భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొక్కొండ సుబ్రహ్మణ్యశర్మ, అంగర (తూ.గో.)
ప్ర:జూలై 22వ తేదీనాడు విజయవాడలో పోయిన నా బ్యాగ్, వయొలిన్ దొరికే అవకాశం వుందా?
సమా: ఎవరో స్ర్తి చేతికి చిక్కినట్లు కనిపిస్తున్నది. వారికి తిరిగి ఇవ్వాలనే ఉంది. కాని భయంతో ఇవ్వలేకపోవటమో- మరెవ్వరి ప్రోద్బలంవల్లనో ఇవ్వలేకపోతున్నారు. ఆ బ్యాగులో మీ చిరునామా కాని ఉన్నట్టయితే ఇచ్చేవారేమో? ఉత్తర దిశగా పోయినట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వ సహాయం అంటే పోలీసు అధికారిణి ద్వారా ఏమైనా శుభం జరిగే అవకాశం వుంది. వీణాసరస్వతీదేవికి (బాసర) మొక్కు కట్టండి.
శ్రీనివాస్.సి.ఆర్., విజయవాడ, కృష్ణా
ప్ర: కోర్టు కేసులో ముందుకు వెళ్లమంటారా?
సమా: ముందుకువెళ్లండి. ఆలస్యంగా మీకు న్యాయం జరిగే అవకాశం వుంది.
ఎ.వి.ఎన్.సి.కుమార్, కావలి, నెల్లూరు
ప్ర:వివాహ విషయం
సమా:మీ జాతకంలో చంద్రదోషం ఉంది. స్ర్తిల మూలకంగా ఆటంకాలుంటాయి. శే్వతార్క గణపతిని పూజించండి. శుభం జరుగును.
పి.రమాదేవి, పెనుగొండ, అనంతపురం
ప్ర: నాకు ఏదీ కలిసి రావటంలేదు. అన్నీ వ్యతిరేక పరిణామాలే. ఏం చేయమంటారు?
సమా: సంకష్టహర గణేశవ్రతం చేయండి. అన్ని విఘ్నాలు దూరమవుతాయి.
వి.రాములు, పెద్దపల్లి (కరీంనగర్)
ప్ర: రెండవ కూతురు వివాహం?
సమా: త్వరలోనే కుదిరే అవకాశం వుంది. అయితే అమ్మాయి నుండి ఏదైనా అయిష్టత వలన ఆటంకం రావచ్చు! జాగ్రత్త అవసరం.
వీరపనేని వేంకటశీలాకృష్ణ, విజయవాడ, కృష్ణా
ప్ర: నా వివాహం ఎప్పుడు జరుగును? మాది అన్యోన్య దాంపత్యమేనా?
సమా: వివాహం 2017లో జరిగే అవకాశం వుంది. ద్వంద్వ మనస్తత్వం మీది. ఏకముఖంగా శ్రేయోదాయకమైన ఆలోచనలు చేయండి. శుభం జరుగును.
పోతరాజు రామన్న, రామన్నపేట, నల్లగొండ
ప్ర: నేను ఎం.ఏ. బిఇడి చేసాను. పోటీ పరీక్షలలో విజయం సాధించగలనా?
సమా: ‘ఓడిపోతానేమోననుకునేవాడు ఓడిపోవటం తథ్యం’ అన్నాడు నెపోలియన్. ఓటమిని గురించి ఆలోచించవద్దు, గెలుపే లక్ష్యంగా ప్రయత్నించాలి.
బి.మాధవి, కొయ్యలగూడెం (ప.గో.)
ప్ర: నాకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?
సమా:అందుకు తగిన అర్హతలు ఉన్నట్టయితే 2017లో అవకాశం వుంది.
పి.వి.ఎస్.ఎల్.ఎన్.పట్నయ్య, శ్రీకాకుళం (ఆం.ప్ర.)
ప్ర: నా భవిష్యత్తును గురించి నిర్మొహమాటంగా చెప్పండి.
సమా:నిర్మొహమాటంగా చెప్పాలంటే ఈ చిన్న కాలంలో మీ మొత్తం భవిష్యత్తును తెలుసుకోవాలనుకోవడం పేరాశ- అత్యాశ.
ఎమ్.డి.ఎస్.పి.సౌమ్య, కాకినాడ (తూ.గో.)
ప్ర: సంతాన నష్టం - పరిష్కారం?
సమా: మీ జాతకంలో నాగదోషం ఉంది. అసంబద్ధమైన పరిష్కార శాంతి గురించి ఆలోచించండి.
కె.టి.లక్ష్మీనారాయణ, కొత్తగూడెం (తెలంగాణ)
ప్ర: నేను ఐరన్ షాపు లీజ్ అగ్రిమెంట్ నడుపుతున్నాను. గడువు పూర్తి అవుతోంది- ఏం చేయమంటారు?
సమా: మున్ముందు కూడా మీరు ఐరన్ షాప్ వ్యాపారమే చేస్తారు.
ఎల్.ప్రవీణ్, గుంటూరు, (ఆం.ప్ర.)
ప్ర: నాకు కళ్ళజోళ్ళ వ్యాపారం కలిసి వస్తుందా?
సమా: బాగానే ఉంటుంది. కిరాణా వ్యాపారం కూడా బాగానే ఉంటుంది. కూరగాయల వ్యాపారం కూడా ఫర్వాలేదు.
కె.పవన్‌కుమార్, విజయవాడ (కృష్ణా)
ప్ర: నా వృత్తిస్థానం - ఉద్యోగం
సమా: జన్మస్థలానికి దూరంగా దక్షిణ దిక్కుగా సెటిల్మెంటు- కేవలం స్వార్జితమే. అనుభవం-
సి.బుచ్చయ్య, వెంకటాపురం (ప.గో.)
ప్ర: అన్నిటా అపజయాలు - కారణం తెలియదు.
సమా: తొలుత జరిగిన అపజయాన్ని తలచుకుంటూ ప్రయత్నిస్తే తరువాతవి కూడా అపజయాలే కలుగుతాయి. ఆంజనేయస్వామిని ఉపాసించండి. జయం కలుగుతుంది.
పి.మహీధర్, అలబామా స్టేట్ (అమెరికా)
ప్ర: హెచ్1 వీసా ఆలస్యం దేనివలన? పరిష్కారం ఏమిటి?
సమా: మీ జాతకంలో రవి బలం లేదు. అలాంటివారికి ప్రభుత్వ వ్యవహారాలలో చిక్కులుంటాయి. సూర్యోపాసన చేయండి.
సి.బాబూరావ్, వెంకటాపురం (ప.గో.)
ప్ర: పొలం- భూమి కొనాలని వుంది. కొనమంటారా? మరి జాతకం బాగుండాలి కదా?
సమా: స్థానిక పండితులను సంప్రదించి కొనండి.
మహానందేశ్, ఆదోని (కర్నూలు)
ప్ర: వివాహం ఎప్పుడు? ఉద్యోగం చేసే అమ్మాయి లభిస్తుందా?
సమా: రెండూ ఆలస్యమే. 2017 మధ్యభాగంలో కొంత అనుకూలం. ఉద్యోగం చేసే అమ్మాయి అనుమానమే.
బి.బంగారు రాజు, గుంటూరు, ఆం.ప్ర.
ప్ర: మాలాడ్జి పేరు ‘మ’తో పెట్టమన్నారు. ‘మేఘన’ లాడ్జిగా మారుస్తున్నాను.
సమా: బ్రహ్మాండంగా ఉంటుంది. ‘మే’ అనే అక్షరం ధనాంశ- లాభప్రదం- ముందుకు వెళ్లండి.
శ్రీను, మండపేట, (తూ.గో.)
ప్ర: నా భార్యపైన ఒక అసూయ పడింది. అది నిజమా?
సమా: ఇలాంటి ఊహాపోహల ప్రశ్నలకు జ్యోతిష శాస్త్రంలో సమాధానాలుండవు. ఇటువంటి ప్రశ్నలు వేయవద్దు.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ