రివ్యూ

కాఫీ డే! కామెడీ డే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** భలే మంచి రోజు (ఫర్వాలేదు)

తారాగణం:
సుధీర్‌బాబు, వామిక గబ్బి, వేణు, ప్రవీణ్, శ్రీరామ్, విద్యుల్లేఖ, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: సన్నీ ఎం.ఆర్.
నిర్మాత:
విజయ్ -శశి
దర్శకత్వం:
శ్రీరామ్ ఆదిత్య

ఉపోద్ఘాతం లేకండా -సీన్‌లోకి వెళ్దాం.
‘ఈ రోజు రాశిఫలాల్లో పసుపు అచ్చొస్తుంది’ అని ఓ సందర్భంలో వేణు అంటాడు. ఉన్నపళంగా సీన్ మారిపోతుంది. పసుపు రంగుతో స్క్రీన్‌పై వస్తువులన్నీ తళతళ మెరుస్తూంటాయి. కలిసి రావటం మాటేమోగానీ -ఆ ఎల్లో కలర్‌వల్లే కథానాయకుడు అడ్డంగా దొరికిపోతాడు. చూట్టానికి సన్నివేశం చిన్నదిగానే కనిపించినా.. దర్శకుడి స్టైల్‌ని ఎలివేట్ చేస్తూ కథలోకి వెళ్లటానికి దోహదం చేసిందీ సీన్.
మళ్లీ ఉపోద్ఘాతంలోకి.. ఈ ఒక్క సీన్‌తో కథని తేల్చి పారేయ్యొచ్చు. ఏదో కొత్తదనం చూపించబోతున్నాడన్న తలంపు సీట్‌లో కూర్చోనివ్వదు. అచ్చంగా ‘మాయాబజార్’ సినిమాలో -చిన్నికృష్ణుడి భరతం పట్టడానికి భామలంతా కూడటం చూసి -శశిరేఖ కళ్లల్లో మెదిలిన ఆనందం లాంటిది కాకపోయినా.. ఇంకొద్దిగా తక్కువ. ఏమైతేనేం? ఈ తెలుగు సినిమాలకి ఏమైంది? ఒకవైపు ‘మంచు’ ఇంకోవైపు ‘సౌఖ్యం’ అనుకోకుండా -ఒకానొక మంచి రోజు ‘మంచి’ సినిమా చూస్తున్నామన్న భావనకు మినిమమ్ గ్యారంటీ వేసేసుకోవచ్చు. క్రైం కామెడీ థ్రిల్లర్స్ ప్రేక్షకులకు కొత్త కానప్పటికీ.. చెప్పే రీతిలో చెప్తే ఎవరూ ఇంట్రెస్ట్ పెట్టకండా ఉండరు. దీనికి ఈ సినిమానే ఉదాహరణ.
మళ్లీ కథలోకి -రామ్ (సుధీర్‌బాబు) ఓ అమ్మాయి.. అదే మాయ (్ధన్య బాలకృష్ణ)ని గాఢంగా ప్రేమిస్తాడు. ప్రేమ ఉంటే సరిపోదు. జీవించటానికి పైకం కావాలంటూ నిఖార్సైన రామ్ ప్రేమని కాదని సూరజ్ (చైతన్య కృష్ణ) అనే డబ్బున్న వాణ్ణి పెళ్లి చేసుకోటానికి సిద్ధపడుతుంది మాయ. డబ్బు లేదని ఘాటు ప్రేమనే తిరస్కరిస్తూ.. దీన్ని ఎలాగైనా కొట్టి కసి తీర్చుకోవాలని తీర్మానించుకున్న రామ్ తన తండ్రి (పరుచూరి గోపాలకృష్ణ) గ్యారేజీలోంచి కారు తీసుకొని స్నేహితుడితో పెళ్లి అనే సంఘటనా స్థలానికి బయల్దేరతాడు. కాలం కలిసిరాక -కొట్టే ఛాన్స్ కొద్దిలో మిస్సై.. శక్తి (సాయికుమార్) కారుని గుద్దేస్తాడు రామ్. ఈ గందరగోళంలో శక్తి కారులో ఉన్న సీత (వామిక) తప్పించుకుంటుంది. దానికి కారణం నువ్వేనంటూ.. సీతని వెతికి పట్టుకురాకపోతే ఫ్రెండ్ ప్రాణం గాల్లో కలిపేస్తానంటాడు శక్తి. సీత బ్యాక్‌గ్రౌండ్‌లో పెళ్లికొడుకు పీటలమీంచి జంప్ అవటం.. ఆమెని శక్తి కిడ్నాప్ చేయటం -వెరసి దార్లో రామ్ సీన్‌లోకి రావటం -ఇదీ జరిగింది. మాయని కొడదామని వెళ్తూంటే మధ్యలో ఈ రసాభాస ఏమిటో అర్థంకాక -ఫ్రెండ్ కోసం సీత అనే్వషణకి బయల్దేరతాడు రామ్ -మరో ఇద్దరు కిడ్నాపర్లతో బేరం కుదుర్చుకొని. ఎట్టకేలకు సీత దొరుకుతుంది. కానీ మళ్లీ మూడోసారి మిస్సవుతుంది. మళ్లీ మళ్లీ ఈ కిడ్నాప్ ప్రహసనాల వెనుక కథేమిటన్నది క్లైమాక్స్.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకి కథపట్ల ‘మంచి’ క్లారిటీ ఉంది. పాత్రల పట్ల అవగాహన ఉంది. వాటికి తగ్గ మేనరిజంని అందించటంలోనూ.. దాంట్లోంచి చక్కటి కామెడీని సృష్టించటంలోనూ సాధ్యమైనంతగా కష్టపడ్డాడు. అదే ‘మంచి’ ఫలితాన్నిచ్చింది. సినిమా టైటిల్స్ మొదలుకొని క్లైమాక్స్ -శుభం కార్డు వరకూ ప్రేక్షకులకు ‘మంచి’ సినిమా చూశామన్న తృప్తిని మిగిల్చింది.
కాకపోతే- సెకండ్ హాఫ్ కొద్దిగా నీరసించింది. ఐతే -క్లైమాక్స్‌లో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టు పృథ్వీ కామెడీతో కథని చివరాఖరి వరకూ లాక్కొచ్చాడు. కొద్దిలో ఛావబోతున్న కథని బతికించింది కూడా ఈ క్యారెక్టరే. స్క్రీన్‌ప్లేని నడిపించటంలోనూ.. పాత్రల్ని చక్కగా టాకిల్ చేయటంలోనూ దర్శకుడు శ్రద్ధపెట్టాడు.
వెరైటీ అండ్ డిఫరెంట్ రోల్స్ అంటే ఇష్టపడే సుధీర్‌బాబు ఈసారి ప్రేమలో ఓడిపోయిన అభాగ్యుడిగా మంచి రోల్ ప్లే చేశాడు. డైలాగ్ మాడ్యులేషన్ కొద్దిగా మార్చుకొంటే బావుంటుంది. నటనాపరంగా మంచి మార్కులే పడ్డాయి. పంజాబీ భామ వామిక గబ్బి చూట్టానికి ఫర్వాలేదు. నోటికున్న ప్లాస్టర్ విప్పితే చాలు -మొదలెట్టే తిట్ల పంచాంగంతో కడుపుబ్బ నవ్వించింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ని చూపటం అంటే చెప్పినంత ఈజీ కాదు. ఎక్కడ తప్పటడుగు వేసినా.. మొత్తం కథకే ఎసరు పడుతుంది. ఆ విషయంలో శ్రీరామ్ ఆదిత్య చక్కటి అడుగులే వేశాడు. దర్శకుడిగా అతడికిదొక ప్లస్ పాయింట్. ఇటీవలి సినిమాల్లో కామెడీ ట్రాక్ అంటూ బలవంతంగా జొప్పించకండా.. సిట్యుయేషనల్ కామెడీపై ఆధారపడ్డాడు దర్శకుడు. అదీ ప్లస్ పాయింటే. ‘పసుపు రంగు అచ్చొస్తుందన్న’ సీన్‌తో నవ్వుల మొలకలు పుట్టించి.. క్లైమాక్స్ వరకూ ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వుని అలానే పూయించాడు.
సాయికుమార్ విలన్‌గా వెరైటీ రోల్ వేశాడు. పాస్టర్‌గా పోసాని ఫర్వాలేదు. అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగులు దొర్లాయి. కథకి అంతగా అవసరం లేనివే ఇవి.
ఇన్ని ప్లస్ పాయింట్ల మధ్య -దర్శకుడు ఒక్క తప్పటడుగు వేశాడు. పాటలు -సందర్భోచితంగా కాకండా ఇష్టానుసారంగా వచ్చి వెళ్లిపోతుంటాయి. వాటికంటూ టైం లేదు. కథ సీరియస్ కామెడీతో నడుస్తూంటే -అప్పుడప్పుడు పాటలతో ప్రేక్షకుల్ని అలరించాలన్న పడికట్టు సూత్రాన్ని దర్శకుడు ఎందుకు పెట్టుకున్నాడో అర్థంకాదు. ఒకరకంగా ఇవే ‘్ఫ్ల’ని దెబ్బతీశాయి. మిగతా అన్ని శాఖలు తమతమ పరిధిలో ‘మంచి’ పనితనం చూపాయి.

-ప్రనీల్