భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నా జగన్నాథశర్మ, శివానందాశ్రమం, సికింద్రాబాద్
ప్ర:ఆధ్యాత్మిక రంగంలో పురోగతి, జ్ఞానయోగం ఉన్నదా?
సమా:‘యుజ్యతి ఇతియోగః’ అని నిర్వచనం. అంటే సమ్మేళనం- వ్యక్తిని ఆశ్రయించిన ఆత్మను, పరమాత్మలో లీనం చేయాలి. బిందువును సింధువుతో కలపటం వంటిది. దానికి అనేక విధాలైన మార్గాలను భగవద్గీతలో గీతాచార్యుడు వివరించాడు. అందులో జ్ఞానయోగం కూడా ఒకటి. అయితే జ్ఞానయోగంలో ఎంత జ్ఞానాన్ని సంపాదించినా మరికొంత సందేహం పీడిస్తూనే ఉంటుంది. అందుకే ‘జ్ఞానేన నప్రమదితవ్యం’ అని ఉపనిషత్తులు హెచ్చరించాయి. భక్తియోగం చాలా సులభసాధనం- సంపూర్ణ విశ్వాసంతో కూడిన భక్తియోగానికి జ్ఞాన వైరాగ్యాలు తోడైతే అది సంపూర్ణమైన ఆధ్యాత్మిక యోగం- శివానంద సరస్వతులవారి యోగసాధన- జపయోగ గ్రంధాలుతోపాటు శ్రీమద్భగవద్గీత పారాయణం చేయండి. మీకు తప్పక జ్ఞానసిద్ధి కలుగుతుంది.
పరాశరం గోవిందరాజాచార్యులు, తిరుపతి (చిత్తూరు)
ప్ర:ఆధ్యాత్మిక సాధనకు జ్యోతిషశాస్త్రం సహకరిస్తుందా లేక ఆటంకమా?
సమా:ఆధ్యాత్మిక సాధనకు జ్యోతిషశాస్త్రం ఉత్తమమైన సాధనం. ముఖ్యంగా నిష్కామ కర్మయోగ సాధనకు చాలా ఉపయోగం- యన్నక్షేత్రే- తద్దైవత్యాసు తిథిషుకార్యం’ అని జ్యోతిషశాస్త్రం చెపుతుంది. ఏ యే సమయాల్లో ఏ యే యజ్ఞకర్మలు చేయాలి. దానికి మనకు గల అర్హతలు ఏమిటి అనేది జ్యోతిషశాస్త్రం తెలియజేస్తుంది. ఆ విధంగా మోక్షసాధనకు జ్యోతిషశాస్త్రం మహోన్నత సాధనం.
అనదాసు సత్యనారాయణ, పెద్దాపురం (తూ.గో.)
ప్ర:్భర్య అనారోగ్యం, కీళ్ళనొప్పులు
సమా:ప్రతిరోజూ సూర్యోదయత్పూర్వం స్నానం చేసి తులసి పూజ చేసి ఒక తులసి పత్రంలో కొంచెం తేనె బృందాదేవికి నివేదన చేసి- ఆ ప్రసాదం అంటే ఆ తులసి పత్రం- తేనె ఆరగించమనండి. ఇంకా వైద్య చికిత్స కూడా చేయిస్తే తప్పక ఆరోగ్యం చేకూరుతుంది.
నూతలపాటి శివరామయ్య, నంద్యాల, ఆం.ప్ర.
ప్ర:మా అమ్మాయి స్కూటర్ పోయింది. దొరుకుతుందా?
సమా:తప్పక ప్రభుత్వ సహాయంతో దొరుకుతుంది. బహుశా ఇప్పటికే దొరికి ఉండాలి.
సూర్య సత్యేశ్వరి, విజయనగరం, ఆం.ప్ర.
ప్ర:రావలసిన డబ్బు రావటంలేదు? ఎప్పటికి రాగలదు?
సమా:ఇంకా సమయం పడుతుంది. కొంత కష్టనిష్ఠురం కూడా కలుగుతుంది. బహుశా కోర్టుదాకా వెళ్ళవలసి రావచ్చు. లేదా పలుకుబడి గలిగిన వ్యక్తి సహాయమైనా కావచ్చు. దైవికంగా అయితే కౌబేర పాశుపత రుద్రాభిషేకాలు కాని- కుబేర యంత్ర పూజ కాని చేయండి. లేదా చేయించండి.
నూకల రాంచందర్, మెహబూబాబాద్ (వరంగల్)
ప్ర:నేను హైదరాబాద్‌లో ఇంటిస్థలం కొని ఇల్లు కట్టాలనుకుంటున్నాను. ఎప్పటివరకు సాధ్యం.
సమా:స్థలం కొనటంలోనే మీలో తటపటాయింపు కారణంగా ఆలస్యమవుతుంది. నిర్మాణం తొందరగానే అవుతుంది.
పి.నారాయణ, బరంపురం (ఒడిస్సా)
ప్ర:్భవిష్యత్తులో ఆరోగ్యం
సమా:ప్రమాదాలనుండి జాగ్రత్తగా ఉండండి.
ఎస్.బి.రావు, కావలి (నెల్లూరు)
ప్ర:ఈ జన్మలో నాకు వివాహయోగం వుందా?
సమా:షరతులు- జాతకాల పట్టింపులు వదులుకుంటే వచ్చే సంవత్సరం వివాహయోగం ఉంది.
టి.హరికృష్ణ, ప్రొద్దుటూరు, కడప
ప్ర:బంధువులవల్ల, పొరుగువారివల్ల సమస్యలు. అసూయ- స్పర్థలు- శతృత్వాలు-
సమా: ‘ద బెస్ట్ వే టు డీల్ విత్ ఎన్ అప్పొనెంట్ ఈజ్ టు ఇగ్నోర్ హిమ్’ అని ఆంగ్లంలో సూక్తి- ఇతరులు మిమ్ము పట్టించుకున్నదానికన్నా మీరే వాటిని ఎక్కువగా పట్టించుకుంటున్నారు. మీ జాతకంలో రవి, చంద్రులు అష్టమంలో, సప్తమంలో శనిదేవుడు ఉన్నాడు. నివారణా శాంతిగా ప్రతి సోమవారం ఉదయం గణేశ దేవాలయానికి వెళ్ళి పావు కిలో అటుకులు- పావుకిల బెల్లం, ఒక చెరుకు ముక్క- నాలుగు రూపాయలు స్వామికి సమర్పించి బ్రాహ్మణునికి దానం చేయండి. మనశ్శాంతి కలుగుతుంది.
ఉయ్యాల గోపి, పెనుమాక, గుంటూరు
ప్ర:ప్రభుత్వోద్యోగం-
సమా: గట్టిగా ప్రయత్నిస్తే దూర దేశంలో దొరికే అవకాశం వుంది.
బి.బంగారురాజు - దెందులూరు (ప.గో.)
ప్ర:‘ద్వా’ అక్షరం మొదట గల గ్రామంలో నాకు అనుకూలమా?
సమా:అనుకూలము కాదు. పూర్తిగా ప్రతికూలం.
వి.తులసీదాస్, సూర్యనగర్, హైదరాబాద్
ప్ర:మా అమ్మాయి పేరున గల స్వంత యింటికి వెళ్ళాలనుకుంటున్నాను బాగుంటుందా?
సమా:ఆదరణ- ఆప్యాయతలు దొరికితే వెళ్లవచ్చు! అయితే ఆడకూతురు కనుక తప్పక ప్రతిఫలం చెల్లించాలి.
జి.నాగప్ప, గుత్తి, అనంతపురం
ప్ర:ఏ కారణంవల్లనో కాని మా తెగవారిని ‘తిరుపతి దొంగలు’ అంటారు. మా వైపు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించరాదు అంటారు. మాకు స్వామి దర్శనం కావాలంటే ఏం చేయాలి.
సమా:ఒక కాలంలో వీరశైవం- వీరవైష్ణవం చెలరేగిన కాలంలో మీ ప్రాంతంలో వీరభద్రస్వామి ప్రాబల్యం కూడా బాగా ఉండేది. ఆ కాలంలో ఏర్పడిన ఒక దురాచారమది. మీరు తప్పక శ్రీవారి దర్శనం చేసుకోండి. అందరి భక్తులవలెనే వెళ్లండి.
బి.వెంకట సుధాకర్, ఆత్మకూరు, నెల్లూరు
ప్ర:నాకు స్వంత యింటి కల నెరవేరుతుందా?
సమా:కలలు కంటూ కూర్చుంటే కలలోనే నెరవేరుతుంది. ప్రయత్నిస్తే నిజవౌతుంది.
పి.సత్యనారాయణ, రాజమండ్రి (తూ.గో.)
ప్ర:దీర్ఘకాలిక అనారోగ్యం
సమా:మీకు ఉదరంలో ఉష్ణవాయువు సంబంధంగా కాని ఇంకా మరేదైనా కాని అనారోగ్య కారణంగా కనిపిస్తున్నది. జన్మనక్షత్రం ప్రకారం అర్థాష్టమశని రాబోతోంది. నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించండి. ఉదరంలో దోషం అయినట్టయితే మామూలు వైద్యంగా కర్పూరాదివటి ఒక మాత్ర పరగడుపున వేసుకొని నీళ్ళు తాగండి (ముందుగా వైద్యుని కూడా సంప్రదించండి).
పడాల రాములు, పెద్దపల్లి (కరీంనగర్)
ప్ర:మా చిన్నమ్మాయి పెళ్లి చేసుకోను అంటోంది. ఏం చేయమంటారు?
సమా:బహుశా ఏవైనా వివాహ సంబంధమైన సమస్యలు విన్న కారణంగా అట్లా అంటుందేమో- లేదా ఆమె మనసులో చెప్పలేని కోరిక ఏదైనా ఉన్నదేమో - ఓపిగ్గా కనుక్కోండి.
ఎమ్.ప్రేమసాయి, కొంతూరు (ప.గో.)
ప్ర:ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటానికి ఏ గ్రహం కారణం?
సమా:అది జాతక లగ్నాన్ని బట్టి నిర్ణయించాలి. స్థిరత్వం లేకపోవటానికి కారణం- రవిదోషం, రాహుదోషం.
ఎమ్.నాని, పాలకొల్లు (ప.గో.)
ప్ర:్భమి సమస్య
సమా:మీరు చెపుతున్నంత స్పష్టంగా డాక్యుమెంట్లు ఉన్నట్టు లేవు. ఏవో కొన్ని సాంకేతిక కారణాలైనా కావచ్చు. ఆ ఆటంకాలు తొలగిపోతే సమస్య పరిష్కారమవుతుంది.
కామిడి సతీశ్‌రెడ్డి, పరకాల, వరంగల్
ప్ర:హన్మకొండలో ప్లాటు ఉన్నది. ఇల్లు కట్టగలనా?
సమా:స్ర్తి సహాయంతో నెరవేరగలదు. బహుశా ఆ ప్లాటు కూడా ఆడువారిపేరుమీదనే ఉన్నదేమో? ఏదైనా ఒక స్ర్తి ప్రమేయం మీ ప్రయత్నంలో భాగం కాగలదు.
అవుతు సత్యనారాయణరెడ్డి, పెనుమాక (గుంటూరు)
ప్ర:నాకు ఉద్యోగమా? వ్యాపారమా?
సమా:మీకు విద్యాయోగం బాగుంది. విద్యిపట్లనే ఏకాగ్రత చూపండి. భవిష్యత్తు బాగుంది. వివాహయోగం కూడా కలిగే అవకాశం ఉంది. ఆ తర్వాతే మిగతావన్నీ.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

ఉమాపతి బి.శర్మ