట్ కంగ్రి ఎక్కగలిగానని జాహ్నవి చెప్పింది. ‘ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద గైడ్‌గా పనిచేయడం కత్తిమీద సాము. ఈ వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. క్లయింట్‌నుంచి క్లయింట్‌కు, ట్రిప్ నుంచి ట్రిప్‌కూ కొత్త సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ట్రెక్కింగ్‌లో అనుభవం ఉన్న టూరిస్టులయితే వాతావరణ పరిస్థితులను అర్ధం చేసుకోగలుగుతారు. కొత్తవారైతే అన్నీ మనమే దగ్గరుండి చూసుకోవలసి వస్తుంది. వారు ఓ తప్పటడుగు వేసినా ఫలితం దారుణంగా ఉంటుంది. కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది’ అంటూ వివరించింది జాహ్నవి. అడ్వంచర్ ట్రిప్ అంటే థ్రిల్లింగ్‌గా ఉంటుందని చాలామంది అనుకుంటారు కానీ థ్రిల్ కంటే రిస్క్ ఎక్కువనేది గ్రహించరు అంటూ ట్రెక్కర్ల మనస్తత్వాలను వివరించింది జాహ్నవి.ప్రస్తుతం ఎవరెస్ట్ ఎక్కేందుకు తీవ్రంగా పరిశ్రమిస్తున్న జాహ్నవి, రాబోయే సీజన్‌లో కైలా స్ మానస సరోవర్‌కు వెళ్లే యాత్రికులకు కూడా శిక్షకురాలిగా వ్యవహరించనుంది. చిన్న వయసులోనే ఎన్నో శిఖరాలను అధిరోహించిన జాహ్నవికి ‘యువ’ బెస్ట్ఫా లక్ చెబుతోంది. (చిత్రం) 14 ఏళ్లకే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ గైడ్‌గా ఎంపికైన హైదరాబాదీ అమ్మాయి జాహ్నవి
*
మనో ధైర్యం.. అంటార్కిటికా అంత!
హిమఖండం అంటార్కిటాను చేరుకోవాలనుకున్న హైదరాబాద్ అమ్మాయి ఆరతీరావుకు మొదటి నుంచి సాహసాలంటే మక్కువ. ఆర్మీస్కూల్లో చదువుకున్న ఆరతీరావుకు భిన్నంగా ఉండటమే కాదు అతివకు ఏదీ అసాధ్యం కాదని నిరూపించాలన్న పట్టుదల. ఇటీవలే జాగృతి యాత్రలో పాల్గొని కొలంబియా, ఈక్వెడార్‌కు వెళ్లి పర్యటనల ప్రాధ్యాన్యతపై పాఠాలు చెప్పింది. హిమ ఖండంలో ఉండేందుకు శారీరకంగా, మానసికంగా ఎలా సన్నద్ధం కావలన్నదానిపై ఇటీవల ఆరతీరావు శిక్షణ కూడా పొందారు. ఆమె చేపట్టిన ఈ సాహస యాత్ర లక్ష్యం అతివల మనోధైర్యాన్ని చాటిచెప్పడమే కాదు, ధైర్యాన్ని చాటిచెప్పడమొక్కటే కాదు..్భమీద సమస్త జీవజాతుల మనుగడను ప్రశ్నార్థం చేస్తున్న వాతావరణ మార్పులను అధ్యయనం చేయడం, స్థానిక ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ అవసరంపై చైతన్యాన్ని కలిగించడమే.