భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొణమాటి ఆదినారాయణ, కొత్తపేట, హైదరాబాద్
ప్ర:శర్మగారూ! నాకొక ధర్మసందేహం- రామాయణంలో వాలిని శ్రీరామచంద్రమూర్తి చెట్టుచాటునుంచి ఎందుకు చంపాడు? ఈ ప్రశ్నకు రామాయణంలో నాకు పలువురు పండితులు చెప్పినవి- వాలి మెడలో వున్న అపూర్వ హారం కారణంగా అని కొందరు, వాలి మృగరూపమే కనుక చెట్టు చాటునుండి మృగాలను వేటాడటం రాజధర్మమని మరికొందరు చెప్పుకొచ్చారు. సత్య పరాక్రముడైన రాముని విషయంలో ఇవి వర్తించవు. కేవలం ఒక హారానికి భయపడి రాముడు అలా చేస్తాడా? కాదు- వేట ధర్మంగా అనుకుంటే వానరం వేటాడబడే మృగం కాదు. కోతిని, పిల్లిని చంపటం పాపమని ధర్మశాస్త్రాలు చెపుతాయి కదా! అందువల్ల ‘రామో విగ్రహవాన్ ధర్మః’ వంటి మహనీయునికి ఈ సమాధానాలు వర్తింపజేయటం అసంగతం- అంతర్లీనంగా మరో కారణముండాలి. ఆ ధర్మసూక్ష్మాన్ని మీరు చెప్పగలరని నమ్మకం. దయచేసి వివరించండి!
సమా: మీ సందేహాలు సహేతుకమైనవే. అంతర్లీనమైన ధర్మసూక్ష్మం మరొకటి ఉం ది. శ్రీరామచంద్రమూర్తి యొక్క ఒకే ఒక ఆదర్శం అధర్మపరులను శిక్షించటం, ధర్మపరులను రక్షించటం- తన తమ్ముడైన సుగ్రీవుని భార్యను చెరబట్టి వాలి క్షమించరాని అపరాధం చేశాడు. దండకారణ్యం (దండకుడు ఇక్ష్వాకు వంశపురాజు- అది అతని రాజ్యం) దక్షిణ కోసలగా ఒకనాడు ప్రసిద్ధం. ఆ విధంగా వాలిని శిక్షించే అధికారం రాముడికి ఉంది. అయితే ఒక ప్రమాణమేమిటంటే శ్రీరాముడు ఎదురుపడితే వాలి శరణాగతుడు అయ్యే అవకాశం ఉంది. రాముని పట్ల వాలికి భక్తి గౌరవాలున్నాయి. అందుచేత శరణాగతుడైతే తాను సుగ్రీవునికిచ్చిన మాట తప్పటమవుతుంది. పైగా అపరాధ దండ్యుని క్షమిస్తే అధర్మమవుతుంది. అందుకే రాము డు వాలికి కంటబడకుండా చెట్టు చాటునుంచి చంపాల్సి వచ్చింది. అంతేకాని అపూర్వహారానికి భయపడి కాదు. వాలిని వేట మృగంగా భావించీ కాదు. ఈ కారణాన్ని బయటపెడితే రాముని స్వోత్కర్షగా భావించే అవకాశం ఉంది. కనుక వాల్మీకి మహర్షి అంతర్లీనంగా దాచాడు. వాల్మీకి మహర్షి రామాయణంలో ఎన్నో రహస్యాలున్నాయి. ఆధునిక మనస్తత్వ శాస్త్ర రహస్యాలూ ఉన్నాయి.
ఎం.సిద్ధార్థ, కాప్రా, హైదరాబాద్
ప్ర:్ఢల్లీలో ఉద్యోగం వదలి హైదరాబాద్ వచ్చాను. నేను ఇక్కడ స్థిరపడగలనా?
సమా:హైదరాబాద్ మీకు అర్వణమే అంటే యోగకారకమే.
ఐ.వి.సంతోష్, విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర:లోగడ నా ప్రశ్నకు సమాధానం చెపుతూ గౌరవనీయ బాంధవ్యపు స్ర్తిలు అన్నారు. దయచేసి వివరించండి.
సమా: అక్క- చెల్లెలు - తల్లి, పినతల్లి, వదిన మొదలైన బాంధవ్యంగలవారు.
దమ్మాటి సాంబయ్య, తాడికొండ (గుంటూరు)
ప్ర:ప్రక్కన ఉన్నవారు నా స్థలాన్ని ఆకమించుకొన్నారు. నా స్థలము నాకు వచ్చునా?
సమా:ఆలస్యంగా- కొంత నష్టంతో లభించే అవకాశం ఉంది.
ఏ.వి.ఎమ్.కృష్ణ, భీమవరం (ఆంధ్ర)
ప్ర:ప్రస్తుతం బ్రాందీ కొట్టులో ఉద్యోగం- భవిష్యత్తులో ఎదగగలనా? ఆరోగ్యం విషయం చెప్పండి.?
సమా:జూన్‌లో కొంత మార్పు రాగలదు. ఆరోగ్యం విషయంలో పాదాలు- మోకాళ్ళ విషయంలో జాగ్రత్త అవసరం.
ఎల్.గోవిందరాజులు, సోమందేపల్లి, అనంతపురం
ప్ర:ఇంటా బయటా అవమానాలు- మనశ్శాంతి లేదు- ఇంట్లో అకారణ కలహాలు- ఏదీ సరిగా జరగదు. పరిష్కారం చెప్పండి.?
సమా:మీరు చెప్పిన సంఖ్యా జాతకం ప్రకారం మీకు స్వంత నిర్ణయాలు తక్కువ. ఎప్పుడూ ఎవరో ఒకరు ముఖ్యంగా స్ర్తిల ప్రభావంతో మీ జీవితం నడుస్తోంది. ముఖ్యంగా ఎవరి సలహావల్లనో ధన నష్టానికి కూడా గురియైనట్టు సూచిస్తోంది. స్వతంత్ర వ్యక్తిత్వం కోసం ప్రయత్నించండి. ఆంజనేయస్వామిని ఆరాధించండి.
కె.శేషాద్రి, రాజమండ్రి, (తూ.గో.)
ప్ర:మా నాన్న గారిచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోగలనా?
సమా:స్థలం విషయంలో మరొకరి ప్రమేయం కూడా కనిపిస్తోంది. అది సానుకూలమైతే కట్టుకోగలరు.
ఎమ్.జి.కిరణ్‌కుమార్ శెట్టి, అనంతపురం, ఆంధ్ర
ప్ర:నేను ఏ వ్యాపారంలో రాణించగలను.?
సమా:్ఫల్డ్‌వర్క్‌కు సంబంధించినది- తినుబండారాలకు సంబంధించినవి- ప్రయత్నించండి.
గండికోట కృష్ణమోహన్, దేవరపల్లి (ప.గో.)
ప్ర:నేను బ్రాహ్మణుడను- ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. ఆనువంశికంగా మాకు పౌరోహిత్యం ఉంది. ఏ విద్యలోనూ రాణించలేకపోతున్నాను. పౌరోహితం సాధన చేయమంటారా?
సమా:ఏ విద్యయైనా శ్రద్ధ్భాక్తులు లేకపోతే రాణించదు. ధన సంపాదన కోసమే నేర్చుకునే విద్య ప్రసిద్ధిని కలిగించదు. విద్య మీది గౌరవంతో విద్య నేర్వండి. గౌరవాదరాలు ధన సంపాదనలు- వాటి వెనుకే వస్తాయి. పౌరోహిత్యం పవిత్ర వృత్తి.
బి.సుభాస్‌చందర్, రాంనగర్, హైదరాబాద్
ప్ర:ఇల్లు అమ్మకం- ఆలస్యం- కారణం చెప్పండి.?
సమా:ఇంకా ఆలస్యమే జరిగే అవకాశమే ఉన్నది. ఆగ్నేయ- వాయువ్య దిశల్లో వాస్తుదోషం కనిపిస్తోంది.
పాలవల్లి రమాదేవి- జలదంకి (నెల్లూరు)
ప్ర:పాత యింటిని మార్పులు చేసినప్పటినుంచీ సమస్యలు మొదలయ్యాయి. ‘మాప్’ పంపించాను, దోషం చెప్పండి.?
సమా:స్థూలంగా మీ ఇంటికి దక్షిణ కాలనీ నీటి ప్రవాహం దోషం-
గిడుగు రాజ్యలక్ష్మి, ఉప్పల్, హైదరాబాద్
ప్ర:ఇచ్చిన ఋణం వస్తుందా రాదా?
సమా:ఏదో ఒక స్థిరాస్తి సంబంధంతో కొంత మాత్రం రాగలదు.
ఎన్.ప్రభాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ (తెలంగాణ)
ప్ర:మా అన్నదమ్ముల ఆస్తి తగాదాలు పంపకాలు ఎప్పుడు పరిష్కారమవుతాయి.
సమా:ఇంకా వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. సహన శాంతాలు పాటించండి.
జి.అరుణాదేవి, భద్రాచలం (తెలంగాణ)
ప్ర:ఆరోగ్య విషయం చెప్పండి? నా రాశి వృషభరాశి-
సమా:అష్టమ శని ప్రభావం కారణంగా నరాలకు సంబంధించిన అనారోగ్యం రావచ్చు! న్యూరో స్పెషలిస్ట్‌ను సంప్రదించండి.
కనమల్లు మహేందర్, పెద్దపల్లి (తెలంగాణ)
ప్ర:నేను జీవితంలో ఏ రంగంలో స్థిరపడగలనో చెప్పండి?
సమా:అనేక వ్యాపారాలు- చివరగా రెస్టారెంట్- ఫాస్ట్ఫుడ్- పెట్రోలియం- మెడికల్ రంగాలు
జె.రవిప్రకాశ్, సైదాబాద్ కాలనీ (హైదరాబాద్)
ప్ర:నేను స్వంతంగా ఎప్పుడు వ్యాపారం చేస్తాను. ఎలాంటి వ్యాపారం-
సమా:దుస్తులు -పట్టు వస్త్రాలు- అలంకార ద్రవ్యాలు- ముత్యాలు వంటివి- 2018 చివరి భాగంలో అవకాశం.
కె.లక్ష్మీదేవి- బాగ్‌అంబర్‌పేట, హైదరాబాద్
ప్ర:దాంపత్య కలహం- మాకు కర్నూలు - హైదరాబాద్‌లో ఏది మంచిది?
సమా:మొదట పరస్పరం ఐక్యత సాధించండి. మిగతావన్నీ తరువాతే-

**

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ