భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.పి.కుమార్, విజయవాడ (కృష్ణా)
ప్ర:నాకు ఏ వ్యాపారం యోగిస్తుంది?
సమా: హోటల్ - బేకరీ - ఫాస్ట్ఫుడ్- పండ్లు- కొబ్బరి కాయలు- ఫర్నీచర్ మొదలగునవి యోగిస్తాయి.

పి.లక్ష్మీసురేఖ, చెన్నై (తమిళనాడు)
ప్ర: వివాదాల్లో స్థిరాస్తులు- దాంపత్యంలో
కలతలు.
సమా: స్థిరాస్తి సంబంధ వివాదాలు మీ భర్తకు సంబంధించినవి ఉంటుంది. ప్రశ్న సంఖ్య ఆయన చెప్పాలి. దాంపత్య సంబంధమైన సమస్యల్లో మీ వివాహ సమయ ముహూర్తదోషం ఉంది. పదకొండు గురువారాలు ‘గజగౌరీ వ్రతం’ చేయండి. శుభం కలుగుతుంది.

ఆళ్ళ నారాయణరావు, బాపట్ల (గుంటూరు)
ప్ర:ఆరోగ్యం- ఆర్థిక స్థితి-
సమా: ఆరోగ్యం విషయంలో యూరినరీ సమస్యలు సూచిస్తున్నాయి. ఆర్థికం- మరొకరి సహాయం అవసరం.

వై.రాధామోహన్, అనంతపురం (ఆంధ్ర)
ప్ర:అకారణంగా నీలాపనిందలు వస్తున్నాయి. పరిష్కారమేమిటి?
సమా: ‘కారణం వినా కార్యం నభవతి’- ప్రతిదానికీ కారణముంటుంది. కొంచెం లౌక్యం అలవరచుకోండి- వాక్సంయమనం పాటించండి దైవానుగ్రహం కొరకు. పాదాలు పడని చోటునుండి పచ్చని గరిక తీసుకొని తేనెలో ముంచి విఘ్నేశ్వరుని పూజించండి (గురువారంనాడు).

ఎ.శేషాద్రిరెడ్డి, హిందూపురం (అనంతపురం)
ప్ర:హిందూమతం అంటే చాలా ఇష్టం- ఏదైనా ప్రముఖ దేవాలయంలో చైర్మన్ కావాలని ఉంది. కోరిక తీరేనా?
సమా: హిందూ మతానికి సేవ చేయాలంటే దేవాలయ చైర్మన్‌గానే కావలసిన పని లేదు. మామూలు భక్తుడిగా, స్వచ్ఛంద కార్యకర్తగా చేయవచ్చు.! ‘గుడి మణియము సేయబోకు’ అని సుమతి శతకంలోనే హెచ్చరిక ఉంది. గుడికి ధర్మకర్తృత్వంలో పుణ్యం కంటే పాపమే కలిగే అవకాశం వుంది.

పెరుమాళ్ళ బాలకృష్ణ, కర్నూలు
ప్ర:అప్పుల బాధ
పరిష్కారం
సమా:ఋణవిమోచన అంగారక వ్రతం చేయండి.

పి.వి.ఎన్.సుజిని, బోరబండ,
హైదరాబాద్
ప్ర:సంతాన ప్రశ్న
సమా: ఈ విషయంలో దంపతుల ఇద్దరి జాతకాలు పరిశీలించాలి- వీలయితే స్థానికులే కనుక వ్యక్తిగతంగా కలవండి!

హెచ్.వి.సూర్యనారాయణమూర్తి, తణుకు (ప.గో)
ప్ర:ఉద్యోగ బకాయలు- అనుకూలమైన కోర్టు తీర్పు అయినా ఫలితం శూన్యం-
అనేక దేవతలను పూజిస్తున్నాను- ఫలితం లేదు.
సమా: కోర్టు తీర్పు అనుకూలం అంటున్నారు కనుక ఆలస్యంగానైనా ఫలితం ఉంటుంది. అనేక రకాల దేవతలను పూజించటం సరియైన పద్ధతి కాదు. ‘సర్వార్థసిద్ధి రామాయణంలో రాజకార్య ఫలసిద్ధి కొరకు ఒక ప్రత్యేక సర్గ ఉంది. అది పారాయణం మూడు పూటలా చేసి, చెప్పిన విధంగా నివేదన సమర్పించండి. కోరిక నెరవేరుతుంది. దానమూ- నివేదన- భూత ప్రీతి చాలా ముఖ్యం.

సి.్భస్కరరావు, పగిడిగూడెం (ప.గో)
ప్ర:్భసమస్య-
రక్తసంబంధీకులతో-
సమా:ఆలస్యంగా- కొంత నష్టంతో ఫలితం ఉంటుంది.

కె.సత్యవతి, బీరంగూడ (హైదరాబాద్)
ప్ర:మా అమ్మాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి చక్కపరచటానికి నేను ఏం చేయాలి?
సమా: తగు సంకల్పంతో సంకష్టహర గణేశ వ్రతం చేయండి. మీ అమ్మాయి చేత చేయిస్తే మరీ మంచిది. శ్రీలక్ష్మీ గణేశస్వామి దేవాలయంలో కోవా పేడాలు నివేదన చేసి పనె్నండేళ్ళలోపు చిన్న పిల్లలకు పంచి పెట్టండి.

లక్ష్మీదేవి శ్రీనివాసులు,
ఎమ్మిగనూరు (కర్నూలు)
ప్ర:స్వంత ఇల్లు- ఏ వ్యాపారం
బాగుంటుంది.
సమా: స్వంత యిల్లు ఆలస్యంగా కొన్ని ఇబ్బందులతో ఉత్తర దిశలో ఏర్పడే అవకాశం వుంది. వ్యాపారం- వస్త్ర వ్యాపారం, ముఖ్యంగా చిన్న పిల్లల దుస్తులు, స్కూలు యూనిఫామ్స్ కాంట్రాక్టులు యోగిస్తాయి. దేవతా ద్రవ్యాల వ్యాపారం కూడా బాగానే వుంటుంది. ఈవ్యాపారాల్లో మీ ప్రయత్నాలు చేయండి.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ