భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.రవి, విజయవాడ (కృష్ణా)
ప్ర: ఒక సమస్యకు చెప్పిన పరిష్కారం- అదే సమస్య వచ్చిన మరొకరికి పనిచేస్తుందా చెప్పండి!
సమా: మనం చేసే కర్మల్లో అదృఢ - దృఢ - సుదృఢ అనే నాలుగు రకాలు వాటివాటి తీవ్రతను బట్టి ఉంటాయి. ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. అదృఢ అంటే కొంచెం తీవ్రత ఉన్నవి తొందరగా ఫలిస్తాయి. ‘సుదృఢ’ అంటే అతి తీవ్రతతో ఉండేవి ఆలస్యంగా ఫలిస్తాయి. ఏదైనా ఒకరికి పనికివచ్చే మందు మరొకరికి పనికి రాకపోవచ్చు కదా!
వై.రాజు, మద్నూరు, కామారెడ్డి (తెలంగాణ)
ప్ర: అయ్యా! నాకు ఈమధ్య ఏదో భయం భయంగా ఉంటోంది. వృత్తి టైలర్ వృత్తి- కారణం చెప్పండి?
సమా: ప్రాపర్టీ సంబంధంగా కాని- నగదు డబ్బుకు సంబంధించి కాని ఏదో కలహం - జగడం వస్తందని భయపడుతున్నారు. వృత్తిలో పోటీదార్లు ఎక్కువ ఉన్నారేమో ఆలోచించండి. ప్రతి శనివారం ఆంజనేయస్వామికి ప్రదక్షిణాలు (54) చేసి అరటిపండ్లు, తేనె నివేదన చేయండి. చీమలకు బియ్యపు పిండి వేయండి.
ఎం.వెంకటేశ్వర్లు, చెంచుపేట- గుంటూరు
ప్ర: గురువుగారూ! నాకు ఇద్దరు కుమారులు- క్షౌరవృత్తి- ఇద్దరికీ షాపులు పెట్టించాను. నన్ను కులవృత్తినే చేయమంటారా? వేరే వ్యాపారం చేయమంటారా?
సమా: ‘కులవృత్తికి సాటిలేదు గువ్వలచెన్నా’ అని పెద్దలు చెప్పిన మాట- అదే చేయండి!
అచ్చుకోలు శ్రీనివాసరావు, గద్దలగుంట (ఒంగోలు)
ప్ర: 50 సంవత్సరాల వయసు- వివాహం చేసుకోలేదు. ఇంతవరకూ ఏ విధంగానూ స్థిరపడలేదు. జీవితం వ్యర్థం అనిపిస్తోంది. కర్తవ్యం చెప్పండి?
సమా: ఏ వయసులో ఏది చేయాలో అది చేయకపోతే కాలం కాటేస్తుంది. స్వయంకృతమైన పొరపాట్లు చేసి అమూల్యమైన జీవితం వ్యర్థం అనుకోకండి- ఇప్పటికైనా ఏదైనా సమాజ సేవకు కాని దైవసేవకు కాని అంకితం కండి.
సి.సత్యవాణి, రామభద్రపురం (విజయనగరం)
ప్ర: నాకు లేదా మాకు స్వగృహం స్వంతంగా కలుగునా? ప్రభుత్వం ద్వారా లభించునా, చెప్పండి?
సమా: ప్రభుత్వ సహాయంతో (ద్వారా కాదు) రెండు ఇళ్ళు ఉండే అవకాశం ఉంది.
ఎమ్.ఎస్.మూర్తి, కాకినాడ (తూ.గో.)
ప్ర: నా వయసు 85 సంవత్సరాలు. నాకు ఆస్తిలో వాటా ఇవ్వటంలేదు.
సమా: వయస్సు చాలా పెద్దది- ఈ వయసులో వాటా కోసం ప్రయత్నించటమేమిటి? మీరే వాటాలు చేయగలిగి వుండాలి. ఏదైనా ఈ వయస్సులో ఆత్మీయులతో తగాదా పడకండి! ఇది నా సలహా!
శ్రీనివాస్‌రావు, బెంగుళూరు (కర్నాటక)
ప్ర: ప్రముఖ ఫార్మా కంపెనీలో పార్ట్‌నర్‌షిప్ తీసుకోవాలనుకుంటున్నాను- లాభిస్తుందా?
సమా: మీది వ్యాపారమూ- స్పెక్యులేషన్ - షేర్ మార్కెట్ వంటి వాటికి సంబంధించిన ప్రశ్న- ఆ రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
అబ్బూరి సత్యకామేశ్వరి, విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర: నాకు రెండు సార్లు ఆక్సిడెంట్ అయి షుగర్ కారణంగా కొంతభాగం తీసేశారు. రాడ్ వేశారు. కోలుకోగలనా?
సమా: మీ జాతకంలో శని - కుజ- రాహు దోషాలు ఉన్నట్టున్నాయి. తగు విధమైన దైవసేవ దుర్గా- వినాయక సంబంధంగా చేయించండి- శుభం భవతు
కోలా కాశయ్య, కూకట్‌పల్లి, హైదరాబాద్
ప్ర: ఆరోగ్యం ఎలా ఉంటుంది?
సమా: నడుము భాగం - మోకాళ్లు సమస్యాత్మకం- గాయాలనుండి జాగ్రత్తగా ఉండండి.
అలిగిరి శ్రీజ, శ్రీకాకుళం (ఆంధ్ర)
ప్ర: నాకు మెడికల్ సీటు రాగలదా? ఏ భాగం నాకు యోగిస్తుంది?
సమా: డాక్టరు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సర్జరీ సంబంధంగా.
మహ్మద్ జానీ పటేల్- భైంసా (తెలంగాణ)
ప్ర: ‘ట్రిపుల్ తలాఖ్’ మతానికి సంబంధించినదేనా?
సమా: అది నాకంటే మీరే బాగా చెప్పగలరు. నా అభిప్రాయం ప్రకారం ఏ మతంలోనైనా మాతృమూర్తియైన స్ర్తికి కనీస న్యాయం ఇవ్వకపోవటం మంచిది కాదు.
ఎ.మంజునాధ్ గౌడ్ - అనంతపురం - (ఆంధ్ర)
ప్ర: నాకు ప్రభుత్వోద్యోగం వచ్చునా?
సమా: ప్రభుత్వంతో సంబంధంగల ప్రైవేటు సంస్థలో ఆగ్నేయ దిశలో బహుశా తమిళనాడులో అవకాశం ఉంది.
తోడపల్లి భరత్‌కుమార్, గద్దలగుంట, ప్రకాశం
ప్ర: మూడు సంవత్సరాల క్రితం స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ మా ఆవిడ చనిపోయింది. ఆ ఉద్యోగం నాకు రాగలదా?
సమా: విద్యార్హతలు- వయస్సు- మరెవ్వరూ హక్కుగల పోటీదారులు- వీటిని బట్టి ‘కంపాష్‌నేట్ గ్రౌండ్స్’లో వచ్చే అవకాశం ఉంటుంది.
బి.్ఫతిమా, విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర: మా అబ్బాయికి వివాహం?
సమా: సంఖ్య మీ అబ్బాయి చేత చెప్పిస్తే చెప్పగలను- సంఖ్య మీరు చెప్పకూడదు.
రజనీ బెన్ పటేల్, సౌత్ ఢిల్లీ, ఢిల్లీ
ప్ర: గురూజీ! నేను తెలుగు అమ్మాయినే. గుజరాతీ అబ్బాయిని పెళ్లాడాను. ఒకసారి ఆంధ్రభూమిలో భవిష్యకాలంలో మన రాష్టప్రతి పేరు ఆర్, కె గలవారు వస్తారని వ్రాశారు. అది నిజమైంది. అప్పటినుండీ మీ కాలమ్ అప్పుడప్పుడు తెలుగు దినపత్రిక దొరికినప్పుడు ఆదివారం తప్పక చదువుతాను. ఇప్పుడు నేనడిగే ప్రశ్న వ్యక్తిగతం కాదు. దేశం గురించి. మన దేశం అద్భుతంగా మారాలాంటే ఏం చేయాలి?
సమా: దేశం పట్ల మీకున్న శ్రద్ధకు హృదయపూర్వకమైన అభినందనలు. దేశ భవిష్యత్తును ఆలోచించేముందు గత చరిత్రను తెలుసుకోవాలి.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ