భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జె.ప్రశాంతి - భీమవరం, ఆంధ్రప్రదేశ్
ప్ర: నా భర్త ఆస్తిపైన దాయాదులు - ముగ్గురు అక్కచెల్లెళ్ళు కోర్టులో కేసు వేశారు. మేము గెలువగలమా?
సమా: మీ ప్రశ్న చట్టానికీ న్యాయానికీ సంబంధించినది. ఆస్తి - మీ భర్త పూర్తి స్వార్జితమైతే మిగతా వారికేమి హక్కు ఉండదు - ఆయన వ్రాసిన వీలునామా ప్రకారం చెందుతుంది. ఆశు వంశికమూ - సైత్వకమూ - అయితే మీ భర్త కేవలం భాగస్వాముగానే చెప్పుకోవాలి కాని యజమానిగా కాదు - మిగతా వారికీ హక్కు ఉంటుంది.

జి. మల్లిఖార్జునుడు - నరసారావుపేట, గుంటూరు
ప్ర: నేను స్కూల్ అసిస్టెంటుగా పనిచేస్తున్నాను - 2020లోపు నాకు పదోన్నతి కలుగగలదా?
సమా: మీకు ఉద్యోగంలో ఉన్నతి చాలా ఆలస్యంగా లభించే అవకాశం ఉంది. మీరు ఊహించినంత - ఆశించినంత సమయంలో రాదు.

కోగంటి ప్రసాద్ - కొత్తపేట, హైదరాబాద్
ప్ర: నెల రోజుల నుండి చాలా రకాలైన అనారోగ్యాలు బాధిస్తున్నాయి. పరిష్కారం చెప్పండి?
సమా: మీకు ముఖ్యంగా నరాల సంబంధమైన అనారోగ్యం నడుము, మోకాళ్ళు, ప్రయాణమూలకంగా కలిగిన శ్రమ కారణంగా కనిపిస్తున్నాయి. తగు వైద్య చికిత్స, విశ్రాంతి అవసరం.

కొలిపాక శ్రీనివాస్ - బెల్లంపల్లి, తెలంగాణ
ప్ర: గురువుగారూ! మీ భవిష్యకాలం తప్పక చదువుతూ ఉంటాను. మీ మాటకు తిరుగులేదని నా పూర్తి నమ్మకం. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే నాకు అపరిమితమైన అభిమానం. నేను టిఆర్‌ఎస్ నేతను. కేసీఆర్ రెండవసారి కూడా ముఖ్యమంత్రి కావాలని నా ప్రగాఢ కోరిక. అట్లా ఆయన రెండవసారిగా ముఖ్యమంత్రి అవుతారా? ఒకవేళ ఆటంకాలేమైనా ఉంటే వాటి నివారణకు ఏఏ పూజలు చేయించాలి? చెప్పండి. మీ మాట ప్రకారం చేయిస్తాను. ఆయన పుట్టిన తేది ఇస్తున్నాను. దయచేసి చెప్పండి. రాజకీయ ప్రశ్న అని దాటవేయవద్దని ప్రార్థన.
సమా: మీ కోరిక చాలా అభినందనీయం. ఊహించని పరిస్థితులేమైనా ఏర్పడితే తప్ప, ఆయనే రెండవసారి ముఖ్యమంత్రి అవుతారు. అందులో సందేహం లేదు. మీరు దైవ సేవగా చేయించ గలిగితే విష్ణుసహస్రనామ సంపుటితో చండీ సప్తశత పారాయణాలు చేయించండి. తగురీతిగా అన్నదాన, హోమాలూ, మంచి పండితులతో చేయించండి. శుభం భవతు

పవన్‌కుమార్ - నల్లచెరువు, తూర్పుగోదావరి
ప్ర: గురువుగారూ! నమస్కారం! నా జాతకంలోని లోపమేమిటోకాని ప్రతిదీ చేతికందే సమయంలో చేజారిపోతోంది. ఫలితం అందే సమయంలో నిష్పలం అవుతోంది. దీనికి నివారణ చెప్పండి.
సమా: ప్రతి సోమవారం వినాయకునికి గరికలతో పూజచేసి అటుకులు-బెల్లం (యధాశక్తి) నివేదన చేయండి. అవి బ్రాహ్మణునికి నాలుగు రూపాయల దక్షిణతో దానం చేయండి. ప్రతి మంగళవారం నాగదేవత విగ్రహం ముందు గుళ్ళో గోధుమపిండి, చక్కెర కలిపి చీమలకు వేయండి.

బి.సత్యకుమార్ - మదీనాగూడ, హైదరాబాద్
ప్ర: విద్య, జీవితంలో స్థిరత్వం వస్తుందా?
సమా: విద్యా యోగం సాధారణమే. వ్యాపారంలో స్థిరపడతారు.

అజయ్ - సికిందరాబాద్
ప్ర: నేను ఏ వృత్తిలో స్థిరపడగలను - విద్యారంగం ఎలా ఉంటుంది?
సమా: జాతకంలో చంద్రబలం లేదు - కుజుడు అనుకూలంగా లేడు - స్థిరత్వం లేకుండా జీవితం సంఘర్షణాత్మకంగా ఉంటుంది - బహుశా రాజకీయ పార్టీ కార్యకర్తగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎం.వి.జి.కృష్ణ - కుముదవల్లి, పశ్చిమగోదావరి
ప్ర: నేను ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది - లేదంటే ఉద్యోగమా?
సమా: మీకు వ్యాపారం కాని - ఉద్యోగంకాని యోగించవు. ప్రభుత్వ సంబంధమైన సివిల్ కాంట్రాక్టులు ప్రయత్నించండి - ముఖ్యంగా మున్సిపల్ కాంట్రాక్టులు - జాతకంలో శుభగ్రహాల బలం లేదు - నక్షత్రం మాత్రం మంచిది. గ్రహచార శని కూడా లేదు - శుభం భవతు

మేకల లావణ్య - చౌటుప్పల్, యాదాద్రి
ప్ర: వివాహం ఎప్పుడు? ఉద్యోగం ఎప్పుడు?
సమా: వివాహం 2018లో, ఉద్యోగం చాలా ఆలస్యం.

ఎమ్మనూరు రమేశ్‌బాబు - ప్రొద్దుటూరు, కడప
ప్ర: జీవితంలో ముఖ్యంగా ప్రయాణాలలో నాకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకసారి కాదు, చాలాసార్లు ఒక విధంగా ప్రతి ప్రయాణంలోనూ కారణం చెప్పండి. నివారణ చెప్పండి.
సమా: మీ జాతకంలో శని - రాహు - కుజుల సంయోగం ఉంది. ప్రతి శనివారం త్రిశూల పాశుపత విధానంగా రుద్రాభిషేకం చేయిస్తూ ఉండండి.

రామతీర్థ - హన్మకొండ, వరంగల్
ప్ర: ఇల్లు అమ్మకం, అబ్బాయి వివాహం?
సమా: ఉండవలసిన వారు ఉండికూడా ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదంటే ఏదో వాస్తుదోషం ముఖ్యంగా నైఋతి వాయువ్య భాగాలలో ఉండాలి - అది సరిచూసుకోండి. మీ అబ్బాయి వివాహం 2018లో జరిగే అవకాశం ఉంది.

ఎం.కళ్యాణి - జూబ్లీహిల్స్, హైదరాబాద్
ప్ర: నక్షత్రం - ఆర్ద్ర - అనారోగ్యం - ముఖ్యంగా విపరీతమైన తలనొప్పి - పరిష్కారం సూచించండి.
సమా: ఆర్ర్దా నక్షత్రజాతకులకు సహజంగానే విపరీతమైన, అనేకమైన ఆలోచనలుంటాయి. శరీరతత్వం ఉష్ణతత్వం ఎక్కువ - అందువలన ఆలోచనలను తగ్గించుకోండి - ముఖ్యంగా భర్త - సంతాన సంబంధంగా ప్రస్తుతం గ్రహచార స్థితి కూడా బాగాలేదు. శివపంచాక్షరీ జపం చేసుకోండి! భగవద్గీతా పారాయణం చేయండి.

జి.స్రవంతి - ఇసుకతోట, విశాఖపట్నం
ప్ర: ఆరోగ్య సమస్య - నాకు తెలియకుండానే స్పృహ కోల్పోతాను, ఎందరు ఎన్నికేకలు వేసినా పలకను. కాని చూస్తూనే ఉంటాను. ఏమిటి ఈ వ్యాధి. ఎవరూ చెప్పలేకపోతున్నారు.
సమా: మానసికంగా మీమీద ఏదో ఒక దుశ్చర్య ప్రభావం మిమ్మల్ని కలచివేసింది - లేదా తలలో ఏదైనా దుర్మాంసం పెరిగి అది మేధో క్రమానికి అడ్డుపడుతూ ఉండాలి. ‘‘హిప్నో సైకో థెరఫీ’’ చేయిస్తే మూలకారణం తెలుస్తుంది. అది ప్రయత్నించండి. హోమియోలో మందులున్నాయి.

మేకల రాజు - చిన్నకొండూరు, భువనగిరి యాదాద్రి
ప్ర: వివాహం ఎపుడు?
సమా: 2018 చివరిలో అవకాశం.

కవల రఘునందన ప్రసాద్ - కడియం, తూర్పుగోదావరి
ప్ర: వివాహం - 2018లో వివాహం జరుగుతుందా.
సమా: 2018 మధ్యభాగంలో తప్పక జరుగుతుంది

దీప - మల్కాజిగిరి, హైదరాబాద్
ప్ర: మరణించిన వారి దశ దిన కర్మలో జ్ఞాపకార్థంగా ఇచ్చిన స్టీలు వస్తువులు వేరే వారికి దానం చేయవచ్చా?
సమా: దరిద్రనారాయణులకు దానం చేయాలి - మరణించిన వారి జ్ఞాపికలు ఇవ్వటం మంచి సంప్రదాయం కాదు.

పుట్టి వెంకటశివరామకృష్ణ - రామకృష్ణాపురం, ఆంధ్రప్రదేశ్
ప్ర: నాకు ఏ వ్యాపారం యోగిస్తుంది. మంచి వ్యాపారం సూచించండి?
సమా: మీకు వ్యాపారం యోగించే అవకాశం లేదు - వీలయితే ఏదైనా ప్రభుత్వ కాంట్రాక్టులు ప్రయత్నించండి. ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్.

పట్నాల అప్పారావు - పొంగిపల్లి, తూర్పుగోదావరి
ప్ర: గురువుగారూ! నేను నివసిస్తున్న ఇల్లు అమ్మగలనా? త్వరలో నాకు స్థానచలనం ఉన్నదా?
సమా: మీ ఇల్లు అమ్మకమునకు మీ కుటుంబలోని వారే వ్యతిరేకిస్తారు. తాత్కాలికంగా ఏదైనా యాత్రా ప్రయాణం జరిగే అవకాశం ఉంది.

పేరు : .............................................................
చిరునామా : ..............................................
.......................................................................
........................................................................
.......................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) : ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
........................................................................
ప్రశ్న :
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్), హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ