భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.పద్మావతి, కవాడీగూడా, హైదరాబాద్
ప్ర:ఊరుమారితే కలసి వస్తుందా?
సమా: మీకు యోగించే అక్షరాలు ‘‘ర’’ ‘‘వ’’ ‘‘డి’’ అనే అక్షరాలు - ‘‘ప’’అనే అక్షరం వల్ల సగానికి సగం ఫలితం చేకూరుతోంది. యోగించే అక్షరాల ఊర్లు కాని హైదరాబాద్‌లోనే బస్తీలు కాని ఎన్నుకోండి.
కె.వి.కృష్ణారావు, నాగోల్, హైదరాబాద్
ప్ర: అభిజిల్లగ్నం ఎప్పుడు వస్తుంది- మకర కుంభములు అభిజిల్లగ్నములా?-
సమా: ‘అభిజిత్’లగ్నమంటే సూర్యుడున్న రాశినుండి నాలుగు, ఎనిమిది రాశులు అభిజిత్తు లగ్నాలవుతాయి. అవి సూర్య సంచారంనుండి మారుతూ ఉంటాయి. ‘అభిజిత్ నక్షత్రం ఉత్తరాషాఢ- శ్రవణముల మధ్య ఉండే అప్రకాశక నక్షత్రము ‘అభిజిత్’. అభిజిత్ వా ప్రకాశకం అని పేరు. ‘‘ఖి,ఖూ,ఖె,ఖో’అనే అక్షరాలు ఆ నక్షత్ర ప్రభావితములు. అభిజిత్ నక్షత్రము వేరు. అభిజిత్ లగ్నం వేరు. ‘‘అభిజిత్ సర్వదోషఘ్నం’’అని అభిజిల్లగ్నము ఉత్తమమైనది.
నంద్యాల లక్ష్మీనరసింహాచార్యులు,
ప్రకాశం జిల్లా, పాకూరు
ప్ర: మా కోదండ రామాలయస్వామి దేవాలయానికి ధూపద్రీప నైవేద్యములు ప్రభుత్వ పథకమునుండి లభించునా?
సమా: రాబోయే జూన్ తరువాత ప్రభుత్వ పరంగా అనుకూలత ఉంటుంది. అయితే ‘‘మంత్రాధీనంతు- దైవతం’’అని పెద్దలమాట. అందువలన శ్రీ స్వామిని ‘‘సామ్రాజ్య రామతారక మంత్రముతో పురుష సూక్త్భాషేకం చేయండి. మీకుకూడా శ్రీ స్వామి కృప కలుగుతుంది. ఫలితం త్వరగా సిద్ధిస్తుంది.
కాకర్లమూడి మనోజ్, పెనుగొండ, ప.గో.
ప్ర: నాకు ఉద్యోగం ఎప్పుడు రాగలదు. ప్రభుత్వమా? ప్రైవేటా?-
సమా: మీ జాతకంలో రవి బలం తక్కువగా ఉంది. అందువలన ప్రైవేటు ఉద్యోగమే పశ్చిమ దిశలో దొరికే అవకాశం ఉంది. రాబోయే తెలుగు సంవత్సరంలో.
కె.నవీన, బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్
ప్ర: విద్య, ఉద్యోగం?
సమా: మొదట విద్య పూర్తికానివ్వండి. దానిమీద మనసు కేంద్రీకరించండి.
ఆర్.అశ్విని, నాగారం, హైదరాబాద్
ప్ర: ప్రస్తుత ఉద్యోగంకంటే మంచిది రాగలదా?
సమా: ప్రస్తుతం సమయం అనుకూలంగా లేదు. ఉన్నదాని మీదనే శ్రద్ధ చూపండి.
బంగారయ్య, తిరుమలపాలెం, (ప.గో.)
ప్ర: పూర్వీకులు ఇచ్చిన భూముల్లో ‘‘బోర్’’వేయాలని ఉంది. నా కల ఎప్పుడు ఫలిస్తుంది.
సమా: చేతికి అందివచ్చిన భూముల్లోనే బోరువేయాలని కలలుకంటున్నారంటే అది కలగానే మిగిలిపోతుంది- ప్రయత్నిస్తే ఫలిస్తుంది-
వి.రాధాకృష్ణమూర్తి, కవాడీగూడా, హైదరాబాద్
ప్ర: నాకు నిదానంగా స్వగృహయోగం ఉందన్నారు. ప్రభుత్వపరంగానా? బంధువుల పరంగానా?
సమా: బంధువుల సహాయంగానే జరిగే అవకాశం ఉంది. అయితే ఏ విధంగా జరిగినా ప్రభుత్వపరంగా కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది. టైటిల్ డీడ్స్‌గాని- లోన్స్‌గాని జాగ్రత్తగా చూసుకోండి-
కె.కృష్ణమూర్తి, పేరాల (ప్రకాశం)
ప్ర:అప్పుల బాధ- ఉద్యోగంలో సమస్య-
సమా: ఋణ విమోచన అంగారక వ్రతం చేయండి. ప్రతి మంగళవారం - (11వారాలు) శుభం జరుగుతుంది.
నవీన్, ఖమ్మం, (తెలంగాణ)
ప్ర: బాకీల ద్రవ్యం రావటం లేదు. ఏంచేయాలి.
సమా: ‘‘నష్టద్రవ్యప్రాప్తి కార్తవీర్య యంత్రం’’ పెట్టుకొని పూజించాలి. తప్పక లాభం జరుగుతుంది.

పేరు :
చిరునామా : ...................................................... ......................................................
.....................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
..............................................................
ప్రశ్న : .............................................................
........................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ