భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచాగ్నుల బాలాత్రిపురసుందరి, చెన్నై, తమిళనాడు
ప్రశ్న :మహాశయా! మాది మొదటి నుండి కఠ్నాటక సంగీత కుటుంబం- కచేరీలు చేయలేదు కాని మా అమ్మ గారు గొప్ప వైణికురాలు- మా తాతగారు మా అమ్మను వీణా సరస్వతీగా పిలిచేవారు (మామూలు పేరు సరస్వతి). గత రెండు మూడు సంవత్సరాలుగా తెలియని అనారోగ్యంతో బాధపడుతోంది. డాక్టర్లేమో ఏ అనారోగ్యమూ లేదు- మనోవ్యాధే- మనోవ్యాధికి మందేమిటి? అంటున్నారు. కారణం తెలియక బాధపడుతున్నాము. ఆమె జన్మరాశి సింహరాశి- మఖా నక్షత్రం- దయచేసి పరిష్కారం చెప్పండి!
సమాధానం: మీ తల్లిగారు వీణా విద్వాంసురాలు కావటం చాలా సంతోషం. విద్యావంతులకెవరికైనా తమ విద్యకు గుర్తింపు కోరతారు. మీ తాతగారు ఉన్నంతవరకూ ఆమెను వీణా సరస్వతిగా పిలిచి సమాదరించటంవలన ఆమెకు మనశ్శాంతిగా ఉండేది. ప్రస్తుతం ఆమెకు కావలసింది ఆమె విద్యకు గుర్తింపు. ఆమె వాయించలేకపోతున్నదంటున్నారు కనుక ప్రతిరోజూ మీరే కొన్ని లలిత మధుర రాగాలు ఆయా వేళల్లో వినిపించండి. అంటే, ప్రాతఃకాలంలో భూపాలరాగం- స్నానాదుల తరువాత పవిత్రతను ధ్వనించే అభేరీరాగం- సాయంవేళ మోహన- పడుకునే సమయంలో హిందోళ- మధ్యమావతి వాయించి వినిపించండి. సంగీత నాదం ఒక పరవౌషధం. తప్పక మీ అమ్మకు ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశివారు గుర్తింపును కోరతారు.

ఎలమంచిలి భానోజిరావు, బందరు, ఆంధ్ర
ప్ర:శర్మగారూ! మీరు చెపుతున్న భవిష్యకాలంలో మనశ్శాస్త్ర సంబంధమైన విషయాలు కూడా ఉంటున్నాయి. అందులోనూ మీకు ప్రవేశముందా?
సమా: ‘మనస్సే అన్నిటికీ మూలం- ఆ మనసును కలుషితం చేసి చిన్నా పెద్దా అందరినీ పిచ్చివాళ్ళను చేస్తున్నాయి. నేటి కళా సాహిత్య రంగాలు- ఈ విషయాన్ని సమాజం గుర్తించటంలేదు. జ్యోతిష శాస్త్రంలో మనస్సునకు కారకుడు చంద్రుడు- ఆ విధంగా జ్యోతిష శాస్త్రానికి మనశ్శాస్త్రానికి అవినాభావ సంబంధమే ఉంటుంది.
ఎమ్.దివాకర్, సినీ డైరక్టర్, ఆర్టిస్ట్, గుంటూరు

ప్ర:కళారంగంలో ప్రసిద్ధి పొందాలంటే ఏం చేయాలి. నాకు ఆ యోగం ఉన్నదా?
సమా:‘సాధనమున పనులు సమకూరు ధరలోన’- గెలుపు ఓటములు- ఉత్థాన పతనములను లెక్కచేయకుండా, లక్ష్యంవైపు ప్రయత్నించాలి. దైవానుగ్రహంగా ‘గాంధర్వ కళానాట్య విద్యాసరస్వతీ’ మంత్రాన్ని అనుష్ఠించాలి.
వి.హనుమత్‌ప్రసాద్, విజయవాడ (ఆంధ్ర)

ప్ర:సినీ నటుడుగా నాకు యోగం ఉందా?
సమా:ఆ సంబంధమైన దేవతను ఆరాధించండి. అలుపెరగకుండా ప్రయత్నించండి. తప్పక సాధిస్తారు.
రాపోలు దయాశిలా జాకబ్- కర్నూలు (ఆంధ్ర)

ప్ర:నేను రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాను. అన్యాయాన్ని- అవినీతిని సహించను. ఎదిరించి పోరాడతాను. అయినా మామూలుగా నన్ను అభిమానించేవారంతా రాజకీయ పదవులు వచ్చేసరికి నన్ను పక్కన బెడుతున్నారు. నాకు రాజకీయ పదవీ యోగం ఉందా?

సమా:ముందుగా మీరు గుర్తించవలసిన బైబిల్ సూక్తి- ‘తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును’ అన్న సూక్తి- మీరొక అన్యాయాన్ని ఎదిరించే ఏకైక వీరునిగా ఊహించుకుంటున్నారు. ప్రపంచంలో మంచి-చెడు, నీతి-అవినీతి, స్వార్థం-త్యాగమూ అన్నీ ఉంటాయి. రాజకీయాల్లో సంఘబలం ఉండాలి. దాన్ని ఓపిగ్గా సాధించండి. తప్పక రాణిస్తారు.
మానాప్రెగడ వెంకట శేషు, రాజమండ్రి, ఆంధ్ర

ప్ర:అనారోగ్య రీత్యా బాగుండటం లేదు- టిఫిన్ సెంటర్ పెడితే రాణించగలనా?
సమా:ఒక ప్రశ్నకూ మరో ప్రశ్నకూ పొంతన లేదు. ముందు ఆరోగ్యాన్ని కుదుర్చుకోండి. మోకాళ్ళు, హృదయ స్థానం బలహీనంగా కనపడుతున్నాయి. టెన్షన్ పెరిగే వ్యాపారాలు చేయకండి. ఆపిల్ పండ్ల రసము- గాజర గడ్డల రసము- పటికబెల్లం- మూడు కలిపి తేనె పాకముగా తయారుచేసుకొని సీసాలో భద్రపరచుకోండి. రోజూ రెండు తులముల మోతాదుతో ఉదయం, సాయంత్రం మంచినీళ్ళలో కలిపి త్రాగండి. హృదయానికి శరీరానికి బలం కలుగుతుంది. వ్యాపారంలో ఏదైనా అనుభవమున్న వారితో కలిసి చేయండి.
కె.కామేశ్వరరావు, నరసరావుపేట (గుంటూరు)

ప్ర:ఆర్థికాభివృద్ధి- వివాహం
సమా:ఇంకా ఆలస్యం ఉంది. ప్రతి శుక్రవారం సంతోషీమాతకు ఆరు అరటిపండ్లు ఆరు కోవా పేడా పాకెట్లు (యధాశక్తి) ఆరు రూపాయలతో పూజించి సమర్పించండి. కార్యసిద్ధి కలుగుతుంది.
ఎస్.అనంతలక్ష్మీ రత్నం, కాకినాడ (ఆంధ్ర)

ప్ర:విద్యావిఘ్నములు
సమా:‘తొలుత నవిఘ్నమస్తనుచు దొండపు దేవుని కొల్పగావలెన్’ విఘ్నేశ్వరుని ప్రతి సోమవారం అటుకులు బెల్లం నివేదనగా, పచ్చిగరిక పూలుగా అర్చించండి. విద్యాభివృద్ధి కలుగుతుంది.

ఆర్.కాంతిలాల్, హిందూపురం (ఆంధ్ర)

ప్ర:ఎవ్వరికీ లేని కష్టాలు మాకెందుకు వస్తున్నాయి. పరిష్కారం చెప్పండి?
సమా: ‘చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ’- పూర్వం చేసినవే ఇప్పుడు అనుభవంలోకి వస్తాయి. కష్ట నివారణకు సంకష్టహర గణేశవ్రతం చేయండి. శుభం కలుగును.
దార్ల వెంకట శివరామప్రసాద్, విజయవాడ (ఆంధ్ర)

ప్ర:చపాతీల వ్యాపారం చేయాలనుకుంటున్నాను బాగుంటుందా?
సమా:టిఫిన్ సెంటర్ గురించి ఆలోచించండి, బాగుంటుంది.
ఎస్.ప్రకాశ్, బరంపురం (ఒడిసా)

ప్ర:స్థలం అమ్మకం
సమా:2017 ఏప్రిల్-జూన్‌లోపల అమ్మకం అయ్యే అవకాశం వుంది. మీ మనసులో ఒక శుభకార్యాలోచనలు కూడా కనిపిస్తున్నాయి. వాహన సంబంధమైనా కావచ్చు. శుభం జరిగే అవకాశం ఉంది.
ఎ.సుభాషిణి- నంద్యాల (ఆంధ్ర)

ప్ర:ఉద్యోగం రెగ్యులరైజేషన్
సమా: తప్పకుండా అవుతుంది. అయితే స్థానచలనం కూడా జరిగే అవకాశం ఉంది.
జి.స్వరూప, పెద్దపల్లి (తెలంగాణ)

ప్ర:మా ఆర్థిక పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుంది?
సమా:‘మీ’ అంటున్నారు కనుక మీ ప్రశ్న సామూహికమైనది. ఏకాభిప్రాయం సాధిస్తే అభివృద్ధికి రాగలరు.
ఉక్కాల శ్రీనివాసులు, సంగం (నెల్లూరు)

ప్ర:ఉద్యోగం లేకపోవటంవలన సామాజికంగా గౌరవాన్ని పొందలేకపోతున్నాను.
సమా:సామాజిక గౌరవానికి వ్యక్తిత్వం ప్రధానం శీలం- ప్రధానం క్రియాశీలత్వం అలవరచుకోండి.
ఆర్.వి.సుబ్బారావు, ఫిరింగిపురం (గుంటూరు)

ప్ర:నేను కాని, నా కుమారుడు కాని ఏ వ్యాపారం చేసినా ఆరు నెలల వరకూ బాగుంటుంది. తరువాత సరిగా సాగదు. పరిష్కారం ఏమిటి?
సమా:వ్యాపార స్థానం వాస్తు సరిచూసుకోండి.
కె.రాజవర్థన్, వికారాబాద్ (తెలంగాణ)

ప్ర:మిలటరీలో ఉద్యోగ ప్రయత్నం-
సమా:మిలటరీ పట్ల మీకున్న అభిమానం- మీరు కార్గిల్ కాలనీ వాసులు కావటం. అభినందనలు. ‘కార్గిల్ అమరవీరులకు జోహార్లు’. మిలటరీ పారా మిలటరీ- క్లారికల్ ఉద్యోగానికి ప్రయత్నించండి. అప్పుడు ‘హైట్’ సమస్య ఉత్పన్నం కాదు.
సి.బదరీనారాయణ, విజయవాడ (ఆంధ్ర)

ప్ర:నాది భరణీ నక్షత్రం- శివుడికి అభిషేకం చేయవచ్చునా?
సమా:మీ ప్రశ్న అసంగతం- పరమేశ్వరుడికి ఎవరైనా ఎప్పుడైనా అభిషేకించవచ్చు!
భూపతిరావు, కామవరపుకోట (ఆంధ్ర)

ప్ర:స్వగృహ స్థలయోగం
సమా:2017లో సాధ్యవౌతుంది.
చేజర్ల వెంకటేశ్వర్లు, బాపట్ల (గుంటూరు)

ప్ర:అప్పులు ఎలా తీరాలి?
సమా:ఋణవిమోచన అంగారక వ్రతం చేయండి.

ఉమాపతి బి.శర్మ