భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర:్భవన చంద్రశేఖరరావు, విజయవాడ (ఆం.ప్ర)
ప్ర: గత వారం ఒకరికి సమాధానం చెపుతూ, తిరుమలస్వామిని ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శించండి అన్నారు. అదేమిటి దైవదర్శనం ఎన్నిసార్లయినా పుణ్యమే కదా!
సమా: ప్రభువు అంటే రాజుగారివద్దకు- అత్తవారింటికి, దాయాదుల ఇంటికి, మహాక్షేత్రాలకు ప్రత్యేక సమయాలలోనే వెళ్లాలి కాని పదే పదే వెళ్లకూడదు అని పెద్దలు చెప్పిన నీతివాక్యం. తరచుగా వెళుతూ ఉంటే నిర్లక్ష్య భావం ఏర్పడుతుంది. ‘అతిస్నేహాత్ అవజ్ఞా’ అని సంస్కృతంలోనూ, ‘ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెమ్ట్’ అని ఇంగ్లీషులోనూ సూక్తులు ఉన్నాయి.
తులసీ ప్రసన్న, ఉండీ (ప.గో, ఆం.ప్ర)
ప్ర: చాలా విషయాలలో మీ సూచనలు, సలహాలు మాకు ఎంతగానో ఉపకరించాయి. ధన్యవాదాలు. ప్రస్తుతం మా పాపకు మంచి పేరు సూచించండి.
సమా: మీ పాపది పూర్వాభాద్ర నక్షత్రం. అయితే జన్మ నక్షత్ర పాదములననుసరించి ‘సో’ అనే అక్షరం జన్మ నామంగా వస్తుంది. అయితే ఇదే అక్షరం వ్యవహార నామంగా కూడా పెడుతూ ఉంటారు. అది సరియైన పద్ధతి కాదు. మీ పాపకు బేసి సంఖ్య అక్షరాలుగా కల ‘మే’ అనేవి మొదటగా ఉండేలా చూడండి.
బి.్భక్షపతిరావు, గుంటూరు (ఆంధ్ర)
ప్ర: స్వామీ! మీరు చెప్పిన ప్రకారం చెప్పిన సమయానికే ఇల్లు పూర్తయింది. గృహ ప్రవేశం చేస్తాము. మీరు చెప్పిన తరువాత ఇబ్బంది కూడా నిజమయి బంధువుల కారణంగా కరెంట్ సమస్య వచ్చింది. పరిష్కారం చెప్పండి.
సమా: మీ సమస్య ఫిబ్రవరిలో పరిష్కారమవుతుంది. అంతవరకూ ఓపిక పట్టండి. వివాదాన్ని పెంచుకోకండి.
వి.వెంకటేశ్వర్లు, అమలాపురం (తూ.గో)
ప్ర: అనారోగ్యం- అజీర్ణం- గ్యాస్ట్రిక్ సమస్య - పరిష్కారం చెప్పండి.
సమా:దైవ సేవగా ప్రతి ఆదివారం ప్రాతకాలంలో ఆంజనేయస్వామి గుడికి వెళ్లి యాభై నాలుగు ప్రదక్షిణములు చేసి తెల్ల జిల్లేడు పూలమాలతో ఆంజనేయస్వామికి మన్యుసూక్తంతో పూజ చేయించండి. గృహ వైద్యంగా భోజనంలో మొదటి ముద్దలో హింగ్వష్టకచూర్ణం నెయ్యి కలిపి భుజించండి. రాత్రివేళ పడుకునే ముందు కర్పూరాదివటి చప్పరించి మింగండి. వారం రోజుల్లో గుణం కనిపిస్తుంది.
జి.కృష్ణవేణి, చైతన్యపురి, హైదరాబాద్
ప్ర: మా నాన్నగారి ఆస్తిలో భాగం కోసం కోర్టులో వేసాం. జయించగలమా?
సమా: మీది న్యాయశాస్త్రానికి సంబంధించిన ప్రశ్న- నాకు తెలిసినంతవరకు అనువంశికమైన ఆస్తి అయితే మీకూ భాగం వస్తుంది. తండ్రిగారి స్వార్జితమైతే వీలునామా రాయకపోతే కూడా మీకు భాగం ఉంటుంది. కాని బంధువులతో కనుక రాజీతో వెళ్లడం మంచిది.
గుఱ్ఱంకొండ గురవప్ప, మదనపల్లి (చిత్తూరు)
ప్ర: సంబంధించిన వివాదం- పరిష్కారం చెప్పండి.
సమా: ఇంట్లో వాయవ్య దిశ వాస్తు సరిచూసుకోండి. వాస్తు గణపతి యంత్ర ప్రతిష్ఠ చేయించండి. స్థానిక వాస్తు పండితులను సంప్రదించండి.
జి.నందకిశోర్, ఒంగోలు (ప్రకాశం జిల్లా)
ప్ర: ఇంటి వాస్తు ప్లాను
సమా: మీరు పంపిన ప్లాను ప్రకారం దక్షిణ ఆగ్నేయంలోని ఖాళీ స్థలం ఎత్తుగా చేసి మీ ఇంటినుండి వేరుగా చిన్నగా దాటగలిగే గోడ పెట్టి వేప- పూల మొక్కలు పెంచండి. పడమర ద్వారంగా మీరు చెప్పేది అసలుగా వాయువ్య ద్వారం- అది మూసివేయండి.
పి.ఇ.సత్యనారాయణ పట్నాయక్, శ్రీకాకుళం, ఆంధ్ర
ప్ర: స్వప్నఫలం
సమా:స్వప్న శాస్తర్రీత్యా స్థిరాస్తి సంబంధమైన విషయమేదో బాధిస్తోంది మిమ్మల్ని. ఆధునిక స్వప్నారోగ్య శాస్త్ర రీత్యా మేహవాతం శరీరంలో పెరిగినట్లు కనిపిస్తోంది. అల్లమూ- నిమ్మకాయ- తేనె కలుపుకొని (నీళ్ళల్లో) ఉదయం పూట కొంచెం తాగండి.

వండ్రం నాగలక్ష్మి, పెరవలి (ప.గో.)
ప్ర: నాకు మంచి పేరు సూచించండి.
సమా: జన్మ నక్షత్రం తెలియనిదే చెప్పడం సాధ్యం కాదు.

షేక్ సలీమా, పెదకాకాని, గుంటూరు
ప్ర: విజయదశమినాడు హోటల్ ప్రారంభించాము. బాగుంటుందా?
సమా: హోటల్ పేరు- యజమాని పేరు - స్థలం వాస్తు కూడా పరిశీలించాలి.
ఎన్.శివశంకరరావు, విశాఖపట్నం- ఆంధ్ర
ప్ర: వ్యాపారము- ఆరోగ్యము
సమా: రెండూ వేరు వేరు విషయాలు- వ్యాపార సంబంధంలో భాగస్వామ్యమైతే భాగస్తులతో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య రీత్యా పొత్తికడుపు - లివర్ సంబంధంగా జాగ్రత్తలు తీసుకోండి.
బి.యశ్వంత్ రెడ్డి, పద్మాకాలనీ- హైదరాబాద్
ప్ర: సివిల్స్‌లో విజయం
సమా: ఆలస్యంగా సాధించే అవకాశం వుంది. ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండండి.

వంగల సత్యనారాయణ, కాకినాడ (తూ.గో.)
ప్ర: దంపతులమిద్దరమూ దైవసేవకు అంకితం కావాలని కోరిక- కుటుంబ పరంగా సమస్యలు అడ్డుపడుతున్నాయి. మాకు మార్గం చూపించండి.
సమా: ధారేషణ- ధనేషణ- ప్రద్రేషణ- వీటినే తాపత్రయాలు అంటారు. విముక్తి పొందటానికి ఆత్మ శక్తికావాలి వైరాగ్యం రావాలి. అది సాధించండి.
ఎస్.మధు, బాదేపల్లి, మెహబూబ్‌నగర్
ప్ర: వివాహాలస్యం- బంధువులతో వ్యతిరేకత- పరిష్కారం చెప్పండి.
సమా: వివాహానికి కుజ- శనుల- జాతక దోషాలు పరిహరంగా మంగళ - శనివారాలు ఏకభుక్తంగా ఉపవాస వ్రతం పాటించండి. మంగళవారం గోవుకు- శనివారం- కాకులకూ దాణా వేయండి. బంధు విరోధానికి విఘ్నేశ్వరార్చన ప్రతి సోమవారం చేయండి. శుభం జరుగును.
ఎమ్.సుదర్శనాబాయి - మదనపల్లి, చిత్తూరు
ప్ర: మీరు చెప్పిన ప్రతి విషయమూ మాకు అక్షరాలా నిజమయింది. మా ఇంట్లో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. పరిష్కారమేమిటి?
సమా: ఇంట్లో కార్తవీర్యార్జున యంత్రం ప్రతిష్ఠించండి. కనీసం ప్రధాన ద్వారానికి దిగ్బంధన యంత్రం తగిలించండి.

ఎన్.ఇంద్రాణి, విజయవాడ (కృష్ణా)
ప్ర: సంతాన యోగం
సమా: మీకు దగ్గరలోనే కల మోపీదేవి క్షేత్రం దర్శించండి. ముడుపు కట్టండి. సంతాన వేణుగోపాలస్వామి రక్షా యంత్ర ధారణ చేయండి. వీలయితే దంపతులిద్దరూ వ్యక్తిగతంగా కలవండి.
జి.సావిశ్రీ, కొత్తగొడెం (తెలంగాణ)
ప్ర: ప్రభుత్వోద్యోగ యోగం ఉందా?
సమా: ఆలస్యంగా కొంత ధన వ్యయంతో- ఉన్నచోటికి దూరంగా ఉత్తర దిశలో ఫలించే అవకాశం ఉంది.
వై.నాగేంద్రబాబు, కుప్పం, చిత్తూరు
ప్ర: మహాశయా! మీరు చెప్పినట్లుగా నూటికి నూరుపాళ్లు నిజం- స్థిర నిశ్చయం లేని కారణంగా చాలా వివాహ సంబంధాలలు వదులుకున్నాను. స్థిరత్వం కోసం ఏం చేయాలి? వివాహం ఎప్పుడు?
సమా: వివాహ సిద్ధికోసం ‘స్వయంవర కళా వివాహ సిద్ధి’ యంత్రం రక్షగా ధరించటం మంచిది. ఆ ప్రాంతంలో మంత్ర శాస్తవ్రేత్తలెవరైనా వుంటే సంప్రదించండి. లేదంటే ప్రత్యేకంగా ఉత్తరం రాయండి.
బి.హరీశ్‌కుమార్, కూచిపూడి (కృష్ణా)
ప్ర: ప్రభుత్వోద్యోగం
సమా: మీ జాతకంలో స్వతంత్ర వృత్తియోగం- భాగస్వామ్య వ్యాపారం సూచనలున్నాయి. ముఖ్యం పెన్ - పేపర్ స్టేషనరీ- పత్రికా రంగాలు కనపడుతున్నాయి. ఏదైనా పత్రిక ఏజెన్సీ కోసం ప్రయత్నించండి.
కె.కామేశ్వరరావు, నరసరావుపేట, గుంటూరు
ప్ర: ఏ వ్యాపారం బాగుంటుంది?
సమా: వస్త్రాలు - సువాసన ద్రవ్యాలు - అలంకార వస్తువులు- ఖాద్య వస్తువులు అంటే బిస్కెట్స్ వంటివి.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ