భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరిమెల నాగభూషణ రెడ్డి, నెల్లూరు
ప్ర: చెన్నై నగరంలో వరద విలయానికి జ్యోతిషం ప్రభావం కూడా కారణమా?
సమా: అక్షరమూ, నక్షత్రమూ (్ధ్వని, కాంతి) సంబంధమే జ్యోతిష ప్రభావం అని చెన్నై రుజువు చేస్తోంది. అశ్వినీ, మేషరాశికి అష్టమ శని (వృశ్చిక) దోషము, తమిళనాడు (త- స్వాతి, తులారాశి) ద్వితీయ స్థాన ఏలిననాటి శని దోషము.. ఇవి పరోక్ష కారణాలు. ఇక ప్రత్యక్ష కారణాలను పరిశీలిస్తే వాస్తురీత్యా నగరానికి ఆగ్నేయ దక్షిణ భాగాలలో అనంత జలరాశి సముద్రం. నగరం కూడా సముద్ర మట్టానికి అతి తక్కువ ఎత్తులో వుంది. బొంబాయికి పశ్చిమం కూడా దోషం. పశ్చిమాన సముద్రం ఉండడంతో సోమనాథ దేవాలయానికి ముష్కర బాధ సంభవించింది. ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ఇక మానవ తప్పిదాలు మూడవ కారణం. ముందుచూపులేని నగరీకరణ, అసలా మాటకొస్తే వృశ్చికంలో శని ప్రవేశమే ప్రపంచానికి పీడల కారణమని లోగడనే పంచాంగకర్తలూ హెచ్చరించారు. ఇదే కాలంలో నేను చెబుతున్నదీ ఇదే.
ఎస్.నూర్జహాన్, కర్నూలు
ప్ర: భర్త ఆరోగ్యం గురించి..
సమా: ‘దవా కే సాత్ సాత్ దువాహోనా చాహిమే’ అనేది ఉర్దూ సామెత. మీ సంప్రదాయం ప్రకారం ‘దువా’ చదివి చేపలకు ఆహారం, పావురాలకు దాణా పెట్టండి. మీ భర్త ఆరోగ్యం కుదుట పడుతుంది.
జి.హారిక, నెల్లూరు
ప్ర: విద్య, ఉద్యోగం, వివాహం ఎలా ఉంటాయి?
సమా: వాస్తవికంగా అన్నీ వరసపెట్టి ఒకేసారి ఎప్పుడూ జరగవు. ముందుగా విద్య మీద ఏకాగ్రత చూపండి. మీ జన్మ తేదీ రీత్యా మీలో ఏకాగ్రతా లోపం కనిపిస్తోంది.
వై.సుమలత, మల్లాపూర్ (కరీంనగర్)
ప్ర: సంతాన యోగం?
సమా: వేములవాడలోని రాజ రాజేశ్వర స్వామిని దర్శించి కోడెను తిప్పండి. మూడు రోజులు అక్కడే నిద్ర చేయండి. ఏదైనా శివాలయంలో నాగప్రతిష్ఠ చేస్తామని మొక్కండి.
జి.రమణయ్య, బసంత్‌నగర్ (కరీంనగర్)
ప్ర: ఇద్దరు పిల్లలకూ అనారోగ్యం..
సమా: మీ పిల్లల జాతకాలు పరిశీలించనిదే ఏదీ చెప్పటం సాధ్యం కాదు.
శ్రీనివాస్.సి.ఆర్, విజయవాడ
ప్ర: నాకు ఇంక్రిమెంటు ఇమ్మని న్యాయస్థానం ఆదేశించినా ఆఫీసు వాళ్ళు ఇవ్వటం లేదు. కాగా, మీరు హెచ్చరించిన విధంగానే అనారోగ్యమూ మొదలయింది. కర్తవ్యం, సలహా చెప్పండి.
సమా: కోర్టు కేసు విషయమై మీ ప్లీడరుగారి అభిప్రాయం తెలుసుకోండి. కోర్టు చెప్పినా ఆఫీసువారు వినటం లేదంటే అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో ‘హోమియో’ వైద్యం త్వరగా పనిచేస్తుందని నమ్మకం. మీ శరీర తత్వాన్ని బట్టి వైద్య సలహాలను పాటించండి.
టి.బుచ్చిబాబు, దెందులూరు (ప.గో.)
ప్ర: నా తల్లిదండ్రుల నిర్ణయం ఫలితంగా అందరిలో అవమానం పాలవుతున్నాను. నా నిర్ణయాలకు వారు విలువ ఇవ్వటం లేదు.
సమా: మీ సమర్థత మీద వారికి విశ్వాసం కలిగేలా వుండండి. పెద్దలమాట చద్దిమూట అన్నది మంచి సామెత. వారి అనుభవాన్ని మీరు తక్కువగా అంచనా వేస్తున్నట్టున్నారు. అందుకే బాధపడుతున్నారు. ఇతరుల మాటలను లెక్కచేయకండి.
దోర్నాదు సుబ్బయ్య, ఆత్మకూరు (నెల్లూరు)
ప్ర: మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? ఇల్లు కట్టాలనుకుంటున్నాము. ఎలా ఉంటుంది?
సమా: ప్రస్తుత కాలం గోచారం బాగానే వుంది. ఇల్లు కట్టాలనే ఆలోచన శుభసూచకం.
కె.ఎస్.పవన్‌కుమార్, విజయవాడ
ప్ర: అనేక కోరికలు.. అవి తీరేది ఎలా..?
సమా: ఒకేసారి అన్ని కోరికలు కోరటం ‘మనో విక్షేపం’ అంటారు. ముందుగా మీ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ చూపండి.
మువ్వల బసవ పున్నయ్య, చెరుకుపల్లి
ప్ర: అమావాస్య నాడు ఎవరిని పూజించాలి?
సమా: ‘దర్శే పితరః’ అని శాస్తవ్రాక్యం. దర్శ అంటే అమావాస్య. గతించిన పెద్దలను స్మరించి, వారిని మనసారా పూజించటం మంచిది. ఈ పనుల కోసం డబ్బును ఇతరుల చేతికి ఇవ్వరాదు.
బి.సంజీవరావు, శ్రీకాకుళం
ప్ర: కుమారుని అనాలోచిత నిర్ణయాల వల్ల ధననష్టం జరిగింది. ఏం చేయాలి?
సమా: మీ కుమారుడి విషయంలో ముందుగానే జాగ్రత్తపడవలసినది. ఇప్పటికైనా ఆచితూచి వ్యవహరిస్తూ డబ్బు పొదుపు చేయండి. నష్టం తీరుతుంది.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు,
శ్రద్ధాబాద్ (సైదాబాద్), హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ